Begin typing your search above and press return to search.

మ‌హేష్ బ‌ర్త్ డేకి చొక్కా విప్పేస్తున్నాడా?

సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు వేడుకల కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

By:  Srikanth Kontham   |   4 Aug 2026 7:00 PM IST
మ‌హేష్ బ‌ర్త్ డేకి చొక్కా విప్పేస్తున్నాడా?
X

సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు వేడుకల కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి ఏటా ఆగస్టు 9న మహేష్ బర్త్ డే సంద‌ర్భంగా టాలీవుడ్‌లో పండుగ వాతావరణం నెలకొంటుంది. అయితే ఈసారి వేడుక ప్రాధాన్యత మరింత ప్రత్యేకంగా మారనుంది. ఈ సంద‌ర్భంగా రాజమౌళి దర్శకత్వంలో మహేష్ న‌టిస్తోన్న‌ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ 'వారణాసి' చిత్రానికి సంబంధించి మేజర్ అప్డేట్ రానుంది. బర్త్ డే కానుకగా మేకర్స్ ఎలాంటి సర్‌ప్రైజ్ ఇస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఈ ప్రత్యేక రోజున మహేష్ కు సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్‌లో మహేష్ చొక్కా విప్పిన సరికొత్త మాస్ రగ్గడ్ లుక్‌లో కనిపించబోతున్నార‌నే ప్రచారం ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. గతంలో ఓ సంద‌ర్భంలో మహేష్ రాజమౌళి త‌నతో చొక్కా విప్పించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేద‌ని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమాలలో హీరోల బాడీ లాంగ్వేజ్, ట్రాన్స్‌ఫర్మేషన్ ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పటి వరకు మహేష్‌ను ఎన్నడూ చూడని సరికొత్త యాక్షన్ అవతార్‌లో.. అత్యంత కఠినమైన శారీరక మార్పులతో ఈ చిత్రంలో చూపించబోతున్నారన్న‌ది ఓపెన్ సీక్రెట్.

జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ ప్రాంతంలో జరిగిన ప్రత్యేక శిక్షణతో పాటు, సినిమా కోసం మహేష్ పడుతున్న కఠిన శ్రమ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజమౌళి సినిమా అంటేనే అడ్వెంచర్, యాక్షన్‌తో పాటు ఎమోషన్స్ హై రేంజ్‌లో ఉంటాయి. ఈ నేపధ్యంలో మహేష్ నుంచి రాబోయే ఫస్ట్ లేదా గ్లింప్స్‌లో ఆయన బాడీ ట్యాన్, ఫిజిక్ సినిమాపై అంచనాలను తారా స్థాయికి చేర్చడం ఖాయమని అభిమానులు బ‌లంగా నమ్ముతున్నారు.

బర్త్ డే రోజున మ‌హేష్ ష‌ర్ట్ లెస్ ఫోజ్ రివీల్ చేస్తే? సోషల్ మీడియా రికార్డులు తిరగరాయడం పక్కా అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కుతున్న చిత్రం హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీక్వెన్స్‌లతో రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో మహేష్ కొత్త లుక్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచ‌నుంది.

ఆగస్టు 9న రాబోతున్న క్రేజీ అప్డేట్ కేవలం పుట్టినరోజు కానుక మాత్రమే కాదు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే మరో సంచలనానికి నాంది పలుకుతుందని చెప్పొచ్చు. రాజమౌళి - మహేష్ కాంబినేషన్‌లో రానున్న దృశ్యకావ్యం కోసం ప్రేక్షకాభిమానుల చూపులన్నీ ఆ ప్రత్యేక రోజుపైనే ఉన్నాయి. ఇప్ప‌టికే షూటింగ్ దాదాపు ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఇంకా 80 రోజుల షూటింగ్ మాత్ర‌మే మిగిలి ఉంది. ఈ షూట్ అంతా దాదాపు హైద‌రాబాద్ లో వేసిన సెట్స్ లోనే జ‌రుగుతుంది. దీనికి సంబంధించి రాజ‌మౌళి ప‌క్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు.