అల్లుడిని చూసి మామ గర్వంగా!
‘రామాయణం’లో రణ్‌బీర్ కపూర్ నటన చూసి మహేశ్ భట్ భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా రాముడిని 14 ఏళ్లు వనవాసానికి పంపే సన్నివేశం ఆయనను కదిలించిందని భార్య సోనీ రజ్దాన్ వెల్లడించారు. అల్లుడి నటనపై మహేశ్ గర్వపడుతుండగా, భర్త కష్టాన్ని అలియా భట్ కూడా ప్రశంసించారు.
By: Srikanth Kontham | 10 Nov 2026 12:26 PM ISTతనయులు ప్రయోజకులైతే? తండ్రులు ఎంతో గర్విస్తారు. వారతస్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని సంతోషిస్తారు. ఒకవేళ తనయులు సక్సెస్ కాకపోతే ఆ లెగస్సీని వారసురాళ్లు అందుకుని ముందుకు తీసుకెళ్తుంటారు. తాజాగా బాలీవుడ్ లెజెండరీ దర్శక, నిర్మాత మహేష్ భట్ విషయంలో అదే జరుగుతోంది. భట్ ఫ్యామిలీ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన అలియాభట్ బాలీవుడ్ లో ఎంత గొప్ప సక్సస్ సాధించిందో తెలిసిందే. బాలీవుడ్ సహా హాలీవుడ్ లోనూ అవకాశాలు అందుకుని కెరీర్ ని ముందుకు తీసుకెళ్తుంది.
వ్యక్తిగత జీవితంలో అలియాభట్ అంతే సంతోషంగా ఉంది. ప్రేమించిన చెలికాడు రణబీర్ కపూర్ ని వివాహం చేసుకుని మాతృత్వాన్ని ఆస్వాదిస్తుంది. ఇక బాలీవుడ్లో రణబీర్ కపూర్ సక్సెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. భట్ ఫ్యామిలీ అల్లుడు కాకముందే బాలీవుడ్ లో తానేంటో నిరూపిం చుకున్నారు. ఇటీవలే అతడు హీరోగా నటించిన రామాయణం మొదటి భాగం రిలీజ్ అయి గ్రాండ్ విక్టరీ అందుకు న్న సంగతి తెలిసిందే. ఇందులో రాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
దీనికి సంబంధించి మహేష్ భట్ సతీమణి, నటి సోని రాజ్దాన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా మహేష్ భట్ రియాక్షన్ రివీల్ చేసారు. `నా వద్ద రాముడు ఉన్నాడు అంటూ గర్వంగా రాసుకొచ్చారు. అల్లుడి అద్భుతమైన నటనను చూసి మహేష్ భట్ ఎంతగానో గర్విస్తున్నారని పేర్కొన్నారు. సినిమా చూస్తున్నంత సేపు మహేష్ భట్ లీనమైపోయారని..ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశానికి ముందు రాముడిని 14 ఏళ్లు వనవాసానికి పంపే ఘట్టం తనను ఎంతగానో కదిలించిందన్నారు.
గొంతు పూడుకుపోయిందని.. కంట్లో నీళ్లు రాకుండా ఆపుకోవడానికి చాలా ప్రయత్నించానని మహేష్ భట్ ఇప్పటికే ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. థియేటర్లో పక్కన యంగ్ మేకర్స్, రైటర్స్ ఉన్నారని తెలిసి కూడా తాను కన్నీళ్లను ఆపుకోలేకపోయానని మహేష్ భట్ భావోద్వేగానికి గురయ్యారు. ఒక సినిమా మనిషిని ఎంత గొప్పగా కదిలి స్తుందన్నదానికి ఇదోక మచ్చు తునుక.
భట్ మాటల్ని బట్టీ రణబీర్ నటన విషయంలో ఎంత గర్వాంగా ఫీలవుతున్నారు? అన్నది అతడి మాటల్ని బట్టి అర్దమవుతుంది. అలాగే ఆలియా భట్ కూడా భర్త నటనపై ప్రశంసల జల్లు కురిపించారు. `ఈ సినిమా కోసం నువ్వు సర్వస్వంధారబోశావు. అయినా మీ పాప రాహా కోసం నీలో ప్రేమ అలాగే మిగిలి ఉంది` అంటూ ఆలియా ఓ క్యూట్ పోస్ట్ షేర్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేసారని కొనియాడారు.
