తమిళ్ ఆడియన్స్ సుహాస్ పెర్ఫార్మన్స్ చూసి గర్వపడతారు: హీరోయిన్ మహిమా
మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సెప్టెంబర్ 10న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కథానాయిక మహిమా నంబియార్ పాల్గొని స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.
By: M Prashanth | 6 Sept 2026 9:28 AM ISTసముద్రం బ్యాక్‌డ్రాప్‌లో జరిగే పడవ పోటీలు, డిఫరెంట్ ఎమోషన్స్ తో తెరకెక్కిన తమిళ చిత్రం మండాడి ఇప్పుడు తెలుగులోకి వస్తోంది. కథానాయకుడిగా సూరి, ప్రతినాయక పాత్రలో టాలీవుడ్ యాక్టర్ సుహాస్ నటించిన ఈ మూవీని దర్శకుడు మతిమారన్ పుగళేంది రూపొందించారు. స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉండగా, ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మించారు.
మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సెప్టెంబర్ 10న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కథానాయిక మహిమా నంబియార్ పాల్గొని స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.
కొద్దిసేపటి క్రితమే వేరే ఈవెంట్‌లో మీడియాను కలిసి, మళ్లీ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని మహిమ చిరునవ్వుతో ప్రసంగం మొదలుపెట్టారు.
ఈ సినిమాలో మహిళా నటీనటులకు కథలో అంతటి ప్రాధాన్యత, బలం ఉన్న పాత్రలు దక్కడం చాలా అరుదని చెప్పారు. ఈ చిత్రంలో ఏంజెల్ రక్కమ్మ అనే పాత్రను పోషించే అవకాశం తనకు దక్కడం దేవుడిచ్చిన గొప్ప వరంగా భావిస్తున్నట్లు తెలిపారు. తనపై పూర్తి నమ్మకం ఉంచి ఆ పాత్రను ఇవ్వడమే కాకుండా, ఉత్తమ ఔట్‌పుట్ రాబట్టడానికి తగిన ఇన్‌పుట్స్ అందించిన దర్శకుడు మతిమారన్‌కు మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం తమ టీమ్‌కు కొండంత బలాన్ని ఇచ్చిందన్నారు. మైత్రీ సంస్థ ఎంత పక్కాగా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తుందో అందరికీ తెలుసని, తమ సినిమా వాళ్ల చేతుల్లోకి వెళ్లడం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. అలాగే ప్రొడ్యూసర్ ఎల్రెడ్ కుమార్ గురించి మాట్లాడుతూ, నటీనటులు చేసిన చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌ను కూడా ప్రత్యేకంగా గుర్తించి మెచ్చుకునే నిర్మాతలు చాలా అరుదుగా ఉంటారని, ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే మరింత కాన్ఫిడెన్స్‌తో నటించగలిగానని గుర్తు చేసుకున్నారు.
టాలీవుడ్ హీరో సుహాస్ ఈ చిత్రంలో చేసిన నెగెటివ్ రోల్ గురించి మహిమ ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. సుహాస్ ఈ సినిమాలో ఇంక్రెడిబుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని భరోసా ఇచ్చారు. తెలుగు ఆడియన్స్ సుహాస్‌ను ఎంతగా ప్రేమిస్తున్నారో, ఈ సినిమాలో ఆయన నటన చూశాక తమిళ ప్రేక్షకులు కూడా అంతకుమించి గర్వపడతారని చెప్పారు.
కో యాక్టర్ రవీంద్ర విజయ్ నటనను స్వయంగా వెట్రిమారన్ ప్రశంసించారని, ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వెల్లడించారు. హీరో సూరిని ఆకాశానికెత్తుతూ మహిమా నంబియార్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో తెలుగు ప్రేక్షకుల నుంచి సూరికి లభిస్తున్న ఘన స్వాగతం చూసి చాలా ముచ్చటేసిందన్నారు.
కష్టం, అంకితభావం ఉంటే మనిషి ఏ స్థాయికైనా చేరుకోవచ్చనడానికి సూరి ప్రయాణమే ప్రత్యక్ష నిదర్శనమని కొనియాడారు. ఆయన పక్కన స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. పీటర్ హెయిన్ మాస్టర్ కంపోజ్ చేసిన రియలిస్టిక్ స్టంట్స్, జీవీ ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ సినిమాకు రెండు హైలెట్ గా నిలుస్తాయని మహిమ పేర్కొన్నారు. ఈ విజువల్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 10న థియేటర్లలోకి వస్తోందని, ప్రతి ఒక్కరూ థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుతూ తన స్పీచ్ ముగించారు.
