Begin typing your search above and press return to search.

వారణాసి కుంభ.. రానా ఎందుకు కాలేదు..?

సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

By:  Ramesh Boddu   |   30 Dec 2025 9:45 AM IST
వారణాసి కుంభ.. రానా ఎందుకు కాలేదు..?
X

సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మళయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా చేస్తున్నాడు. నవంబర్ 15న మహేష్ వారణాసి సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. సినిమాలో రుద్ర పాత్రలో మహేష్ నెక్స్ట్ లెవెల్ మాస్ అప్పీల్ తో రాబోతున్నారు. ఐతే ఈ సినిమాలో విలన్ గా కుంభ రోల్ లో పృథ్వీరాజ్ కూడా తనదైన శైలిలో అలరించనున్నారు.

రాజమౌళి తన ప్రతి సినిమా కాస్టింగ్ విషయంలో..

కుంభ పాత్రలో పృధ్విరాజ్ పోస్టర్ మాత్రమే వదిలారు కానీ అతని నుంచి ఎలాంటి టీజర్ రాలేదు. ఐతే కుంభగా పృధ్విరాజ్ పర్ఫెక్ట్ డెసిషన్ అనే ఆడియన్స్ అంటున్నారు. ఎందుకంటే అతను వర్సటైల్ యాక్టర్ అయినా కూడా రాజమౌళి తన ప్రతి సినిమా కాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తాడు. అందుకే ఆయన సినిమాలకు తిరుగు ఉండదు. ఈ క్రమంలో వారణాసి కాస్టింగ్ సెలక్షన్ లో పృధ్విరాజ్ ని ఫైనల్ చేశారు.

ఐతె కుంభాగా పృథ్వీరాజ్ మాత్రమే ఎందుకు మన దగ్గర రానా దగ్గుబాటి ఉన్నాడుగా అని కొందరు అంటున్నారు. నిజమే రానా ఉన్నాడు. మహేష్ హీరో రానా విలన్ ఈ కాంబో బాగుంటుంది. ఐతే ఆల్రెడీ బాహుబలి భళ్లాలదేవ పాత్రలో రానా తన విలనిజం చూపించాడు. వారణాసిలో కూడా అతన్ని విలన్ గా చూపిస్తే ఇక రానా హీరోగా వదిలేసి విలన్ గా చేయాల్సి వస్తుంది. భళ్లాలదేవగా రానా నెక్స్ట్ లెవెల్ లో అదరగొట్టాడు.

కుంభలో రోల్ రానా..

వారణాసి కుంభ రోల్ రాజమౌళి ముందు రానాని అనుకున్నారో లేడో కానీ మళయాళ స్టార్ పృథ్వీరాజ్ కూడా మంచి సెలక్షన్ అని చెప్పొచ్చు. ఐతే రానా కి ఆ పాత్ర పడినా మహేష్ టఫ్ ఫైట్ ఇచ్చే ఛాన్స్ ఉండేది. ఏది ఏమైనా వారణాసి కాస్టింగ్ సెలక్షన్ ఇంకా మిగతా ఎలిమెంట్స్ అన్నీ కూడా సినిమాకు సపోర్ట్ చేసేలా ఉంటాయి. ఈ సినిమాను 2027 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేసేలా రాజమౌళి సెట్ చేస్తున్నారు. మరి అనుకున్న విధంగా సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్నది చూడాలి.

ఈ సినిమాను మొదట రెండు పార్ట్ లుగా చేస్తాడన్న టాక్ వచ్చింది. కానీ రీసెంట్ గా రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో మరో 7 నెలల్లో సినిమా షూటింగ్ పూర్తవుతుందని ఇక అప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చూస్తారని తెలుస్తుంది. మహేష్ బాబు కూడా ఈ సినిమాతో పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ లెవెల్ లో సత్తా చాటేలా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వారణాసి నుంచి రిలీజైన సంచారి సాంగ్ సూపర్ హిట్ కాగా కుంభ సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది.