Begin typing your search above and press return to search.

వారణాసిలో సుకుమార్ ప్రభావమా?

రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ‘వారణాసి’ సినిమా చుట్టూ ఇండస్ట్రీలో రకరకాల కథనాలు వైరల్ అవుతున్నాయి.

By:  M Prashanth   |   10 July 2026 11:23 AM IST
వారణాసిలో సుకుమార్ ప్రభావమా?
X

రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ‘వారణాసి’ సినిమా చుట్టూ ఇండస్ట్రీలో రకరకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచర్, టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్ లో రాబోతున్న ఈ మూవీలో కేవలం భారీ యాక్షన్ సీన్స్ మాత్రమే కాకుండా ఈసారి సరికొత్త స్క్రీన్ ప్లే ఉండబోతున్నట్లు ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. రాజమౌళి మార్క్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలాగూ ఉంటాయి కానీ, హీరో విలన్ మధ్య నడిచే సైకలాజికల్ డ్రామా సినిమాకు కొత్త వెయిట్ తీసుకురానుందట.

ఈ నేపథ్యంలోనే జక్కన్న రాసుకున్న స్క్రిప్ట్ లో దర్శకుడు సుకుమార్ స్టైల్ షేడ్స్ ఏమైనా కనిపిస్తాయా అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. టాలీవుడ్ లో మైండ్ గేమ్స్, క్యారెక్టర్ సైకాలజీని బేస్ చేసుకుని కథలు రాయడంలో సుకుమార్ ది ప్రత్యేకమైన స్టైల్. రాజమౌళికి కూడా సుక్కు రాసే మైండ్ గేమ్స్ స్క్రీన్ ప్లే అంటే చాలా ఇష్టం. గతంలో మహేష్ బాబుతో సుకుమార్ తీసిన 'వన్ నేనొక్కడినే' బాక్సాఫీస్ దగ్గర ఆశించిన రిజల్ట్ రాకపోయినా, అందులోని ఇంటెన్స్ సైకలాజికల్ ఎలిమెంట్స్ ను రాజమౌళి ఓపెన్ గానే మెచ్చుకున్నారు.

అందుకే ఈసారి తన అడ్వెంచర్ డ్రామాలో కూడా కేవలం శారీరక బలంతో కాకుండా, ఇద్దరు పవర్‌ఫుల్ వ్యక్తులు తమ బుద్ధితో ఆడుకునే సరికొత్త గేమ్స్ ను జక్కన్న డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రధాన విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పోషిస్తున్న 'కుంబా' పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ లో హైటెక్ వీల్ చైర్ మీద కూర్చుని చాలా పవర్‌ఫుల్ గా కనిపించారు. శారీరకంగా వీల్ చైర్ కే పరిమితమైన ఒక వ్యక్తి, కాలంతో పోటీ పడి హీరోకు ఎలా సవాల్ విసిరాడు అనే పాయింట్ ఇక్కడ కథను ఎంతో ఇంట్రెస్టింగ్ గా మారుస్తోంది.

ఫస్ట్ లుక్ లో కనిపించిన వీల్ చైర్ డిజైన్ చూస్తుంటేనే ఇదొక మైండ్ గేమ్ తో నడిచే పాత్ర అని అర్థమవుతోంది. నడవలేని స్థితిలో ఉన్న కుంబా, కేవలం తన తెలివితేటలు, వ్యూహాలతోనే సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడట. ఇండియన్ మైథాలజీలోని కుంభకర్ణుడి క్యారెక్టర్ ఇన్ స్పిరేషన్ తో ఈ పాత్ర ఉంటుందని మేకర్స్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. శారీరక బలం కంటే మానసిక వ్యూహాలే ఆయుధంగా మార్చుకున్న ఇలాంటి విలన్ ను ఎదుర్కోవడం హీరోకు పెద్ద టాస్క్ కానుంది.

అడవి నేపథ్యం, కాలంతో సాగే ఈ వేటలో హీరో, విలన్ ఒకరి ఎత్తులకు మరొకరు పైఎత్తులు వేసే సీన్స్ చాలా కొత్తగా ఉండబోతున్నాయట. విలన్ ఒక చోట కూర్చునే తన మైండ్ పవర్ తో హీరోను ఎలా ఇబ్బంది పెట్టాడు, దానికి హీరో ఎలాంటి కౌంటర్స్ ఇచ్చాడు అనే యాంగిల్ లో స్క్రీన్ ప్లే నడుస్తుందని సమాచారం. ఈ తరహా సైకలాజికల్ ఎత్తుగడలు చూస్తుంటే రాజమౌళి మేకింగ్ లో సుకుమార్ మార్క్ స్క్రీన్ ప్లే ప్రభావం కనిపించే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సరికొత్త స్క్రీన్ ప్లే ప్రయోగం గ్లోబల్ లెవెల్ లో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.