ఆ ఇద్దరు డైరెక్టర్లు చెప్పిన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్ బాబు... ఎవరిది ఫస్ట్ సెట్స్ మీదకి రాబోతుంది...
సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు. కెరియర్ స్టార్టింగ్ లోనే వైవిధ్య భరితమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు.
By: Gopi Velupala | 11 Oct 2026 2:04 PM ISTసూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు. కెరియర్ స్టార్టింగ్ లోనే వైవిధ్య భరితమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. 'పోకిరి' సినిమాతో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డును క్రియేట్ చేసిన మహేష్ ఆ తర్వాత మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న 'వారణాసి' ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతుందనేది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది...
వరల్డ్ వైడ్ హీరో
మహేష్ బాబు ఒక సినిమాకి కమిట్ అయ్యేటప్పుడు అందులో ఉన్న లోటుపాట్ల గురించి తీవ్రమైన కసరత్తులు చేస్తూ ముందుకు సాగుతాడు. ఈ జనరేషన్ ఆడియన్స్ తన నుంచి ఏం కోరుకుంటున్నారు. వాళ్ళను 100% సర్టిస్ ఫై చేయాలంటే తను ఎలాంటి కాన్సెప్ట్ ఎంచుకోవాలనే విషయంలో చాలా క్లారిటి గా ఉంటాడు. రాజమౌళి క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు. అందుకే వారణాసి మూవీ బడ్జెట్ రోజు రోజుకి పెరిగిపోతుందంటూ ఫిలిం నగర్ సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తూ హాలీవుడ్ ఆడియన్స్ ను అలరించేలా ఉండబోతుందనే వార్తలు వినబడుతున్నాయి.
మహేష్ నెక్స్ట్ మూవీ ఎవరితో...
వారణాసి రిలీజ్ అయిన వెంటనే మహేష్ బాబు సుకుమార్ డైరెక్షన్లో సినిమా చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు. అనౌన్స్మెంట్ వచ్చి చాలా రోజులు అవుతున్నప్పటికీ సెట్స్ మీదకి వెళ్ళలేదు. ఈ మూవీతో సుకుమార్ మరోసారి తన మ్యాజిక్ ని రిపీట్ చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్ మహేష్ బాబు తో సినిమా చేస్తాడట...కానీ అప్పటి కి సుకుమార్ రామ్ చరణ్ మూవీ బిజీ లో ఉంటాడు. మహేష్ సుకుమార్ కోసం వెయిట్ చేస్తాడేమో చూడాలి. ఇక సందీప్ రెడ్డి వంగ సైతం మహేష్ బాబుకి లైన్ చెప్పాడట. అది పూర్తిస్థాయిలో మహేష్ ను సాటిస్ఫై చేసిందట. తొందర్లోనే బౌండెడ్ స్క్రిప్ట్ తో సందీప్ నేరేషన్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది.
అర్జున్ రెడ్డి తర్వాత అనుకున్న ప్రాజెక్ట్...
అర్జున్ రెడ్డి తర్వాత నుంచి సందీప్ డైరెక్షన్లో మహేష్ బాబు నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు కానీ వర్కౌట్ కావడం లేదు. అర్జున్ రెడ్డి తర్వాత మహేష్ తో అనుకున్న ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదని సందీప్ ఆ స్టోరీ అలానే పెట్టేశారట. ఇప్పుడు అదే స్టోరీ లో మార్పులు చేసి హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో మహేష్ బాబుని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. 'స్పిరిట్ ' వచ్చే ఏడాది మార్చి 5 న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఆ తర్వాత సందీప్ ఫ్రీ అవుతాడు. సుకుమార్, సందీప్ రెడ్డి వంగ ఇద్దరిలో మహేష్ బాబు మొదట ఎవరితో సినిమా చేస్తాడు. ఈ ఇద్దరి దర్శకులకు ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ దక్కింది. వారణాసి సినిమాతో మహేష్ ప్రపంచ స్థాయి హీరోగా పరిచయం అవుతున్నాడు. కాబట్టి తన తదుపరి సినిమా కథలు ప్రపంచంలో ఉన్న ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండాలి...
