Begin typing your search above and press return to search.

'వార‌ణాసి' క్రెడిట్ ఎవ‌రి ఖాతాలో..నెట్టింట క్రెడిట్ గోల‌!

ఈ నేప‌థ్యంలోనే మ‌హేష్ బాబు, రాజ‌మౌళి అభిమానుల మ‌ధ్య ఆస‌క్తిక‌రమైన చ‌ర్చ మొద‌లైంది.

By:  Ravindar Gorantla   |   31 March 2026 12:16 PM IST
వార‌ణాసి క్రెడిట్ ఎవ‌రి ఖాతాలో..నెట్టింట క్రెడిట్ గోల‌!
X

ర‌ణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన భారీ యాక్ష‌న్ స్పై డ్రామా `ధురంధ‌ర్ 2` రీసెంట్‌గా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌భంజ‌నాన్ని సృష్టిస్తోంది. మార్చి 19న విడుద‌లై ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ.1350 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి అత్యంత ఫాస్టెస్ట్‌గా రూ.1000 కోట్లు రాబ‌ట్టిన సినిమాగా స‌రికొత్త రికార్డుని త‌న ఖాతాలో వేసుకుంది. రానున్న రోజుల్లో రూ.2000 కోట్ల మార్కుని అవ‌లీల‌గా దాటేస్తుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. దీంతో ఈ రికార్డుని తిర‌గ‌రాలేసే సినిమా ఏదీ?..స్టార్ ఎవ‌రు? అనే స‌రికొత్త చ‌ర్చ మొద‌లైంది.

ఈ నేప‌థ్యంలోనే మ‌హేష్ బాబు, రాజ‌మౌళి అభిమానుల మ‌ధ్య ఆస‌క్తిక‌రమైన చ‌ర్చ మొద‌లైంది. రూ.2000 కోట్ల క్ల‌బ్‌లో చేరే స‌త్తా ఉన్న సినిమాగా ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆ క్రెడిట్ ఎవ‌రి ఖాతాలో అనే క్రెడిట్ గోల మ‌హేష్ బాబు, రాజ‌మౌళి అభిమానుల మ‌ధ్య స్టార్ట్ అయింది. మ‌హేష్ అభిమానులు #SSMB29 అని ప్ర‌చారం చేస్తుంటే జ‌క్క‌న్న ఫ్యాన్స్ #SSR13 అంటూ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ఇద్ద‌రి అభిమానుల మ‌ధ్య కోల్డ్ వార్ మొద‌లైంది. ఆ మ‌ధ్యే ఈ వార్ మొద‌లైనా ఎందుకో కాస్త స‌ద్దుమ‌నిగింది. అయితే రీసెంట్‌గా `ధురంధ‌ర్ 2` రిలీజ్ త‌రువాత నుంచి ఈ చ‌ర్చ మ‌ళ్లీ మొద‌లై నెట్టింట ట్రెండ్ అవుతోంది.

మ‌ధ్య‌లో బాహుబ‌లి ప్రొడ్యూస‌ర్ ఎంట్రీ...

మ‌హేష్, జ‌క్క‌న్న ఫ్యాన్స్ వార్ ఈ ర‌స‌వ‌త్త‌ర వార్‌లోకి `బాహుబ‌లి` మేక‌ర్స్‌లో ఒక‌రైన శోభు యార్ల‌గడ్డ ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇస్తూనే ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. ఫిల్మ్ మేకింగ్‌కు సంబంధించినంత వ‌ర‌కు సినిమా క్రెడిట్ ద‌ర్శ‌కుడికే వ‌ర్తిస్తుందంటూ అస‌లు బాంబ్ పేల్చారు. `ఫిల్మ్ మేకింగ్‌కు సంబంధించినంత వర‌కు ఏ సినిమాకి అయినా ప్రాథ‌మిక గుర్తింపు అనేది దాన్ని తెర‌కెక్కించిన వ్య‌క్తిది. (ఉదాహ‌ర‌ణ‌..`ఏ స్పైక్ లీ ఫిల్మ్‌). దీనిని ఇంకాస్త వివ‌ర‌ణాత్మ‌కంగా చెప్పాలంటే, సినిమా అనేది క‌ళాత్మ‌క‌మైన‌ది. అది కార్య‌రూపం దాల్చి వాస్త‌వ‌రూపంలోకి రావ‌డానికి ద‌ర్శ‌కుడే కార‌ణం.

అందుకే ఏ సినిమా అయినా ప్రాథ‌మికంగా ద‌ర్శకుడి పేరుమీదే గుర్తింపు వ‌స్తుంది. అందుకే `డైరెక్టెడ్ బై` అని వేస్తారు. ఇది కూఏడా ఒక‌ర‌క‌మైన ప్ర‌చారం లాంటిదే. సినిమా మేకింగ్‌, స్టైల్, థీమ్, సృజ‌నాత్మ‌క‌త‌తో కూడిన స‌న్నివేశాలు ఇవ‌న్నీ ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌కు అద్దంప‌డ‌తాయి. కాబ‌ట్టే ప్రేక్ష‌కులు కూడా ఆ దృష్టికోణం నుంచే చూస్తారు` అన్నారు శోభు యార్ల‌గడ్డ‌. అయితే ఇందులో ఎక్క‌డ కూడా `వార‌ణాసి` పేరుని కానీ జ‌క్క‌న్న‌పేరుని కానీ ఆయ‌న ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

క్రెడిట్ గోల ప‌ట్టించుకోని జ‌క్క‌న్న‌...

త‌న‌కు ద‌క్కాల్సిన క్రెడిట్ కోసం అభిమానులు నెట్టింట గోల చేస్తూ వైర‌ల్ పోస్ట్‌ల‌తో ర‌చ్చ చేస్తున్నా ఇవేవీ జ‌క్క‌న్న ప‌ట్టించుకోవ‌డం లేదు. సినిమా పూర్తి కావ‌డానికి ముందే హాలీవుడ్ నుంచి ప్ర‌మోష‌న్‌తో న‌రుక్కుంటూ వ‌స్తున్న రాజ‌మౌళి సినిమా ప్ర‌మోష‌న్స్‌తో పాటు మిగ‌తా భాగం షూటింగ్‌ని చ‌క చ‌క పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. ఇండ‌స్ట్రీలో త‌న‌ని ప‌ని రాక్ష‌సుడు అని అంటుంటారు. అందుకు త‌గ్గ‌ట్టే `వారణాసి`ని ఓ ప‌ని రాక్ష‌సుడిలా పూర్తి చేస్తున్నారు. ఈ మూవీని గ్లోబ‌ల్ మార్కెట్‌లో భారీ స్థాయిలో ప్ర‌జెంట్ చేయాల‌ని, ఓ హాలీవుడ్ మూవీ రేంజ్‌లో ప్రొజెక్ట్ చేయాల‌ని ఏ ఒక్క ఛాన్స్‌ని కూడా వ‌ద‌ల‌కుండా ప్ర‌య‌త్నిస్తున్నారు. సినిమా కోసం ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా వ‌ర్క్ చేస్తున్న జ‌క్క‌న్న త‌న‌పై ఫ్యాన్స్ చేసే అల్ల‌రిని ప‌ట్టించుకునే ప‌రిస్థితిలో లేడు.