మహేష్ నెక్ట్స్ వాళ్లతోనేనా?
కెఎల్ నారాయణ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, ఎస్ఎస్ఎంబీ29 పూర్తవడానికి మూడేళ్లకు పైగా సమయం పడుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 26 Sept 2025 11:00 PM ISTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ కెరీర్లో 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కెఎల్ నారాయణ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, ఎస్ఎస్ఎంబీ29 పూర్తవడానికి మూడేళ్లకు పైగా సమయం పడుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు ఖాయం
బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ గా ఎలా అయితే గుర్తింపు తెచ్చుకున్నారో, ఎస్ఎస్ఎంబీ29 తర్వాత మహేష్ బాబు కు అదే విధంగా ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు దక్కుతుందని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ తన కెరీర్ విషయంలో ఎలాంటి తొందరపాటు లేకుండా ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.
డిసెంబర్ నాటికి లైన్ లో పెట్టనున్న మహేష్
అందులో భాగంగానే మహేష్ బాబు ఈ ఏడాది ఆఖరికి తన నెక్ట్స్ మూవీపై సైన్ చేయనున్నారని, అది కూడా పాన్ ఇండియన్ డైరెక్టర్ తోనే ఉంటుందని తెలుస్తోంది. రాజమౌళి సినిమా పూర్తయ్యాక మహేష్ తో సినిమా చేయాలని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తుందని,అందులో భాగంగానే ఇప్పటికే మైత్రీ నిర్మాతలు మహేష్ కు భారీ అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారని తెలుస్తోంది.
కెరీర్లో ప్రతీ సినిమాను బాగా ఆలోచించి సెలెక్ట్ చేసుకునే మహేష్, ఈ మూవీ విషయంలో కూడా అలానే టైమ్ తీసుకుని డెసిషన్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం నిర్మాతలు ఓ అగ్రశ్రేణి డైరెక్టర్ ను ఎంచుకోవాలని చూస్తున్నారట. మహేష్ పర్మిషన్ రాగానే స్క్రిప్ట్ మరియు డైరెక్టర్ లాక్ అవుతారని తెలుస్తోంది. కాగా గతంలో మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి మహేష్ శ్రీమంతుడు, సర్కారు వారి సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.
