టోన్డ్ అందాలతో గుబులు పుట్టించిన మలైకా
మలైకా అరోరా పరిచయం అవసరం లేదు. పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ లో `కెవ్వు కేక` సాంగ్ తో అలరించిన ఈ బ్యూటీ ఐటమ్ భామగా బాలీవుడ్ లోను ఫేమస్.
By: Sivaji Kontham | 10 Aug 2025 6:00 PM ISTమలైకా అరోరా పరిచయం అవసరం లేదు. పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ లో `కెవ్వు కేక` సాంగ్ తో అలరించిన ఈ బ్యూటీ ఐటమ్ భామగా బాలీవుడ్ లోను ఫేమస్. ముఖ్యంగా సల్మాన్ సోదరుడు ఆర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యువహీరో అర్జున్ కపూర్ తో ప్రేమాయణం సాగించిన మలైకా నిరంతరం వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం అర్జున్ నుంచి బ్రేకప్ అయిన మలైకా ఒంటరిగా ఉంది. ఇటీవల పూర్తిగా తన కెరీర్ పైనే ఫోకస్ చేసింది.
కొద్దిరోజుల క్రితం కుమారుడు అర్హాన్ ఖాన్ తో కలిసి విదేశీ విహార యాత్ర నుంచి ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది మలైకా. ఈ యాత్రలోను మలైకా ఎక్కడా తగ్గలేదు. వరుసగా బికినీ ఫోటోలను షేర్ చేసి ఆశ్చర్యపరిచింది. మలైకా బీచ్ షికార్లు ఎల్లపుడూ చర్చగా మారుతున్నాయి.
తాజాగా ముంబైలో గౌరవ్ గుప్తా బ్రైడల్ కాంటూర్ కలెక్షన్ లాంచ్ ఈవెంట్‌లో మలైకా అరోరా గుబులు రేపే రూపంతో కవ్వించింది. ఏజ్ లెస్ బ్యూటీకి 50 వయసు అంటే నమ్మశక్యం కాదు. వైట్ హాఫ్ షోల్డర్ కటౌట్ గౌన్ లో మలైకా దివ్యమైన రూపం యువహృదయాలను కదిలించింది. ముఖ్యంగా మలైకా టోన్డ్ దేహశిరులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేదిక ఏదైనా కచ్ఛితంగా మలైకా ఆ వేదికకు కేంద్రక ఆకర్షణగా మారుతోంది. ఇప్పుడు కూడా తన దివ్యమైన రూపంతో మతులు చెడగొట్టింది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే..మలైకా అరోరా ఇటీవల బుల్లితెరపై రియాలిటీ షోల జడ్జిగా కొనసాగుతోంది. ముఖ్యంగా డ్యాన్స్ రియాలిటీ షోల జడ్జిగా బాగానే ఆర్జిస్తోంది. మరోవైపు ముంబైలో ఫ్యాషన్ ఈవెంట్లలోను మలైకా షో స్టాపర్ గా నిలుస్తోంది. సెలబ్రిటీ ఈవెంట్లు, ఫంక్షన్లలో మలైకా స్టన్నర్ గా నిలుస్తోంది.
