గ్రీకు అందాలతో సెగలు పుట్టిస్తున్న మలైకా అరోరా!
మలైకా అరోరాను చూస్తే అమ్మాయిలు సైతం కుళ్ళుకునేలా తన అందాలతో ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది.
By: Madhu Reddy | 17 July 2026 12:00 PM ISTవరుస సినిమాలు, నిత్యం షూటింగ్ లతో బిజీగా గడిపేస్తూ తమకంటూ సమయాన్ని కేటాయించుకోలేక సతమతమవుతున్న ఎంతోమంది సెలబ్రిటీలు.. కాస్త సమయం దొరికితే చాలు వెకేషన్ కి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు. ముఖ్యంగా మన ఇండియన్ సెలబ్రిటీలు ఎక్కువగా విదేశాలను ఎంచుకుంటూ.. తమ ట్రిప్ లో భాగంగా నచ్చిన దేశానికి వెళ్ళిపోతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడ వారు ఎంజాయ్ చేయడమే కాదు.. ఆ ప్రాంతాలను మనకి కూడా పరిచయం చేస్తూ ఇంస్టాగ్రామ్ వేదికగా అలరిస్తున్నారు.
టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు ఎంతో మంది సెలబ్రిటీలు ఇలా పక్క దేశాలకు వెకేషన్ కి వెళ్ళిపోయి అక్కడి అందాలను పరిచయం చేస్తూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక బ్యూటీ తన వెకేషన్ లో భాగంగా గ్రీకు దేశానికి వెళ్ళింది యూరోపియన్ అందాలను చూపిస్తూ ఇంస్టాగ్రామ్ వేదికగా సందడి చేసింది. 52 ఏళ్ల వయసులో కూడా నిత్యం యవ్వనంగా కనిపిస్తూ గ్లామర్ టచ్ తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
మలైకా అరోరాను చూస్తే అమ్మాయిలు సైతం కుళ్ళుకునేలా తన అందాలతో ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది మలైకా.. అందులో భాగంగానే గ్రీక్ అందాలతో అభిమానులను ఆకట్టుకున్న ఈమె.. అక్కడ విలాసవంతమైన రిసార్ట్ అందాలను కూడా చూపించింది. బికినీను తలపించేలా డ్రస్సులు ధరించి తన గ్లామర్ టచ్ తో కుర్రకారు గుండెల్లో గుణపం దింపేసింది.. ఒకవైపు గ్లామర్ అందాలు మరొకవైపు గ్రీకు వేసవి సెలవుల్లో తన గ్లామర్ తో హీట్ పుట్టించేసింది మలైకా అరోరా. ఇక తాజాగా తన వెకేషన్ లో భాగంగా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
వీజేగా తన కెరీయర్ ను మొదలుపెట్టి.. హోస్ట్ గా అవతరించి అందరి దృష్టిని ఆకట్టుకున్న మలైకా అరోరా.. నటి మాత్రమే కాదు డాన్సర్, మోడల్ గా కూడా మంచి పేరు సొంతం చేసుకుంది. 1990 నుండే స్పెషల్ సాంగ్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అరోరా మీడియాలో మాత్రం ఫిట్నెస్ ఐకాన్ గా గుర్తించబడింది. సల్మాన్ ఖాన్ సోదరుడు ప్రముఖ నటుడు, నిర్మాత అయిన అర్భాజ్ ఖాన్ ను వివాహం చేసుకున్న ఈమె తన భర్తతో కలిసి నిర్మాతగా అరంగేట్రం చేసింది. అమీర్ ఖాన్ దంగల్ చిత్రాన్ని అర్భాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. ఇక భర్తతో పలు చిత్రాలను నిర్మించిన ఈమె మధ్యలో విభేదాలు రావడంతో 2017లో అతడి నుంచి విడిపోయింది. ఒక కొడుకు కూడా ఉన్నారు.
ఇకపోతే మలైకా అరోరా తన సినిమాల కంటే కూడా వ్యక్తిగత కారణాలవల్లే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. వయసులో తనకంటే చిన్న వారైనా అర్జున్ కపూర్ తో చాలాకాలం ప్రేమలో ఉన్నట్లు వార్తలు కూడా వినిపించాయి. ఇక తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త , వజ్రాల వ్యాపారి అయినా హర్ష్ మెహతాతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి వీరు తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా. బహిరంగ కార్యక్రమాలలో, విమానాశ్రయాలలో పలు వెకేషన్లలో తరచూ కలిసి కనిపిస్తుండడంతో సోషల్ మీడియాలో ఈ జంటపై విస్తృతంగా వార్తలు వినిపిస్తున్నాయి.
