సూపర్‌స్టార్ మహేష్ విముక్తుడయ్యాడు సరే.. నెక్ట్స్ ఏంటి?
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
By: Sivaji Kontham | 23 Sept 2026 9:10 AM ISTసూపర్‌స్టార్ మహేష్ బాబు రెండేళ్లుగా ఎంత బిజీగా గడిపారో తెలిసిందే. రాజమౌళితో వారణాసి చిత్రాన్ని ఆయన అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇక జక్కన్న నుంచి విముక్తుడు అయ్యాడనే వార్త రానే వచ్చింది. దీంతో మహేష్ బాబు ఫ్యాన్ పేజీల నుంచి వెలువడిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన షూటింగ్ విశేషాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సూపర్‌స్టార్ మహేష్ బాబు తన మోస్ట్ అవైటెడ్ సినిమా అయిన `వారణాసి` చిత్రానికి సంబంధించి కీలకమైన షూటింగ్ పార్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఈ పోస్ట్ ద్వారా వెల్లడించారు.
ఈ చిత్రంలో మహేష్ బాబు కొత్త వేషధారణలు సర్ ప్రైజ్ చేస్తాయంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెగ ప్రశంసిస్తున్నారు. వారణాసి షెడ్యూల్ పూర్తి కావడంతో ఇక మహేష్ బాబు తన పాస్‌పోర్ట్ వచ్చేసిందని.. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి లండన్ ట్రిప్‌కు వెళ్లవచ్చంటూ అభిమానులు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. మహేష్ బాబు కొత్త గెటప్ - సినిమా అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఈ పోస్ట్‌కు పెద్ద ఎత్తున లైక్స్- హార్ట్ సింబల్స్‌తో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సినిమా షూటింగ్ దశ క్రమంగా ముగుస్తుండటంతో `వారణాసి` వంద శాతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయని సినీ వర్గాల్లో- అభిమానుల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది.
అదే సమయంలో అభిమానుల పేజీల్లో మహేష్ ద్విపాత్రల గురించి బోలెడంత చర్చ సాగుతోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం (రెండు పాత్రలు) గురించి ఇప్పటికే చాలా ప్రచారం ఉంది. ఆ పాత్రల తీరుతెన్నులు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని.. ఈ చిత్రంలో ఆయన ఒక ప్రత్యేకమైన పవర్‌ఫుల్ రోల్‌తో పాటు మరో డిఫరెంట్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించనున్నారన్న చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీరాముడి గెటప్‌కు సంబంధించిన అధికారిక లుక్ ఇంకా బయటకు రాకపోయినా.. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఏఐ (AI) లుక్‌కు మాత్రం అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ లుక్ చూసాక సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ప్రతిష్ఠాత్మక వారణాసి చిత్రంలో మహేష్ బాబు వేషధారణలు.. అతడి మేకోవర్ అత్యంత ప్రత్యేకంగా ఉండబోతున్నాయని సమాచారం. పాత్రల డిమాండ్‌కు తగ్గట్టుగా అతడు వేసుకునే కాస్ట్యూమ్స్- బాడీ లాంగ్వేజ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని అంచనా వేస్తున్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న `వారణాసి` టాలీవుడ్‌లో సంచలనాలు సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సూపర్‌స్టార్ మహేష్ జక్కన్న నుంచి విముక్తుడయ్యాడు సరే.. నెక్ట్స్ ఏంటి? అంటూ కూడా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రాజమౌళి తర్వాత సందీప్ రెడ్డి వంగా, త్రివిక్రమ్, సుకుమార్ వంటి టాప్ డైరెక్టర్స్ తో మహేష్ ప్రాజెక్ట్ ఉంటుందని కూడా అభిమానులు మరోవైపు ఊహాగానాలు సాగిస్తున్నారు.
