Begin typing your search above and press return to search.

భ‌ర్త‌తో బ్రేక‌ప్.. ఇన్నాళ్టికి ఓపెనైన మ‌లైకా

మ్యారేజ్ బ్రేక్ అవ్వాల‌ని ఎవ‌రూ కోరుకోరు క‌దా.. కానీ విడిపోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని అర్థ‌మైంది. క‌లిసి ఉండాల‌ని ప్ర‌య‌త్నించినా చివ‌రికి కుద‌ర‌లేదు.

By:  Sivaji Kontham   |   21 Aug 2025 8:00 AM IST
భ‌ర్త‌తో బ్రేక‌ప్.. ఇన్నాళ్టికి ఓపెనైన మ‌లైకా
X

స‌ల్మాన్ ఖాన్ సోద‌రుడు ఆర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయిన మ‌లైకా అరోరాఖాన్ .. బ్రేక‌ప్ స‌మ‌యంలో చాలా సూటిపోటి మాట‌ల‌ను ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే. ఆమె స్వార్థ‌ప‌రురాలు! అంటూ విమ‌ర్శించారు. యువ‌హీరో అర్జున్ క‌పూర్ తో డేటింగ్ పైనా చాలా విమ‌ర్శ‌లు ఎదురయ్యాయి. అయితే అన్నిటికీ అప్ప‌టికి మౌనంగా ఉన్నారు మ‌లైకా. ఇటీవ‌ల వీలున్న ప్ర‌తి వేదిక‌పైనా త‌న సంసారంలోని స‌మ‌స్య గురించి, అప్ప‌టి ప‌రిస్థితుల గురించి వివ‌ర‌ణ ఇస్తున్నారు.

అత‌డి నుంచి విడిపోవాల్సిన ప‌రిస్థితి. దానివ‌ల్ల మేం ఇద్ద‌రం సంతోషంగా ఉన్నాము. మా ఇద్ద‌రి నిర్ణ‌యం వ‌ల్ల నా కొడుకు విష‌యంలో కొంత సానుకూల ప్ర‌భావం ఉంద‌ని భావిస్తున్న‌ట్టు మ‌లైకా తెలిపారు. 1998 లో వివాహం చేసుకున్న ఈ జంట 2016 లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. వారికి అర్హాన్ అనే 22 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.

మ్యారేజ్ బ్రేక్ అవ్వాల‌ని ఎవ‌రూ కోరుకోరు క‌దా.. కానీ విడిపోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని అర్థ‌మైంది. క‌లిసి ఉండాల‌ని ప్ర‌య‌త్నించినా చివ‌రికి కుద‌ర‌లేదు. అలాగే బ్రేక‌ప్ అవ్వ‌డం అంటే ప్రేమ బ్రేక్ అయింద‌ని కాదు. చాలా ఎదురు చూశాక చివ‌రికి వ‌ర్క‌వుట్ కాద‌ని నిర్ణ‌యానికి వ‌చ్చాము అని మ‌లైకా తెలిపింది. ఈ బ్రేక‌ప్ వ‌ల్ల త‌న కుమారుడి జీవితంలోను సానుకూల ప్ర‌భావం క‌నిపించింద‌ని మ‌లైకా అన‌డం విశేషం. నేను ఎవ‌రినో సంతోష పెట్ట‌డానికి నా ఆనందాన్ని కోల్పోలేను. నేను సంతోషంగా ఉండాలి.. కానీ సంతోషంగా లేను! అని కూడా మ‌లైకా అన్నారు.

మీరు స్వార్థం అని అనుకున్నా.. ఈరోజు నేను మంచి స్థానంలో ఉండ‌టానికి ఇది కార‌ణమైందని మ‌లైకా తెలిపింది. నాకు నేనుగా సంతోషంగా ఉన్నాను. నాతో నేను సంతోషంగానే ఉన్నాను అని తెలిపారు. కొడుకు అర్హాన్ కోసం కోపేరెంటింగ్ చేయ‌డం అంత సులువైన‌ది కాదు. కొన్ని స‌వాళ్లు ఉన్నాయి. కానీ స‌మ‌తుల్య‌త క‌నుగొన‌డం ముఖ్యం. స‌హ పేరెంటింగ్ ద్వారా ప్ర‌తిరోజూ చాలా తెలుసుకోవాలి. ఇన్ని సంవ‌త్స‌రాల‌కు స‌మ‌తుల్య‌త‌ను క‌నుగొన్నాము! అని బ్రేక‌ప్ త‌ర్వాత‌ ఆర్భాజ్ తో ప్ర‌యాణంపైనా కూడా మ‌లైకా పేర్కొంది. ఆర్భాజ్ నుంచి విడిపోయాక మ‌లైకా ఇండివిడ్యువ‌ల్ గా మ‌రింత స్వేచ్ఛ‌గా వాణిజ్య ప్ర‌పంచంలో ఎదిగింది. రియాలిటీ షోల హోస్ట్ గా, జ‌డ్జిగాను రాణిస్తోంది.