Begin typing your search above and press return to search.

52 వ‌య‌సులో అదే నా ఎన‌ర్జీ.. ఇందులో ఏం ఉంది పెద్ద విష‌యం? మ‌లైకా ఆవేద‌న‌!

వ‌య‌సు ఒక నంబ‌ర్ మాత్ర‌మేన‌ని నిరూపించిన ఫిట్నెస్ ఫ్రీక్ మ‌లైకా అరోరా. 52 వ‌య‌సులోను ఎన‌ర్జిటిక్ డ్యాన్సులు, ఫ్యాష‌న్ షోలతో దుమారం రేపుతోంది ఈ బ్యూటీ.

By:  Sivaji Kontham   |   14 Jan 2026 11:55 AM IST
52 వ‌య‌సులో అదే నా ఎన‌ర్జీ.. ఇందులో ఏం ఉంది పెద్ద విష‌యం? మ‌లైకా ఆవేద‌న‌!
X

వ‌య‌సు ఒక నంబ‌ర్ మాత్ర‌మేన‌ని నిరూపించిన ఫిట్నెస్ ఫ్రీక్ మ‌లైకా అరోరా. 52 వ‌య‌సులోను ఎన‌ర్జిటిక్ డ్యాన్సులు, ఫ్యాష‌న్ షోలతో దుమారం రేపుతోంది ఈ బ్యూటీ. వ‌య‌సుతో సంబంధం లేకుండా ఎంతో ఆత్మవిశ్వాసంతో తనపై వస్తున్న ట్రోలింగ్‌కు ధీటైన సమాధానం ఇస్తుంటారు. ఇప్పుడు మ‌రోసారి త‌న‌దైన గ‌ట్సీ ఆన్స‌ర్ తో మ‌లైకా చ‌ర్చ‌ల్లోకొచ్చారు.

`ద నమ్రతా జకారియా షో`లో పాల్గొన్న మ‌ల్లా.. ఐటెం సాంగ్స్ (స్పెషల్ నంబర్స్) చేయడం తనను తాను శక్తివంతంగా మ‌లుచుకునేలా చేస్తాయని తెలిపారు. మలైకా మాట్లాడుతూ.. ''నేను 52 ఏళ్ల వయస్సులో కూడా ఇవన్నీ చేయగలుగుతున్నానంటే, నేను ఏదో ఒక విషయంలో సరైన మార్గంలోనే ఉన్నానని అర్థం. దీని గురించి నేను క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారు.. ట్రోల్ చేస్తుంటారు.. కానీ అందులో పెద్ద విషయం ఏముందో నాకు అర్థం కాదు'' అని అన్నారు.

డ్యాన్స్ అనేది నా విష‌యంలో ఒక భావ వ్యక్తీకరణ అని మ‌లైకా అన్నారు. ఐటెం సాంగ్స్ చేయడం వల్ల తనకు ఎంతో ధైర్యం, ఆత్మవిశ్వాసం లభిస్తాయ‌ని చెప్పారు. ఇత‌రులు తనను ఒక ఉదాహరణగా తీసుకుని, తమకు నచ్చిన పనిని చేస్తూ సంతోషంగా ఉంటే, తాను సాధించిన విజయం అదేనని తాను భావిస్తున్న‌ట్టు తెలిపారు.

ఛ‌య్య ఛ‌య్య మొద‌లు కెరీర్ లో ఎన్నో చార్ట్ బ‌స్ట‌ర్ పాట‌ల్లో న‌ర్తించిన మ‌లైకా అరోరా.. గత ఏడాది (2025) మలైకా రెండు భారీ హిట్‌లను తన ఖాతాలో వేసుకున్నారు. యో యో హనీ సింగ్ పాట `చిల్గమ్` మ‌రో విజ‌యాన్ని అందించింది. ఆదిత్య సర్పోత్దార్ సినిమా `థామ్మా` లోని `పాయిజన్ బేబీ` త‌న‌కు మంచి మైలేజ్ ని పెంచింది.

ఛయ్య ఛయ్య మొదలు..మున్నీ బద్నామ్ హుయి..... అనార్కలీ డిస్కో చలీ... ఇలా ఎన్నో స్పెషల్ సాంగ్స్ లో మ‌లైకా దుమ్ము రేపారు. వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే.. ఆత్మవిశ్వాసం- శ్రమ ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆమె నిరూపిస్తున్నారు. 50 ప్ల‌స్ లోను లైవ్ వైర్ లా అద‌ర‌గొట్టేయ‌డం మ‌లైకా స్టైల్. దానిని ప్ర‌శంసించాల్సింది పోయి, వెన‌క‌బాటుత‌నం ప్ర‌ద‌ర్శించే నెటిజ‌నుల విష‌యంలో జాలి ప‌డ‌కుండా ఉండ‌గ‌ల‌మా?