Begin typing your search above and press return to search.

కొత్త ప్రియుడితో మ‌లైకా 19ఏళ్ల ఏజ్ గ్యాప్?

మలైకా అరోరా వ్యక్తిగత జీవితం, కొత్త రిలేషన్‌షిప్ వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్. దాదాపు ఆరేళ్ల పాటు త‌న‌కంటే చిన్న వ‌య‌సు హీరో అర్జున్ క‌పూర్ తో డేటింగ్ చేసిన మ‌లైకా ఇటీవ‌ల ఒంట‌రిగా ఉంటోంది.

By:  Sivaji Kontham   |   22 Feb 2026 6:26 PM IST
కొత్త ప్రియుడితో మ‌లైకా 19ఏళ్ల ఏజ్ గ్యాప్?
X

మలైకా అరోరా వ్యక్తిగత జీవితం, కొత్త రిలేషన్‌షిప్ వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్. దాదాపు ఆరేళ్ల పాటు త‌న‌కంటే చిన్న వ‌య‌సు హీరో అర్జున్ క‌పూర్ తో డేటింగ్ చేసిన మ‌లైకా ఇటీవ‌ల ఒంట‌రిగా ఉంటోంది. అయితే 50 ప్ల‌స్ వ‌య‌సులోను మ‌లైకా ఫీట్లు నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో సంచ‌ల‌నంగా మారుతున్నాయి.

తాజా స‌మాచారం మేర‌కు.. మ‌లైకా ఇప్పుడు కొత్త‌గా రిలేష‌న్ లో అడుగుపెట్టింది. హర్ష్ మెహతా అనే 33ఏళ్ల వ్యాపారితో సన్నిహితంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఈ జోడీ రోమ్‌లో విహారయాత్రను ఆస్వాధిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అక్కడ వారు చాలా అన్యోన్యంగా కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం మొదలైంది.

ఎవరీ హర్ష్ మెహతా?

హర్ష్ మెహతా ఎవ‌రు? అంటే.. అత‌డు వ‌జ్రాల వ్యాపారి. వయస్సు 33. బాలీవుడ్ సెలబ్రిటీల సర్కిల్‌లో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. గతంలో ఎన్రిక్ ఇగ్లేసియాస్ సంగీత కచేరీలో కూడా మ‌లైకాతో క‌లిసి అత‌డు కనిపించడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి.

అయితే మ‌లైకా వ‌య‌సు కంటే అత‌డి వ‌య‌సు చాలా చిన్న‌ది. మలైకా వయస్సు 52 ఏళ్లు కాగా, హర్ష్ వయస్సు 33 ఏళ్లు. వీరి మధ్య ఉన్న 19 ఏళ్ల వయస్సు అంతరంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో మలైకాను టార్గెట్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేస్తుండగా, అభిమానులు మాత్రం అది ఆమె వ్యక్తిగత ఇష్టమని, త‌న‌ జీవితాన్ని త‌న‌కు నచ్చినట్లు గడిపే హక్కు ఉందని మద్దతుగా నిలుస్తున్నారు.

సింగిల్ ఆల్బ‌మ్స్ తో వైర‌ల్..

కెరీర్ విషయానికి వస్తే.. మలైకా కేవలం వ్యక్తిగత విషయాలకే పరిమితం కాకుండా తన వృత్తిపరమైన బాధ్యతల్లోనూ బిజీగా ఉన్నారు. ఇటీవల యో యో హనీ సింగ్ తో ఆమె చేసిన కొలాబరేషన్ సాంగ్ వైరల్ అవ్వడమే కాకుండా కొంత వివాదానికి కూడా దారితీసింది. 52 ఏళ్ల వయస్సులో కూడా తన ఫిట్‌నెస్‌తో యువతకు గట్టి పోటీనిస్తున్న మ‌లైకా మునుముందు ఎలాంటి సంచ‌ల‌నాల‌కు తెర తీస్తుందో వేచి చూడాలి.