Begin typing your search above and press return to search.

'వారణాసి' రిలీజ్ తేదీ వెనుక జక్కన్న మైండ్ గేమ్!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సినిమా డైరెక్ట్ చేసినా? చేయకపోయినా? నిత్యం ట్రెండింగ్‌లో ఉండే ఏకైక దర్శకుడు రాజమౌళి.

By:  Srikanth Kontham   |   26 Oct 2026 4:00 AM IST
వారణాసి రిలీజ్ తేదీ వెనుక జక్కన్న మైండ్ గేమ్!
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సినిమా డైరెక్ట్ చేసినా? చేయకపోయినా? నిత్యం ట్రెండింగ్‌లో ఉండే ఏకైక దర్శకుడు రాజమౌళి. ప్ర‌స్తుతం సూపర్‌స్టార్ మహేష్ తో ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ డ్రామా `వారణాసి` చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అంచనాలున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు.ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్నా? విడుదల తేదీ విషయంలో రాజమౌళి అవలంబిస్తున్న వ్యూహం ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాను మార్కెట్ చేయడంలో.. బిజినెస్ పరంగా ప్రతి అడుగును ఎంతో లెక్కప్రకారంగా వేయడంలో జక్కన్న ఎంతటి దిట్టో చెప్పాల్సిన ప‌నిలేదు.

`వారణాసి` కి సంబంధించి డిజిటల్ రైట్స్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు జ‌రుగుతున్నా? ఆర్థిక లావాదేవీల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదని తెలు స్తోంది. తొలుత‌ 350 కోట్ల భారీ డిమాండ్ పెట్టిన రాజమౌళి బృందం అటుపై 275 కోట్లకు సర్దుబాటు చేసినట్లు సమాచారం. అయితే నెట్‌ఫ్లిక్స్ మాత్రం 200 కోట్లకు మించి ఇచ్చేది లేదన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో ఇరువర్గాల మధ్య ప్రైసింగ్ వార్ రగులుకుంది.

భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కోసం రాజమౌళి 270 నుంచి 300 కోట్ల మధ్య డిజిటల్ రేటును ఆశిస్తుండగా, నెట్‌ఫ్లిక్స్ మాత్రం ఆ బౌండరీని దాటేందుకు వెనుకంజ వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో జక్కన్న తనదైన శైలిలో మైండ్ గేమ్ మొదలుపెట్టినట్లు క‌నిపిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ మాత్రమే కాకుండా ఇతర అంతర్జాతీయ ఓటీటీ సంస్థలతో కూడా సమాంతరంగా చర్చలు నడుపుతున్నారనే కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ప్రత్యామ్నాయ ఆప్షన్లను ఓపెన్‌గా ఉంచడం ద్వారా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై ఒత్తిడి పెంచాలనేది రాజమౌళి ప్లాన్‌గా కనిపిస్తోంది.

డిజిటల్ డీల్స్‌ను డిసెంబర్ నాటికి పూర్తిగా కొలిక్కి తెచ్చిన తర్వాతే థియేట్రికల్ రిలీజ్ డేట్‌పై స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల బ్రెజిల్‌లో జరిగిన అంతర్జాతీయ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో రాజమౌళి పాల్గొన్నా? గతంలో ప్రకటించిన ఏప్రిల్ 7 డేట్‌ను గట్టిగా ప్రస్తావించకుండా ఏప్రిల్‌లో సినిమా వస్తుందని మాత్రమే దాటవేశారు. ఈ చిన్న వ్యూహాత్మక మలుపు వెనుక ఓటీటీ రైట్స్ సాధించే బిజినెస్ ప్రెషరే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

నిర్మాణ దశలోనే గ్లోబల్ మార్కెట్‌ను కైవసం చేసుకునేలా పావులు కదిపే రాజమౌళి తన సినిమాల వ్యాపారంలో ఎప్పుడూ రాజీపడరు. `ఆర్ఆర్ఆర్`, `బాహుబలి` సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమా స్టామినాను చాటిన జ‌క్క‌న్న `వారణాసి` విషయంలోనూ అదే రేంజ్ లో రెవెన్యూ రాబట్టేందుకు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఓటీటీ సంస్థల నుంచి ఆశించిన రేటు వచ్చేలా చేయడం కోసం జ‌క్క‌న్న ఆడుతున్న మైండ్ గేమ్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మొత్తానికి `వారణాసి` షూటింగ్ దాదాపు పూర్తయినా.. డేట్ విషయంలో జక్కన్న స్పష్టత ఇవ్వకపోవడానికి బలమైన కమర్షియల్ కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. త్వరలోనే డిజిటల్ డీల్స్ ఫైనల్ అయ్యే అవకాశం ఉండటంతో రాబోయే రోజుల్లో రిలీజ్ డేట్‌పై అధికారిక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. బాక్సాఫీస్ వద్దే కాకుండా బిజినెస్ రంగంలోనూ రాజమౌళి సృష్టించబోయే కొత్త సునామీ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.