Begin typing your search above and press return to search.

బులుగు చొక్కా.. మహేష్ బాబు టైమింగ్ తో కొట్టేస్తాడంతే..!

రాజమౌళి మహేష్ సినిమా గ్లోబ్ త్రొట్టర్ మూవీ వారణాసి ఈవెంట్ లో మహేష్ స్పీచ్ ఫ్యాన్స్ కి సూపర్ జోష్ ఇచ్చింది.

By:  Ramesh Boddu   |   16 Nov 2025 12:19 PM IST
బులుగు చొక్కా.. మహేష్ బాబు టైమింగ్ తో కొట్టేస్తాడంతే..!
X

రాజమౌళి మహేష్ సినిమా గ్లోబ్ త్రొట్టర్ మూవీ వారణాసి ఈవెంట్ లో మహేష్ స్పీచ్ ఫ్యాన్స్ కి సూపర్ జోష్ ఇచ్చింది. ముఖ్యంగా మహేష్ కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంతేకాదు స్వచ్చమైన అచ్చమైన తెలుగు మాట్లాడటంలో మహేష్ అసలు మొహమాట పడడని మరోసారి ప్రూవ్ అయ్యింది. గ్లోబ్ త్రొట్టర్ ఈవెంట్ లో మహేష్ మాట్లాడుతూ బులుగు చొక్కా వేఉకుని వస్తనన్నా రాజమౌళి ఒప్పుకోలేదని చెప్పారు. బ్లూ షర్ట్ అనొచ్చు కానీ బులుగు చొక్కా అది కూడా మహేష్ లాంటి స్టార్ హీరో నోట ఆ మాట రావడం ఫ్యాన్స్ కూడా క్రేజీగా ఫీల్ అవుతున్నారు.

సింపుల్ గా నా స్టైల్ లో ఒక బులుగు చొక్కా..

ఈవెంట్ లో మహేష్ ఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేశారు రాజమౌళి. ఎందుకు సార్ మామూలుగా నడుచుకుంటూ వస్తా అన్నాను కుదరదని రాజమౌళి అన్నారు.. చూశారుగా ఎలా ప్లాన్ చేశారో.. సరే సార్.. సింపుల్ గా నా స్టైల్ లో ఒక బులుగు చొక్కా వేసుకుని వస్తా అన్నాను కుదరదని అన్నారు.. చూశారుగా డ్రెస్సింగ్ ఎలా సెట్ చేశారో.. అదేంటండి గుండీలు లేవు రెండు మూడు బటన్లు అయినా ఇవ్వండి అన్నాను.. కుదరదు అన్నారు.. ఇంకా నయం చొక్కా లేకుండా రమన్నలా.. నెక్స్ట్ అదేనేమో.. ఇదంతా మీ కోసమే.. అప్డేట్ అప్డేట్ అని అడిగారుగా ఎలా ఉంది అప్డేట్.. మన డైలాగే చెప్పాలి.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది అంటూ తన కామెడీ టైమింగ్ తో ఫ్యాన్స్ ని ఉత్తేజపరిచారు మహేష్.

మహేష్ మాటల్లో ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇంకా చాలా ఉందని అన్నాడు. రాజమౌళితో తన సినిమా ఒక డ్రీం ప్రాజెక్ట్ అని అన్నాడు మహేష్. మొత్తానికి ఏదైతే ఫ్యాన్స్ ఊహించారో దానికి ఏమాత్రం తగ్గని విధంగా వారణాసి అప్డేట్ వచ్చింది. ప్రతి ఫ్రేం.. ప్రతి షాట్.. వారణాసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు సినీ లవర్స్ కి ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇచ్చే సినిమా అవుతుందని అంటున్నారు.

రాముడిగా మహేష్..

వారణాసి సినిమాలో మహేష్ ఓ పక్క రుద్రుడి లుక్ తో అదరగొట్టగా.. ఈవెంట్ లో మహేష్ రాముడిగా కూడా కనిపిస్తాడని హింట్ ఇచ్చాడు జక్కన్న. సో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఒక నెవర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని ఫిక్స్ అయ్యారు. రాజమౌళి అండ్ టీం 3 నిమిషాల గ్లింప్స్ కోసమే ఏడాది నుంచి కష్టపడుతున్నారు. ఇక సినిమా కోసం మరో రెండేళ్లు టైం తీసుకునేలా ఉన్నారు. ఐతే వారణాసి ఈవెంట్ లో ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మాత్రం 2027 సమ్మర్ కి సినిమా రిలీజ్ ఉంటుందని హింట్ ఇచ్చారు.

మహేష్ వారణాసి సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా పృధ్విరాజ్ సుకుమారన్ విలన్ గా చేస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్ విజువల్స్ తోనే సినిమా ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అన్నది శాంపిల్ చూపించి ఎక్స్ పెక్టేషన్స్ హై రేంజ్ లో పెట్టాడు జక్కన్న.