మలైకా అల్ట్రా గ్లామరస్ మాయ.. స్టన్నింగ్!
"ఫ్యాషన్ అంటే ఇదే," "మలైకా వయసు కేవలం నెంబర్ మాత్రమే," అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
By: M Prashanth | 16 Aug 2025 11:13 AM ISTబాలీవుడ్ స్టార్ మలైకా ఆరోరా ఫ్యాషన్ వరల్డ్ ఎల్లప్పుడూ కూడా ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఇక లేటెస్ట్ గా ఆమె ఓ ఈవెంట్‌లో డిజైనర్ గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన గ్లిటరింగ్ వైట్ గౌన్‌లో మెరిసిపోయారు. సింపుల్ హెయిర్, సిల్వర్ హీల్స్, మినిమల్ జ్యువెలరీతో ఆమె రెడ్ కార్పెట్‌పై ఓ రాయల్ ప్రెజెన్స్ ఇచ్చారు. ఈ ఫోటోలు బయటకువచ్చిన వెంటనే అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది.
"ఫ్యాషన్ అంటే ఇదే," "మలైకా వయసు కేవలం నెంబర్ మాత్రమే," అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో మలైకా గ్లామరస్ ప్రెజెన్స్ మరోసారి చర్చనీయాంశమైంది. రెడ్ కార్పెట్ ఈవెంట్‌లో ఎవరినీ మించి ఆకట్టుకునేలా కనిపించడం మలైకా ప్రత్యేకత అని అభిమానులు చెబుతున్నారు.
మలైకా మొదట మోడలింగ్‌తో ప్రారంభించి తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. 1998లో "దిల్ సే" సినిమాలోని "ఛయ్యా ఛయ్యా" పాటతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత "మున్నీ బద్నామ్" వంటి ఐటమ్ సాంగ్స్‌తో సూపర్ పాపులర్ అయ్యారు. సినిమాల్లో ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్ చేసినప్పటికీ, డాన్స్ నంబర్స్, రియాలిటీ షోలు, ఫ్యాషన్ ఈవెంట్స్ ద్వారా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సృష్టించుకున్నారు.
ఇటీవల ఆమె సినిమా కంటే ఎక్కువగా ఫిట్‌నెస్, ఫ్యాషన్, టెలివిజన్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. యోగా క్లాసులు, హెల్త్ రూటీన్స్ ద్వారా కూడా మలైకా యువతలో హెల్త్ ఇన్స్పిరేషన్‌గా నిలుస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండి, తన లైఫ్‌స్టైల్ అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం మలైకా కొత్త సినిమాలకన్నా ఫ్యాషన్ షోలు, రియాలిటీ ప్రోగ్రామ్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టారు.
