Begin typing your search above and press return to search.

షాకింగ్‌ : 'వారణాసి' కంటెంట్‌పై అభ్యంతరం...!

వారణాసి సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. సినిమా విడుదలకు కౌంట్‌ డౌన్ ప్రారంభం అయ్యింది. సరిగ్గా ఏడాదికి సినిమా విడుదల చేయబోతున్నట్లుగా ఆమధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

By:  Ramesh Palla   |   14 Jun 2026 1:47 PM IST
షాకింగ్‌ : వారణాసి కంటెంట్‌పై అభ్యంతరం...!
X

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు అభిమానులతో పాటు, పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'వారణాసి'. టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. సినిమా షూటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుంచి అదిగో, ఇదుగో అంటూ ఏదో ఒక అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంది. ఇక వారణాసి సినిమా అఫిషియల్‌ సోషల్‌ మీడియా పేజీలను లక్షలాది మంది ఫాలో అవుతూ అప్‌డేట్స్ తెలుసుకుంటున్నారు. సినిమాకు సంబంధించిన పుకార్లు, ఇతర విషయాల గురించి ఎప్పటికప్పుడు క్లారిటీ ఇవ్వడం ద్వారా వారణాసి టీం ఫ్యాన్స్‌లో గందరగోళం లేకుండా చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వారణాసి ఫాలోవర్స్ సంఖ్య భారీగా ఉంటుంది. అలాంటి ఇన్‌స్టా వారణాసి పేజీ ఇప్పుడు కనిపించక పోవడం చర్చనీయాంశం అయ్యింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో వారణాసి సినిమా...

సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్స్‌ డిలీట్‌ కావడం, అకౌంట్స్ సస్పెండ్‌ కావడం అనేది కామన్‌ విషయం. కానీ సెలబ్రిటీల అకౌంట్స్‌, సినిమాలకు సంబంధించిన అఫిషియల్‌ అకౌంట్స్ సస్పెండ్‌ కావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ వరల్డ్‌ మూవీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ సస్పెండ్‌ కావడం షాకింగ్‌గా ఉంది. వారణాసి టీం ఇప్పటికే అకౌంట్‌ను రికవరీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు అకౌంట్‌ ఎందుకు సస్పెండ్‌ అయ్యింది అనే విషయాన్ని తెలుసుకునేందుకు మెటా టీంతో వారణాసి టీం మెంబర్స్ చర్చలు జరుపుతున్నారనే సమాచారం అందుతోంది. అయితే వారణాసి టీం మెంబర్స్‌ షేర్‌ చేసిన కంటెంట్‌ విషయంలో అభ్యంతరాలు ఉండటం వల్లే అకౌంట్‌ ఏకంగా సస్పెండ్‌ అయ్యి ఉంటుందని చాలా మంది సోషల్‌ మీడియా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబో...

వారణాసి సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. సినిమా విడుదలకు కౌంట్‌ డౌన్ ప్రారంభం అయ్యింది. సరిగ్గా ఏడాదికి సినిమా విడుదల చేయబోతున్నట్లుగా ఆమధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను షేర్‌ చేయడం కోసం మేకర్స్ రెడీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో అకౌంట్‌ సస్పెండ్‌ కావడం పట్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలకు సంబంధించిన ఏ ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ సస్పెండ్‌ అయిన దాఖలాలు లేవు. కంటెంట్‌ విషయంలో అభ్యంతరం వల్లే అకౌంట్ సస్పెండ్‌ అయ్యి ఉంటే మాత్రం అది కచ్చితంగా రాజమౌళి టీం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని సోషల్‌ మీడియాలో కొందరు మాట్లాడుకుంటున్నారు. వారణాసికి సంబంధించిన కీలక కంటెంట్‌ ఇప్పటి వరకు బయటకు రాలేదు. అయిన కంటెట్‌ పై అభ్యంతరం ఎలా ఉంటుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.

పాన్‌ ఇండియా మూవీ వారణాసి రిలీజ్ డేట్‌...

టెక్నికల్‌ ఇష్యూ కారణంగా ఇన్‌స్టా పేజ్‌ సస్పెండ్‌ అయ్యిందే తప్ప కంటెంట్‌ విషయంలో జరిగిన తప్పు వల్ల అయ్యి ఉండదని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. జక్కన్న టీం కి ఉన్న నెట్వర్క్ కారణంగా కచ్చితంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తిరిగి వారణాసి అఫిషియల్‌ పేజ్ కనిపించే అవకాశం ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు. మొత్తానికి వారణాసి టీం అధికారికంగా రన్‌ చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ సస్పెండ్‌ కావడం అనేది కన్ఫర్మ్‌. ఈ విషయమై జక్కన్న, ఆయన టీం ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.

మహేష్‌ బాబు, ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రామాయణం కథ అంతర్లీనంగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అయితే జక్కన్న నుంచి ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి క్లారిటీ రాలేదు. సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయమై చిన్న హింట్‌ కూడా మేకర్స్‌ లీక్‌ చేయడం లేదు. వారణాసి సినిమాను అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2027, ఏప్రిల్‌ 7న విడుదల చేయబోతున్నారు. జక్కన్న సినిమాల్లో ఏ ఒక్కటి అనుకున్న సమయంకు విడుదల కాలేదు. కనుక వారణాసి సినిమా సైతం వచ్చే ఏడాది చివరి వరకు వాయిదా పడుతూ వచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు అంటున్నారు. ఈ సారి ఆ సెంటిమెంట్‌ బ్రేక్‌ చేస్తాడేమో చూడాలి.