RRR లో మహేష్ ఉంటే.. వ్వాటే క్రాస్ఓవర్
అందుకే సినిమాలో పాత్రలో కనిపించడం అసాధ్యమైనా.. సోషల్ మీడియాలో క్రాస్ ఓవర్ అంటూ ఫన్నీగా వీడియోస్ క్రేయేట్ చేస్తున్నారు.
By: M Prashanth | 6 Aug 2025 3:48 PM ISTఏ హీరోనైనా ఓ సినిమా తీశాక.. మరో హీరో ఫ్యాన్స్ ఆ సినిమాలో తమ అభిమాన నటుుడు ఉంటే ఆ పాత్రను ఇంకా బాగా చేసే వాడని అనుకుంటారు. కానీ, ఓసారి సినిమా రిలీజ్ అయ్యాక తాము అనుకున్న పాత్రలో తమ ఫేవరెట్ హీరోను చూడడం అసాధ్యం. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు నడుస్తుంది మీమ్స్, సోషల్ మీడియా కాలం.
అందుకే సినిమాలో పాత్రలో కనిపించడం అసాధ్యమైనా.. సోషల్ మీడియాలో క్రాస్ ఓవర్ అంటూ ఫన్నీగా వీడియోస్ క్రేయేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి తెరకెక్కించి ఆర్ఆర్ఆర్ సినిమా, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఉంటే సినిమా ఎలా ఉంటుందో ఫన్నీగా ఓ క్రాస్ ఓవర్ వీడియో క్రియేట్ చేశారు. ఇందులో మహేశ్ ఎవర్ గ్రీన్ క్యారెక్టర్ ఖలేజాలోని టాక్సీ రాజు పాత్రను ఇన్వాల్ చేసి కామెడీ పండించారు.
అయితే మహేశ్ ఖలేజా సినిమాలోని ఆయన డైలాగులు సోషల్ మీడియా మీమ్స్ లో ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యకంగాచెప్పనక్కర్లేదు. కొందమంది మీమ్స్ క్రియేటర్లకు ఖలేజా లోని మహేశ్ టెంప్లేట్స్ లేనిదే మీమ్ క్రియేట్ అవ్వదు. అలాగే ఈ సినిమాలో ప్రిన్స్ డైలాగులకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అలా ఆ డైలాగులను ఆర్ఆర్ఆర్ సినిమా విజువల్స్లో యాడ్ చేసి ఫన్నీ ఓ క్రాస్ ఓవర్ వీడియో చేశారు. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ దాకా దాదాపు 2.30 నిమిషాల నిడివితో ఈ వీడియో ఉంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహేశ్ హీరోగా తెరకెక్కిన ఖలేజా 2010లో రిలీజైంది. అయితే ఎప్పుడు సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కానీ, టీవీలో వచ్చినాక ఈ సినిమా మంచి స్పందన దక్కించుకుంది. ఇక సోషల్ మీడియాలో మహేశ్ డైలాగ్ లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే రీసెంట్ గా ఈ సినిమను మేకర్స్ రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో మాత్రం మూవీకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
కాగా, ప్రస్తుతం మహేశ్ - రాజమౌళి కలిసే సినిమా చేస్తున్నారు. SSMB 29 ప్రాజెక్ట్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటిదాకా అఫీషియల్ గా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
