హీరో అయ్యేంత కొడుకున్నా ఏమిటీ భంగిమలు.. మలైకాపై ఫైర్
పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ లో `కెవ్వు కేక` అంటూ అద్భుత నృత్యంతో ఆకట్టుకుంది మలైకా.
By: Sivaji Kontham | 8 Nov 2025 4:48 PM ISTచెలి చయ్య చయ్యా చైయ్యా ..(దిల్ సే మూవీ) అంటూ దాదాపు రెండున్నర దశాబ్ధాల క్రితమే ఒక ఊపు ఊపిన మలైకా అరోరా, మున్నీ బద్నామ్ హుయ్ వంటి హిట్ నంబర్ తో తన స్థాయిని ఆవిష్కరించింది. మలైకా నృత్య సామర్థ్యాన్ని ఎవరూ వేలు పెట్టి చూపించలేరు. జెన్ జెడ్ ని అలరించే అద్భుతమైన డ్యాన్సింగ్ విన్యాసాలు మలైకా ప్రత్యేకత. 6 నుంచి 60 వయసు వరకూ వయో భేధంతో పని లేకుండా ఊగిపోతారు.
పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ లో `కెవ్వు కేక` అంటూ అద్భుత నృత్యంతో ఆకట్టుకుంది మలైకా. అయితే అప్పట్లోనే మలైకా వృద్ధాప్యం గురించి చాలా చర్చ సాగింది. ఇటీవలే తన 50వ బర్త్ డే జరుపుకున్నానని చెప్పుకున్న మలైకా వయసును తక్కువ చేసి చెప్పడంపై చాలా విమర్శలొచ్చాయి. మూడేళ్ల క్రితం యాభయ్యవ పుట్టినరోజు జరుపుకున్న మలైకా వయసును ఎందుకు దాచేస్తోందో అర్థం కావడం లేదని చాలా మంది వేలెత్తి చూపారు.
ఇంతలోనే ఇప్పుడు తన వయసును విమర్శించిన వారికి కౌంటర్ గా మరో స్పెషల్ నంబర్ తో ముందుకు వచ్చింది. అయితే ఈ పాటలో హద్దులు చెరిపేసి తనలోని బ్యాడ్ యాంగిల్ ని చూపించిందని మలైకాపై విరుచుకుపడుతున్నారు నెటిజనం. ఒక నెటిజన్ వ్యాఖ్యానిస్తూ, మలైకా ఈ పాటలను క్లాసీగా చూపించేది, ఇప్పుడు అది బాధగా అనిపిస్తుంది.
`చికిరి చికిరి చిల్‌గమ్` ఎప్పటిలాగే రొటీన్ గా ఉంది. యోయో హనీసింగ్ అద్భుతమైన గానం, మలైకా ఎనర్జిటిక్ నృత్యం ఆకట్టుకున్నా కానీ, ఇందులో న్యూ**తో కూడుకున్న భంగిమలు నిరాశపరిచాయి. మలైకా 50 ప్లస్ వయసు మమ్మీ. పైగా హీరో అయ్యేంత పెద్ద కొడుకు తనకు ఉన్నాడు. అయినా ఇలా అసభ్యకర నృత్యాలు చేస్తోంది అంటూ విమర్శించారు. హనీ సింగ్ ఎప్పుడూ ఏదో ఒక పెప్ తన పాటలో ఉండాలనుకుంటాడు. దానికి తగ్గట్టే లిరిక్ ని మౌల్డ్ చేస్తాడు. ఇప్పుడు చికిరి చికిరి కూడా ఇదే బాపతు. కానీ లేట్ ఏజ్ భామ అసభ్యకర భంగిమల కారణంగా అతడు కూడా విమర్శల పాలవుతున్నాడు. దీనికంటే విజువల్ బ్యూటీతో కూడుకున్న అందమైన సింగిల్ ఆల్బమ్ లను రూపొందించాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. మలైకా తన వయసుకు తగ్గ వేషాలు వేయాలని కూడా కొందరు సూటిగా సూచిస్తున్నారు.
