నటుడితో కాఫీ కోసం తహతహలాడిన నాయకురాలు.. అపాయింట్‌మెంట్ ఇచ్చాడా?
అవును.. ప్రముఖ నటుడితో కాఫీ కోసం పాపులర్ రాజకీయ నాయకురాలు పరితపించడం ఇప్పుడు చర్చగా మారింది.
By: Sivaji Kontham | 5 Aug 2025 10:34 AM ISTఅవును.. ప్రముఖ నటుడితో కాఫీ కోసం పాపులర్ రాజకీయ నాయకురాలు పరితపించడం ఇప్పుడు చర్చగా మారింది. తాను అతడి నటనను ఇష్టపడతానని, చాలా వెబ్ సిరీస్ లలో అతడి డార్క్ షేడ్ పాత్రలను విలనిజాన్ని అమితంగా ఇష్టపడతానని బహిరంగంగా వ్యాఖ్యానించిన సదరు రాజకీయ నాయకురాలు, అతడిని కాఫీ డేట్ కి ఆహ్వానిస్తూ లేఖ రాసానని కూడా బహిర్గతం చేసారు. అయితే అతడి నుంచి రిప్లయ్ లేకపోవడం నిరాశపరిచింది.
లేఖ అందుకున్నా రిప్లయ్ లేదు:
నేను లేఖ రాసాను. సిగ్గు పడ్డాను.. కానీ అతడు కాఫీ కోసం రాలేదు. లేఖకు స్పందించలేదు! అని కూడా చెప్పింది. అంతేకాదు.. తన సహచర నాయకుడు, నటుడు అయిన ఒక వ్యక్తిని సదరు సీనియర్ నటుడితో కలిసి మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని కూడా కోరినట్టు తెలిపారు. అయితే అప్పటికే పార్లమెంటేరియన్ అయిన నటుడు సదరు నాయకురాలికి ఫోన్ లో మాట్లాడే అవకాశం కల్పించాడు. అలా మాట్లాడినప్పుడు చాలా సిగ్గు పడిపోయానని, తాను లేఖ రాసిన విషయాన్ని కూడా ఆ సమయంలో మర్చిపోయానని ఆమె చెప్పింది.
అన్ని కోణాల్లో అతడంటే ఇష్టం:
అయితే ఇదంతా ఒక టీవీ చానెల్ లైవ్ లో చెబుతుండడంతో అది వీక్షకులను అవాక్కయ్యేలా చేసింది. ఈ నాయకురాలు ఎవరో కాదు.. ఎప్పుడూ బహిరంగంగా బాహాటంగా ఉన్నది ఉన్నట్టు సూటిగా మాట్లాడేస్తూ, జంకూ గొంకూ లేకుండా నిజాలతో అదరగొట్టే ఆవేశపూరిత రాజకీయ నాయకురాలు మహువా మొయిత్రా గురించే ఇదంతా. ఒక పార్లమెంటరియన్ అయినా కానీ వాటన్నిటినీ తాత్కాలికంగా పక్కన పెట్టి బాలీవుడ్ నటుడిపై తన ప్రేమ గురించి బయటపెట్టింది. ఇదంతా సరదా సంభాషణే అయినా ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠిపై తన ప్రేమను దాచుకోకపోవడం చర్చగా మారింది. అతడు చాలా కూల్ నటుడు.. భయంకరమైన పాత్రల్లోను కనిపిస్తాడని ప్రేమను కురిపించింది మోయిత్రా.
అతడి లైనప్ పెద్దదే:
గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్, మీర్జా పూర్, స్పెషల్ ఓపీఎస్ సహా చాలా సినిమాలు, సిరీస్ లతో పేరు తెచ్చుకున్నారు. త్రిపాఠి 2026లో విడుదల కానున్న మీర్జాపూర్: ది ఫిల్మ్‌లో కలీన్ భయ్యా అవతారంలో కనిపిస్తాడు. తదుపరి స్ట్రీ 3లో కూడా నటించాడు. బీహార్ నేపథ్యంలో ఇంకా పేరు పెట్టని సామాజిక డ్రామా కోసం ఓమైగాడ్ 2 దర్శకుడు అమిత్ రాయ్‌తో తిరిగి కలుస్తున్నాడు. మహువా కు అతడు ఇంకా రిప్లయ్ ఇవ్వలేదు. కేవలం ఫోన్ లో మాట్లాడాడు. ఈ టాపిక్ రాజకీయ నాయకులకు సినిమా వాళ్లపై ఉండే క్రష్ గురించి చెబుతోంది.
