వారణాసి కథ ఎక్కడ స్టార్ట్ అవుతుంది?
మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తున్న వారణాసిపై హైప్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.
By: M Prashanth | 16 Sept 2026 2:59 PM ISTమహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తున్న వారణాసిపై హైప్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఆ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పటికే బయటకు వచ్చాయి. ముఖ్యంగా 7000 BC నుంచి 2027 వరకు స్టోరీ సాగుతుందనే విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఇప్పుడు సినిమా కథ అసలు ఎక్కడ మొదలవుతుందనే విషయం హట్ టాపిక్ గా మారింది.
నిజానికి ఏ సినిమా స్టోరీకి అయినా ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడే స్టోరీ, మెయిన్ రోల్ జర్నీ స్టార్ట్ అవుతాయి. కానీ వారణాసి విషయంలో వేల సంవత్సరాల గ్యాప్ ఉండటంతో.. కథ స్టార్టింగ్ కూడా ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ 7000 BCలో స్టోరీకి సంబంధించిన మెయిన్ ఇన్సిడెంట్ జరిగి ఉంటే.. దాని ఎఫెక్ట్ చాలా కాలం తర్వాత 2027లో కనిపించే ఛాన్స్ ఉంటుంది.
అప్పుడు ఆడియన్స్ ముందుగా ఒక వరల్డ్ ను చూస్తారు. ఆ తర్వాత మరో కాలంలోకి వెళ్లినప్పుడు.. మొదట్లో కనిపించిన కొన్ని విషయాలకు కొత్త అర్థం రావచ్చు. అంటే ఫ్యూచర్ లో జరిగే కథను అర్థం చేసుకోవడానికి ఆ పాస్ట్ కు అవసరమయ్యే విధంగా స్టోరీని రాసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇదే వారణాసి మూవీలో కచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ గా మారొచ్చు.
మరోవైపు 2027లో స్టోరీ మొదలై.. అక్కడి నుంచి ఆడియన్స్ ను 7000 BCకి తీసుకెళ్లే విధానం కూడా ఉండొచ్చు. అలా అయితే మొదట కనిపించిన ఒక క్వశ్చన్ కు ఆన్సర్ కోసం స్టోరీ వెనక్కి జర్నీ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి స్టోరీలో ప్రేక్షకులకు మొదట ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇవ్వకుండా.. ఒక్కో స్టేజ్ లో కొత్త విషయాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ రెండు కాలాల మధ్య ఉన్న డిఫరెన్స్ కూడా మెయినే.
7000 BC వరల్డ్ ను చూపించడానికి భారీ సెట్లు, నేచుర్, అప్పటి లైఫ్ స్టైల్, డ్రెస్సింగ్ వంటి అంశాలు యూజ్ అవుతాయి. 2027 వరల్డ్ మాత్రం పూర్తిగా మరోలా ఉంటుంది. ఆ రెండు వరల్డ్స్ ను ఒకే సినిమాలో చూపించడం వల్ల స్టోరీలోనే కాకుండా విజువల్స్ లోనూ భారీ ఛేంజ్ కనిపించే అవకాశం ఉంది. అయితే అసలు ప్రశ్న.. ఆ రెండు ప్రపంచాలు ఎందుకు కలుస్తాయి అనేదే.
మహేశ్ రోల్ ఆ రెండు కాలాల మధ్య జర్నీ చేసే వ్యక్తిగా ఉంటుందా? లేక ఒక కాలంలో జరిగిన కథకు మరో కాలంలోని రోల్ కు కంటిన్యూషన్ గా ఉంటుందా? అనేది సినిమా రిలీజ్ అయ్యేవరకు తెలియదు. ఆ విషయంలో చిన్న క్లూ కూడా స్టోరీపై ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా మార్చేయొచ్చు. అందుకే వారణాసిలో 7000 BC, 2027 అనే టైమ్ లైన్స్ కంటే.. వాటి మధ్య ఉన్న స్టోరీ లింకింగ్ మెయిన్. రెండు వేర్వేరు టైమ్ లైన్స్ స్క్రీన్ పై కనిపించడం ఒక స్పెషాలిటీ అయితే.. వాటిని ఒకే స్టోరీగా మార్చడం రాజమౌళి ముందున్న అసలు సవాల్.
