మహేష్- జక్కన్న టైటిల్.. ముందే హింట్ ఇచ్చారా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో భారీ ప్రాజెక్టు రూపొందుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 11 Nov 2025 10:43 AM ISTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో భారీ ప్రాజెక్టు రూపొందుతున్న విషయం తెలిసిందే. అనౌన్స్మెంట్ నుంచే సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొనగా.. ఇప్పుడు వాటిని రాజమౌళి ఇంకా పెంచుతున్నారు. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉండి.. కొంతకాలంగా మ్యాసివ్ అప్డేట్స్ ఇస్తున్నారు.
ఇటీవల సినిమాలో నటిస్తున్న మాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ను కుంభగా పరిచయం చేసిన రాజమౌళి.. నిన్న గ్లోబ్ ట్రాటర్ పేరుతో సాంగ్ ను విడుదల చేశారు. సంచారి సంచారి అంటూ సాగే ఆ పాటకు చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించారు. కీరవాణి మ్యూజిక్ అందించగా.. శృతిహాసన్, కాలభైరవ కలిసి ఆలపించారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న పాట.. అందరినీ ఆకట్టుకుంటోంది. అదే సమయంలో ఇప్పుడు అందరి దృష్టి నవంబర్ 15వ తేదీపై ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆ రోజు బిగ్గెస్ట్ ఈవెంట్ జరగనున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో జక్కన్న మూవీ టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు.
దీంతో టైటిల్ ఏం ఫిక్స్ చేశారోనని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. నిజానికి గ్లోబ్ ట్రాటర్ అంటూ మూవీని మేకర్స్ ప్రమోట్ చేస్తుండగా.. అనేక టైటిల్స్ ఇప్ప ప్రచారంలోకి వచ్చాయి. ముందుగా గరుడ అంటూ..ఆ తర్వాత మహారాజా అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. వారణాసి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని ఇటీవల టాక్ వచ్చింది.
కానీ ఆ టైటిల్ తో ఇటీవల ఓ మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది. కాబట్టి అది ఫిక్స్ చేయలేదని క్లారిటీ వచ్చింది. దీంతో మరేం టైటిల్ ను పెట్టి ఉంటారని అంతా డిస్కస్ చేస్తుండగా.. ఇప్పుడు మరో పేరు ప్రచారంలోకి వచ్చింది. సంచారి అనే టైటిల్ ను మేకర్స్ ఖరారు చేసి ఉంటారని అనేక మంది నెటిజన్లు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
అందుకు కారణం నిన్న రిలీజ్ చేసిన పాటనే. ఎందుకంటే ఆ సాంగ్.. సంచారి.. సంహారి అంటూ సాగుతుంది. గ్లోబ్ ట్రాటర్ అంటే ప్రపంచ యాత్రికుడు.. సంచారి అంటే సంచారం చేసేవారు. అందుకే సంచారి అనే టైటిల్ ఫిక్స్ చేసి ఉంటారని.. అందుకే జక్కన్న పాటతో చిన్నపాటి హింట్ ఇచ్చారని పలువురు నెటిజన్లు అంచనా వేస్తున్నారు. అయితే జక్కన్న ఏం చేసినా మామూలుగా ఉండదు. ఎవరూ గెస్ చేయలేం. మరేం ఫిక్స్ చేశారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
