వారణాసి : ఆరు నెలలు సరిపోవట!
మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే వీఎఫ్‌ఎక్స్ పనులు ఇంకా 20 శాతం కూడా పూర్తి కాలేదని, గ్రాఫిక్స్ కోసం మరో ఏడాది సమయం పట్టవచ్చని ప్రచారం జరుగుతోంది. దీంతో 2027 ఏప్రిల్ 7న విడుదల కావాల్సిన సినిమా 2028 సమ్మర్‌కు వాయిదా పడే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.
By: Ramesh Palla | 27 Nov 2026 12:00 AM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రూపొందుతున్న 'వారణాసి' సినిమా షూటింగ్ పూర్తి అయిందంటూ మేకర్స్ ఇటీవల గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెల్సిందే. దాంతో సినిమాను ముందుగా ప్రకటించిన తేదీకి కచ్చితంగా విడుదల చేస్తారని మహేష్ బాబు అభిమానులతో పాటు, ప్రేక్షకులు ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాదిలోనే వారణాసి సినిమాను 2027, ఏప్రిల్ 7న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే రాజమౌళి సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు ముందుగా ప్రకటించిన తేదీకి విడుదల కాలేదు. కనుక వారణాసి సైతం కచ్చితంగా విడుదల వాయిదా పడుతుందని అనుకున్నారు. కానీ ఇటీవల షూటింగ్ పూర్తి అయింది అంటూ అధికారికంగా ప్రకటన రావడంతో ఇంకా ఆరు నెలల సమయం ఉంది కనుక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయడం కన్ఫర్మ్ అనుకున్నారు.
వారణాసి సినిమా విడుదల తేదీ...
వారణాసి గురించి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయినా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఆరు నెలల సమయం ఉన్నప్పటికీ విడుదల మాత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో ఉండక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వారణాసి సినిమా షూటింగ్ కంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి ఎక్కువ సమయం తీసుకుంటుందట. షూటింగ్ ప్రారంభం అయిన సమయంలోనే వీఎఫ్‌ఎక్స్ వర్క్ మొదలైందట. కానీ ఇప్పటి వరకు కనీసం 20 శాతం కూడా పూర్తి కాలేదని తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఆలస్యం కారణంగా విడుదల ఆలస్యం అవుతున్న సినిమాలు చాలానే ఉంటున్నాయి. వాటి జాబితాలోనే వారణాసి సినిమా సైతం జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారణాసి సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్ కి ఇంకా కనీసం ఏడాది సమయం కావాల్సి ఉందనే పుకార్లు వినిపిస్తున్నాయి.
మహేష్ బాబు, రాజమౌళి కాంబో...
సినిమా విడుదల విషయమై మేకర్స్ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు, వాయిదా వేసే అవకాశం ఉందని కూడా ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. కనుక సమ్మర్‌లోనే సినిమా విడుదల ఉంటుందని అంతా భావిస్తున్నారు. కానీ వారణాసి సినిమా కోసం రాజమౌళి చాలా విజువలైజ్ చేసుకున్నాడని, దాన్ని అంతా కూడా గ్రాఫిక్స్ రూపంలో తెరపైకి తీసుకు రావడానికి చాలా సమయం పడుతుందని అంటున్నారు. మహేష్ బాబు పాత్రతో పాటు సినిమాలోని ప్రతి చిన్న పాత్రకు వీఎఫ్‌ఎక్స్ వర్క్ చేయాల్సి ఉంటుందట. పైగా ఈ సినిమాను ఐమాక్స్ ఫార్మట్‌లో చిత్రీకరణ చేసిన కారణంగా గ్రాఫిక్స్ వర్క్ కు మరింత ఎక్కువ సమయం తీసుకుంటుందని అంటున్నారు. సినిమాను మూడు ఫార్మట్‌లలో రాజమౌళి విడుదల చేయాలని చూస్తున్నాడు. కనుక దానికి కూడా ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
వారణాసి సినిమాకు ఆస్కార్...
ఆలస్యం అయినా పర్వాలేదు రాజమౌళి సినిమాతో బెస్ట్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ పొందుతామని ప్రేక్షకులు భావిస్తున్నారు. కనుక రాజమౌళి 2027 సమ్మర్ కి కాకుండా 2028 సమ్మర్ వరకు తీసుకు వచ్చినా కచ్చితంగా జనాలు ఎగబడి మరీ చూస్తారు అనడంలో సందేహం లేదు. ఎంత ఎక్కువ సమయం తీసుకుంటే రాజమౌళి అంత బెస్ట్ ఔట్ పుట్ ఇస్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు. రాజమౌళి ఈ సినిమాతో మరోసారి ఆస్కార్ గడ్డపై తెలుగు సినిమాను నిలపడం ఖాయం అని అంతా ధీమాగా ఉన్నారు. ఇండియన్ సినిమాలకు ఆస్కార్ దక్కదేమో అనే అభిప్రాయం నుంచి, రాజమౌళి ఆస్కార్ తీసుకు వచ్చే వరకు ఏం చేశాడో మనం చూశాం. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా వారణాసి ఉండబోతుంది. కనుక ఒకటి కాదు రెండు మూడు ఆస్కార్ లు రావాల్సిందే అని జక్కన్న అభిమానులు భావిస్తున్నారు. మహేష్ బాబు ఈ సినిమాతో పాన్ వరల్డ్ స్టార్‌గా మారడం ఖాయం అని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
