20 ఏళ్ల చిన్నోడితో డేటింగ్? నిజమేనా మేడమ్?
ఇప్పటికే అర్బాజ్ ఖాన్ తో విడాకులు, అర్జున్ కపూర్ తో డేటింగ్ సాగించిన ఆ 52 ఏళ్ల బోల్డ్ బ్యూటీ.. ఇప్పుడు మరో యువ వ్యాపారితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.
By: M Prashanth | 18 Dec 2025 8:00 PM ISTప్రేమకు వయసుతో సంబంధం లేదని అంతా చెబుతుంటారు అది నిజమే కాదో పక్కన పెడితే.. కొందరిని చూస్తే అది నిజమా అని అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఓ బ్యూటీ.. తనకన్నా 20 ఏళ్ల చిన్నోడితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపించారు. ఇంతకీ ఎవరామే?
ఎవరో కాదు.. ఆమె బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా.. స్టన్నింగ్ లుక్స్, డ్రెస్సింగ్ స్టైల్, రిలేషన్ షిప్.. ఇలా ఆమె గురించి ప్రతి విషయం కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంటుంది. దీంతో సినిమాలతో సంబంధం లేకుండా అమ్మడు.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుందనే చెప్పాలి. అంతే కాదు ఎప్పుడూ ఆమె కోసం డిస్కషన్ నడుస్తోంది.
ఇప్పటికే అర్బాజ్ ఖాన్ తో విడాకులు, అర్జున్ కపూర్ తో డేటింగ్ సాగించిన ఆ 52 ఏళ్ల బోల్డ్ బ్యూటీ.. ఇప్పుడు మరో యువ వ్యాపారితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ముంబైకి చెందిన 32 ఏళ్ల డైమండ్ వ్యాపారి హర్ష్ మెహతాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్ గా ఇద్దరూ పలుమార్లు కలిసి కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.
పలు ప్రత్యేక కార్యక్రమాలతోపాటు ఇటీవల ముంబై విమానాశ్రయంలో కూడా వారిద్దరూ కలిసి కనిపించడంతో పుకార్లకు ఆజ్యం పోసినట్లయింది. త్వరలోనే వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోనున్నారని సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మరి డేటింగ్ తో పాటు మ్యారేజ్ విషయంలో అసలు నిజమేంటో వారిద్దరికే తెలియాలి.
అయితే మోడల్, డ్యాన్సర్, యాంకర్ గా బాలీవుడ్ కు మలైకా సుపరిచితురాలే. స్పెషల్ సాంగ్స్ తో ప్రత్యేక గుర్తింపు ఆమె సొంతమైంది. తెలుగులో కూడా స్పెషల్ సాంగ్స్ చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన అతిధి సినిమాలో స్పెషల్ సాంగ్ తో సందడి చేసిన అమ్మడు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో కూడా మెరిసింది.
సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకొని.. 2017లో విడిపోయింది మలైకా. ఆ తర్వాత తనకంటే వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసింది. కానీ ఇటీవల ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం సింగిల్ గా ఉన్న మలైకా.. మొన్నా మధ్య రాహుల్ విజయ్ తో ప్రేమలో పడిందని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు 20 ఏళ్లు చిన్న అయినా డైమండ్ వ్యాపారితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్టు ఉంది.
