Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : వీరమల్లు పక్కనే 'అతడు' అదుర్స్‌

టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ హీరోలు అనగానే ముందు వినిపించే పేర్లలో మహేష్ బాబు, పవన్‌ కళ్యాణ్‌ పేర్లు ఖచ్చితంగా ఉంటాయి.

By:  Ramesh Palla   |   6 Aug 2025 11:25 AM IST
పిక్‌ టాక్‌ : వీరమల్లు పక్కనే అతడు అదుర్స్‌
X

టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ హీరోలు అనగానే ముందు వినిపించే పేర్లలో మహేష్ బాబు, పవన్‌ కళ్యాణ్‌ పేర్లు ఖచ్చితంగా ఉంటాయి. వారిద్దరికీ ఉన్న ఫ్యాన్‌ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరూ పాన్ ఇండియా మార్కెట్‌ పెద్దగా లేదు, కానీ తెలుగు రాష్ట్రాల్లో వారికి ఉన్న ఫాలోయింగ్‌ ఏ పాటిదో గతంలో పలు సార్లు నిరూపితం అయ్యింది. వీరిద్దరి కాంబోలో సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అది సాధ్యం కాలేదు, ముందు ముందు సాధ్యం కాకపోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలో మహేష్ బాబు డబ్బింగ్‌ చెప్పడం ద్వారా ఒక రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. ఆ సమయంలో ఇద్దరికీ కామన్‌ మిత్రుడు అయిన త్రివిక్రమ్‌ ఆ అరుదైన కలయికకు మూలం అయ్యారు. ఆ తర్వాత మళ్లీ అలాంటి చిన్న చిన్న కలయిక కూడా జరగలేదు.


పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు కటౌట్స్‌

ఇద్దరిని సింగిల్‌ స్క్రీన్‌ మీద చూడటం చాలా అదరుగా జరుగుతూ ఉంటుంది. ఒకటి రెండు సార్లు పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు వచ్చాయి. కానీ పవన్ రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి గా బిజీగా ఉన్న నేపథ్యంలో అది అసాధ్యంగా మారింది. ఇలాంటి సమయంలో పవన్‌ కళ్యాణ్‌ వీరమల్లుగా, మహేష్‌ బాబు అతడుగా సింగిల్‌ ఫ్రేమ్‌ లో కనిపించారు. అయితే రియల్‌గా కాకుండా ఇద్దరూ కటౌట్స్ లో కనిపించి అలరించారు. ప్రస్తుతం ఈ స్టిల్‌ సోషల్‌ మీడియాలో సునామి మాదిరిగా విస్తరిస్తుంది. ఏ థియేటర్‌ లో తీశారు, ఎవరు తీశారు అనే విషయాలు ఏమీ అక్కర్లేకుండానే అభిమానులు, నెటిజన్స్‌, ఇండస్ట్రీ వర్గాల వారు ఇలా ప్రతి ఒక్కరూ ఈ ఫోటోను షేర్‌ చేస్తున్నారు, అంతే కాకుండా సేవ్‌ చేసుకుంటున్నారు.

అతడు రీ రిలీజ్‌కి భారీ ఏర్పాట్లు

పవన్‌ కళ్యాణ్‌ నటించిన హరి హర వీరమల్లు సినిమా ఇంకా థియేటర్‌లో ఉంది. దానికి సంబంధించిన కటౌట్స్ భారీ ఎత్తున ఉన్నాయి. ఇక ఏ థియేటర్‌ లో అయితే వీరమల్లు ఆడుతుందో అదే థియేటర్‌లోని ఇంకో స్క్రీన్‌ లో మహేష్‌ బాబు హీరోగా నటించి కల్ట్‌ మూవీగా నిలిచిన అతడు రీ రిలీజ్ కాబోతున్న విషయం తెల్సిందే. అతడు రీ రిలీజ్ నేపథ్యంలో ఫ్యాన్స్ సందడి భారీ ఎత్తున చేస్తున్నారు. ముఖ్యంగా అతడు రీ రిలీజ్ కాబోతున్న కొన్ని థియేటర్ల వద్ద భారీ ఎత్తున హోర్డింగ్స్, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల విడుదలైన వీరమల్లు సినిమాకు ఏమాత్రం తగ్గకుండా అతడు సినిమా కటౌట్‌ ను భారీ ఎత్తున పెట్టడం జరిగింది. మహేష్‌ బాబు, పవన్‌ కళ్యాణ్‌ ల యొక్క కటౌట్‌ లను చూస్తూ ఉంటే కన్నుల పండుగ అన్నట్లుగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.

హై క్వాలిటీతో అతడు రీ రిలీజ్‌

మహేష్ బాబు అతడు సినిమా రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన అతడు సినిమాను మురళి మోహన్‌ జయభేరి సంస్థలో నిర్మించారు. ఇటీవల ఆయన మీడియా ముందుకు వచ్చి సినిమా రీ రిలీజ్ కి సంబంధించిన విషయాలను వెల్లడించారు. అతడు సినిమాను పూర్తిగా టెక్నాలజీని ఉపయోగించి అద్భుతంగా రూపొందించినట్లు చెప్పుకొచ్చాడు. సౌండ్‌ క్వాలిటీ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్త సినిమా చూసిన ఫీల్‌ అతడు సినిమాను చూస్తే కలుగుతుంది అనే నమ్మకంను ఆయన కలిగించాడు. కొత్త సినిమాల రేంజ్‌లో ఖచ్చితంగా అతడు సినిమా వసూళ్లు సాధిస్తుంది అనే విశ్వాసం వ్యక్తం అవుతుంది. వేల సార్లు బుల్లి తెరపై టెలికాస్ట్‌ అయినా, ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్నా థియేటర్‌ రీ రిలీజ్‌కి మంచి బజ్ ఉంది.