బోయ్‌ఫ్రెండ్‌తో మలైకా అరోరా ఫ్యామిలీ నైట్ అవుట్!
బాలీవుడ్ స్టైల్ ఐకాన్ మలైకా అరోరా వ్యక్తిగత జీవితం ఎప్పుడూ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంటుంది.
By: Srikanth Kontham | 25 May 2026 4:00 PM ISTబాలీవుడ్ స్టైల్ ఐకాన్ మలైకా అరోరా వ్యక్తిగత జీవితం ఎప్పుడూ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంటుంది. అర్జున్ కపూర్‌తో విడిపోయిన తర్వాత అమ్మడు వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుతూ వస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా ప్రముఖ డైమండ్ వ్యాపారి హర్ష్ మెహతాతో డేటింగ్‌లో ఉన్నారంటూ బాలీవుడ్ వర్గాల్లో గట్టిగా ప్రచారం సాగుతోంది. తాజాగా వీరిద్దరూ నగరంలో కలిసి కనిపించడంతో ప్రేమాయణం పుకార్లు మరోసారి బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఈసారి జరిగిన ప్రత్యేక నైట్ అవుట్‌లో మలైకా, హర్ష్ మాత్రమే కాకుండా, మలైకా కుమారుడు అర్హాన్ ఖాన్ కూడా వారితో కలిసి సందడి చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.
హర్ష్ మెహతా తన కారులో మలైకా అరోరా తల్లి ఇంటికి చేరుకుని అక్కడి నుంచి మలైకాను, ఆమె కుమారుడు అర్హాన్‌ను పికప్ చేసుకున్నారు. అంతేకాదు వారి వెంట మలైకా ఎంతో ఇష్టంగా పెంచుకునే పెంపుడు కుక్క (పెట్ డాగ్ కూడా ఉంది. తల్లి నివాసం నుండి బయటకు వస్తున్న సమయంలో అర్హాన్ తన పెంపుడు శునకాన్ని ఎంతో అపురూపంగా ఎత్తుకుని కారు వైపు రావడం మీడియా కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ ఫ్యామిలీ ఔటింగ్ సమయంలో తీసిన ఫోటోలు ,వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
మాజీ భర్త అర్బాజ్ ఖాన్ కుమారుడైన అర్హాన్ ఖాన్, కెమెరా ఫ్లాష్‌లను చూసి ఎంతో రిలాక్స్‌గా ,సాధారణంగా కనిపించాడు. అయితే మలైకా అరోరా మాత్రం మీడియా హడావుడిని గమనించి కెమెరా కంటికి చిక్కకుండా ఉండేందుకు తల దించుకుని కారు వైపు వెళ్లగా కారు ముందు సీట్లో కూర్చున్న హర్ష్ మెహతా పాపరాజీల నుండి తప్పించుకోవడానికి చేతిని అడ్డుగా పెట్టుకోవడం వీడియోలలో స్పష్టంగా కనిపించింది. ఈ క్యాజువల్ నైట్ అవుట్ కోసం మలైకా - హర్ష్ సాధారణ దుస్తులలో కనిపించడం విశేషం. మలైకా అరోరా ఓవర్‌సైజ్డ్ స్ట్రైప్డ్ టీ-షర్ట్ - లూజ్ బాటమ్స్ ధరించగా, హర్ష్ మెహతా సింపుల్ వైట్ టీ-షర్ట్‌లో కనిపించారు. యువకుడు అర్హాన్ ఖాన్ బ్లాక్ టీ-షర్ట్, లైట్ కలర్ ట్రౌజర్స్ ,మెస్సీ హెయిర్‌స్టైల్‌తో ట్రెండీగా దర్శనమిచ్చాడు.
ముగ్గురూ కలిసి రాత్రి సమయాన్ని గడిపిన అనంతరం హర్ష్ తిరిగి మలైకా ,అర్హాన్‌లను వారి నివాసం వద్ద డ్రాప్ చేశారు. మలైకా, హర్ష్‌ల మధ్య ఉన్న సంబంధంపై గత కొంతకాలంగా అనేక ఊహాగానాలు వస్తున్నా? ఇద్దరు ఇప్పటి వరకు తమ బంధంపై ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు. అయినా? గతంలో రోమ్ నగరంలో కలిసి దిగిన వెకేషన్ ఫోటోలు, ముంబైలోని జైన్ దేవాలయ సందర్శనలు తరచూ నగరంలో జరిగే డిన్నర్ డేట్లు వీరి మధ్య ఏదో ప్రత్యేకమైన అనుబంధం ఉందనే విషయానికి బలాన్ని చేకూరుస్తున్నాయి.
