విడిపోయినా మాజీకి టార్చ్ లైట్‌లా మారిన యంగ్ హీరో
బాలీవుడ్‌లో ఒకప్పుడు మోస్ట్ టాకింగ్ కపుల్‌గా నిలిచిన జోడీ మలైకా అరోరా- అర్జున్ కపూర్. దాదాపు ఆరేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట 2024లో తమ బంధానికి అధికారికంగా ముగింపు పలికారు.
By: Sivaji Kontham | 15 Jun 2026 5:00 PM ISTబాలీవుడ్‌లో ఒకప్పుడు మోస్ట్ టాకింగ్ కపుల్‌గా నిలిచిన జోడీ మలైకా అరోరా- అర్జున్ కపూర్. దాదాపు ఆరేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట 2024లో తమ బంధానికి అధికారికంగా ముగింపు పలికారు. తాము విడిపోయామనే విషయాన్ని అర్జున్ కపూర్ స్వయంగా బహిరంగంగానే ప్రకటించారు. అయితే సాధారణంగా సెలబ్రిటీలు విడిపోయిన తర్వాత ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం లేదా పూర్తిగా దూరంగా ఉండటం చూస్తుంటాం. కానీ మలైకా-అర్జున్ మాత్రం విడిపోయినా ఒకరి విషయంలో ఒకరు ఎంతో పరిణతితో, గౌరవప్రదంగా వ్యవహరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
మలైకా- అర్జున్ జోడీ ఆఫ్టర్ బ్రేకప్ కూడా కలిసి పబ్లిక్ ఫంక్షన్లలో కనిపించడం చర్చగా మారుతూనే ఉంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. విడిపోయినా అర్జున్ కపూర్ ఇప్పటికీ మలైకా జీవితంలో ఒక `టార్చ్‌లైట్` లాగా ఆమెకు అండగా నిలుస్తున్నారని.. ఆమెపై ప్రత్యేకమైన శ్రద్ధను కనబరుస్తున్నారని బాలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తోంది. ఒకరి వ్యక్తిగత విషయాలను మరొకరు గౌరవిస్తూ... ఎక్కడా వివాదాలకు తావు లేకుండా తమ సంబంధాన్ని ఎంతో హుందాగా మెయింటైన్ చేస్తున్నారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మలైకా అరోరా తమ బంధం, బ్రేకప్ గురించి ఎంతో నిజాయితీగా మాట్లాడారు. ఏ బంధమైనా విడిపోయేటప్పుడు సహజంగానే వచ్చే కోపం, బాధ, వేదన వంటి మానసిక దశలన్నింటినీ తాను అనుభవించానని అంగీకరించారు. అయితే ఆ చేదు జ్ఞాపకాలను పక్కన పెడితే.. అర్జున్ కపూర్ ఇప్పటికీ తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా కొనసాగుతున్నారని మలైకా ఓపెన్‌గా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలే వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఎంత బలమైనదో స్పష్టం చేస్తోంది.
2018లో ప్రారంభమైన వీరి ప్రేమాయణం ఆరేళ్ల పాటు బాలీవుడ్ మీడియాలో ఒక హాట్ టాపిక్‌గా నిలిచింది. వీరి వయసు వ్యత్యాసంపై ఎన్నో ట్రామాలకు, ట్రోలింగ్స్‌కు ఆస్కారం కల్పించినా వాటన్నింటినీ ఎదుర్కొని ఒకరికొకరు తోడుగా నిలిచారు. ఆ తర్వాత 2024లో విడిపోయినా తమ వ్యక్తిగత జీవిత పరిణామాలను గోప్యంగా ఉంచుతూ.. మీడియా ముందు ఎలాంటి ఫిర్యాదులు చేసుకోకుండా పరస్పర గౌరవాన్ని చాటుకున్నారు. ఒకరికొకరు ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలబడటమే ఈ మాజీ జంట ప్రత్యేకత.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఇద్దరికీ సంబంధించిన పాత జ్ఞాపకాలు, టైమ్‌లైన్ రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. విడిపోయిన తర్వాత కూడా వీరిద్దరి మధ్య కనిపిస్తున్న ఈ సాన్నిహిత్యం, పరస్పర గౌరవం చూస్తుంటే.. మలైకా- అర్జున్ మళ్లీ కలిసేందుకు అవకాశం ఉందా? అనే చర్చ అభిమానుల్లో గట్టిగా మొదలైంది. మరి కాల గమనంలో ఈ మాజీ జంట తమ మనస్పర్థలను వీడి మళ్లీ ఒక్కటవుతుందో.. లేక ఇలాగే మంచి స్నేహితులుగా.. ఒకరికొకరు గైడ్‌లుగా మిగిలిపోతారో వేచి చూడాలి.
