50+ వయసులో హీరోయిన్ రెండో పెళ్లి..!
బాలీవుడ్‌లో చయ్య చయ్య అంటూ సాగే ప్రత్యేక పాటతో అలరించిన ముద్దుగుమ్మ మలైకా అరోరా. తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా నిలిచింది.
By: Ramesh Palla | 17 Aug 2025 6:00 PM ISTబాలీవుడ్‌లో చయ్య చయ్య అంటూ సాగే ప్రత్యేక పాటతో అలరించిన ముద్దుగుమ్మ మలైకా అరోరా. తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా నిలిచింది. అయితే హీరోయిన్‌గా ఈ అమ్మడు ఎక్కువ సినిమాల్లో నటించలేదు. ఈమెకు ఎక్కువగా ఐటెం సాంగ్స్‌తోనే ఆఫర్లు వచ్చాయి. ఆకట్టుకునే అందం తో పాటు, మంచి డాన్సర్ రావడంతో మలైకా అరోరాకి ఎక్కువగా ఆ తరహా పాత్రలు, పాటలు వచ్చిన విషయం తెల్సిందే. మలైకా అరోరా సినిమాల కంటే ఎక్కువగా వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలిచింది. ఈమె విడాకులు తీసుకున్న కారణంగా ఆ మధ్య చాలా పెద్ద రచ్చ జరిగింది. ఒక యంగ్ హీరో కారణంగానే ఈమె విడాకులు తీసుకుందనే వార్తలు జోరుగా వచ్చాయి. విడాకుల తర్వాత ఇద్దరూ చట్టాపట్టాలేసుకుని తిరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయినట్లుగా సమాచారం అందుతోంది.
బాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్
మలైకా అరోరా బాలీవుడ్ యంగ్ హీరోను వివాహం చేసుకోబోతుందనే వార్తలు వచ్చాయి. అయిదు పదుల వయసు ఉన్న మలైకా అరోరా తన వయసు కంటే దాదాపు పది పదిహేను ఏళ్ళు చిన్నవాడు అయిన కుర్ర హీరో ను వివాహం చేసుకుంటుంది అంటూ ప్రచారం జరిగింది. పిల్లలు పెద్ద వారు అవుతున్న ఈ సమయంలో మలైకా పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ కొందరు విమర్శలు చేశారు. అలా మలైకా అరోరా సుదీర్ఘ కాలం పాటు వివిధ వివాదాల కారణంగా వార్తల్లో ఉంటూ వచ్చింది. ఇప్పుడు ఆ కుర్ర హీరోతో ప్రేమ బ్రేకప్ కావడంతో ఈమె పెళ్లి గురించి మరిచి పోయిందా అంటూ అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మలైకా అరోరా మాట్లాడుతూ తాను రెండో పెళ్లికి సిద్ధం అన్నట్లుగా ప్రకటించింది. అంతే కాకుండా తనకు తగ్గ వాడి కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
రెండో పెళ్లిపై మలైకా అరోరా క్లారిటీ
తాజా ఇంటర్వ్యూలో మలైకా అరోరా మాట్లాడుతూ... రెండో పెళ్లి చేసుకోవడం అనేది తప్పుడు నిర్ణయం అని నేను అనుకోవడం లేదు. నాకు నచ్చిన వాడు తారస పడితే పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను అతడి కోసం అన్వేషిస్తున్నాను. తప్పకుండా నేను అతడిని త్వరలో కనుగొంటాను అనే నమ్మకం ఉంది అన్నట్లుగా చెప్పుకొచ్చింది. నేను హార్ట్ కోర్ రొమాంటిక్‌ను. నేను ప్రేమను ఎప్పటికీ నమ్ముతాను. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను. నేను ఎప్పుడూ ప్రేమించబడాలి అని కోరుకుంటాను. అంతే కాకుండా నేను నన్ను ప్రేమించే వారిని ప్రేమించాలని అనుకుంటాను అంటూ కొత్త థియరీ ఆఫ్ లవ్ ను మలైకా అరోరా చెప్పిన విషయం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రేమ లేని చోట కలిసి ఉండటం అనేది ఖచ్చితంగా మరణంతో సమానం అన్నట్లుగా ఆమె వ్యాఖ్యలు చేసింది.
విడాకులపై మలైకా స్పందన
నేను చిన్నతనంలో వివాహం చేసుకున్నాను. కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో నన్ను చాలా మంది స్వార్థపరులు అంటూ విమర్శించారు. అయినా కూడా నేను నా స్వేచ్చ కోసం ముందుకు వెళ్లాను. విడాకుల్లోనూ నేను సంతోషం వెతుక్కున్నాను. అందుకే నా జీవితంలో అత్యంత కీలకమైన విషయంగా దాన్ని నేను భావిస్తాను. రెండో పెళ్లి విషయంలో నాకు ఎప్పుడూ పాజిటివ్ ఒపీనియన్ ఉంది. అందుకే నేను చాలా వరకు రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాను. అందుకే మంచి వ్యక్తి తారస పడితే రెండో పెళ్లి విషయంలో ముందుకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగా మలైకా అరోరా చెప్పకనే చెప్పింది.
