మహేష్ ఈ కాంబో ఇప్పుడు లేనట్టే..!
సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా సెట్స్ మీద ఉంది. ప్రస్తుతం కెన్యా టాంజానియా ఫారెస్ట్ లో షూట్ జరుపుకుంటుంది.
By: Ramesh Boddu | 23 Sept 2025 12:01 PM ISTసూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా సెట్స్ మీద ఉంది. ప్రస్తుతం కెన్యా టాంజానియా ఫారెస్ట్ లో షూట్ జరుపుకుంటుంది. పాన్ వరల్డ్ సినిమాగా ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తో వస్తుంది. ఐతే ఈ సినిమా తర్వాత మహేష్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అన్న ఆసక్తికరమైన డిస్కషన్ ఉంది. ఐతే మహేష్ తో సుకుమార్, సందీప్ వంగ లాంటి డైరెక్టర్స్ తో నెక్స్ట్ పనిచేస్తాడన్న చర్చ నడుస్తుంది. ఐతే ముఖ్యంగా సందీప్ వంగతో మహేష్ సినిమా ఉంటుందని అంటున్నారు.
రాజమౌళి సినిమా తర్వాత మహేష్..
యానిమల్ సినిమా టైం లో మహేష్ తో సినిమా గురించి సందీప్ వంగ హింట్ ఇచ్చాడు. డెవిల్ అనే సినిమా మహేష్ తో చేయాలని అనుకున్నట్టు చెప్పాడు. ఆ సినిమా యానిమల్ కన్నా ఎక్కువ వైలెన్స్ తో ఉంటుందని అన్నాడు. ఐతే రాజమౌళి సినిమా తర్వాత మహేష్ చేసే సినిమా సందీప్ వంగతోనే అనే చర్చ మొదలైంది. సందీప్ ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత మహేష్ తోనే సినిమా అంటూ హడావిడి చేస్తున్నారు.
కానీ మహేష్ సందీప్ వంగ సినిమా అసలు డిస్కషన్ లోనే లేదని టాక్. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత సునీల్ నారంగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. సందీప్ వంగతో మహేష్ సినిమా అంటూ వస్తున్న న్యూస్ లో నిజం లేదని అన్నారు. మహేష్ తో సునీల్ నారంగ్ కలిసి ఏ.ఎం.బి మల్టీప్లెక్స్ ని మొదలు పెట్టారు. అది సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఐతే బిజినెస్ పార్ట్ నర్స్ గా ఉన్న వాళ్లు మహేష్ సినిమాల విషయంలో కూడా చర్చల్లో ఉంటారు.
మహేష్ కాదు చరణ్ తో..
ఈ క్రమంలో రాజమౌళి తర్వాత మహేష్ సందీప్ వంగతోనే సినిమా చేస్తాడా అన్న దానికి క్లారిటీ ఇచ్చారు. మహేష్ రాజమౌళి సినిమా గ్లోబ్ త్రొటెన్ సినిమాగా వస్తుంది. ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని ఈ సినిమా వస్తుంది. సందీప్ వంగ మహేష్ కాంబో ఇప్పుడు కుదరకపోయినా ఎప్పుడు వచ్చినా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది.
ఐతే సందీప్ వంగ మహేష్ తో కాదు రామ్ చరణ్ తో సినిమా ఉంటుందని టాక్. చరణ్ తర్వాత సందీప్ లైన్ లో అల్లు అర్జున్ కూడా ఉంటాడని తెలుస్తుంది. బాలీవుడ్ లో కూడా సందీప్ వంగకుస్ సూపర్ క్రేజ్ ఏర్పడింది. యానిమల్ తర్వాత సందీప్ చేసే బాలీవుడ్ స్టార్ ఎవరన్నది ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయ్యింది. మరి డైరెక్టర్ సందీప్ ప్లానింగ్ ఏంటో తెలియాల్సి ఉంది.
