Begin typing your search above and press return to search.

జక్కన్న ప్లాన్ ఏంటి.. ప్రియాంక కూడానా?

అందులో భాగంగానే నేడు గ్లోబల్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా పుట్టినరోజు కావడంతో ఈ చిత్రం నుండి ఆమెకు స్పెషల్ విషెస్ చెబుతూ రెండు పోస్టర్లను రిలీజ్ చేశారు రాజమౌళి.

By:  Madhu Reddy   |   18 July 2026 10:42 AM IST
జక్కన్న ప్లాన్ ఏంటి.. ప్రియాంక కూడానా?
X

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రాజమౌళి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రాలతో దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న ఈయన ఇప్పుడు ఏకంగా ఆస్కార్ వేదికలపై కూడా సందడి చేస్తున్నారు. ప్రాంతీయంగా సినిమాలు , సీరియల్స్ కి దర్శకత్వం వహించిన రాజమౌళి.. నేడు గ్లోబల్ స్థాయిలో తన దర్శకత్వ విలువలతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటున్నారనటంలో సందేహం లేదు. అలా ఆర్ఆర్ఆర్ చిత్రంతో సంచలనం సృష్టించిన రాజమౌళి.. ఇప్పుడు ఏకంగా వారణాసి సినిమాతో ఆస్కార్ అందుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్నారేమో అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.




ఈ క్రమంలోనే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గ్లోబల్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేస్తున్న చిత్రం వారణాసి. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ఆఫ్రికన్ అడ్వెంచర్ నేపథ్యంలో ఏప్రిల్ 7వ తేదీన 2027 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే సాధారణంగా ఒక సినిమాలో ఒక సెలబ్రిటీ నటిస్తున్నారు అంటే వారి పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా నుండి వారి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లను రివీల్ చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే నేడు గ్లోబల్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా పుట్టినరోజు కావడంతో ఈ చిత్రం నుండి ఆమెకు స్పెషల్ విషెస్ చెబుతూ రెండు పోస్టర్లను రిలీజ్ చేశారు రాజమౌళి.




అయితే ఈ రెండు పోస్టర్లు చూసిన తర్వాత ఆడియన్స్ లో సరికొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో మందాకిని అనే ఒక పవర్ఫుల్ యాక్షన్ పాత్రలో నటిస్తున్నట్లు ఆమె పోస్టర్ ను రిలీజ్ చేసి, ఆమె పాత్ర పై అంచనాలు పెంచిన విషయం తెలిసిందే. ఇక నేడు ఆమె పుట్టిన రోజు కావడంతో రాజమౌళి ఈ సినిమాలోని ఆమె పాత్రకు సంబంధించి 2 ఫోటోలను రిలీజ్ చేస్తూ.. ఈ విధంగా కొటేషన్ పంచుకున్నారు." ఆమె నవ్వినప్పుడు సౌందర్యం.. నవ్వనప్పుడు అగ్ని కణికం.. వారణాసిలో మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా" అంటూ ఆమె జాలీగా ఉన్న ఒక ఫోటోని మరొకవైపు కోపంతో భయంకరంగా చూస్తున్న మరొక ఫోటోని షేర్ చేశాడు రాజమౌళి.

రాజమౌళి షేర్ చేసిన ఈ రెండు ఫోటోలను బట్టి చూస్తే ఇందులో ప్రియాంక చోప్రా ద్విపాత్రాభినయం పోషిస్తోందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది ప్రియాంక చోప్రా ఇందులో కవల పిల్లలుగా రెండు పాత్రలు పోషించబోతున్నారని కామెంట్లు చేస్తుంటే.. ఇంకొంతమంది ఒకటి విలన్ గా మరొకటి హీరోయిన్గా నటిస్తోంది కాబోలు అంటూ ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు రుద్రుడిగా, శ్రీరాముడిగా కనిపిస్తారంటూ వార్తలు రాగా.. ఇప్పుడు ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ రాజమౌళి ఏదో ప్లాన్ చేస్తున్నాడు.. ఇందులో ప్రియాంక కూడా ద్విపాత్రాభినయం చేస్తోంది కాబోలు అందుకే ఇలా హింట్ ఇచ్చాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఇలాంటి వార్తలు వస్తున్న వేళ.. ఇందులో ఏది నిజం తెలియాలి అంటే రాజమౌళి లేదా చిత్ర బృందం దీనిపై స్పందించాల్సి ఉంటుంది మొత్తానికైతే తాజాగా రాజమౌళి.. ప్రియాంక చోప్రా బర్తడే సందర్భంగా విడుదల చేసిన ఈ రెండు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.