టాలీవుడ్ స్టార్ హీరోల కఠినమైన స్క్రిప్ట్ రూల్స్!
ప్రస్తుతం టాలీవుడ్ పాన్-ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టిస్తోంది. ఒకప్పుడు మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సీన్లు ఉంటే సినిమాలు ఆడేవి.
By: Srikanth Kontham | 24 Sept 2026 8:30 AM ISTప్రస్తుతం టాలీవుడ్ పాన్-ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టిస్తోంది. ఒకప్పుడు మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సీన్లు ఉంటే సినిమాలు ఆడేవి. కానీ నేటి టాలీవుడ్ అగ్ర కథానాయకులు స్క్రిప్ట్ ఎంపికలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కథతో వచ్చే దర్శకులకు సవాలు విసురుతూ ప్రతీ చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీ లిస్తున్నారు. అయితే టాలీవుడ్ హీరోలందరిలో కథ చెప్పి ఒప్పించడం, స్క్రిప్ట్‌తో మెప్పించడం ఏ హీరోతో అత్యంత కష్టమనే ప్రశ్న? సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తుంటుంది.
ఈ జాబితాలో మొదటి వరుసలో సూపర్ స్టార్ మహేష్. ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు బహిరంగంగానే చెప్పినట్లుగా మహేష్ కు కథ చెప్పి ఒప్పించడం చిన్న విషయం కాదు. మహేష్ కథ వినడానికి ముందే పూర్తి స్థాయి బౌండ్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉండాలని కోరుకుంటారు. కథలో ప్రతీ సన్నివేశం, సంభాషణ, కథనం కాగితంపై పక్కాగా ఉంటేనే ఆయన ముందుకెళ్తారు. కథలో ఏ చిన్న లాజిక్ మిస్ అయినా? లేదా కథనంలో గ్యాప్స్ ఉన్నా? వెంటనే ప్రశ్నిస్తారని రాజమౌళి, సుకుమార్ వంటి ప్రముఖ దర్శకులు పలు సందర్భాల్లో వెల్లడించారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కి కథ చెప్పడం కూడా దర్శకులకు పెద్ద పరీక్ష లాంటిదే. తారక్ కు ఉండే అద్భుతమైన గ్రాస్పింగ్ పవర్ షార్ప్ ఐక్యూ వల్ల దర్శకుడు కథ వివరిస్తున్నప్పుడే ఆయన మనస్సులో ఆ సినిమా మొత్తం విజువలైజ్ అయిపోతుంది. కథ చెప్పే క్రమంలో స్క్రీన్ ప్లే లో ఏమైనా లూప్‌హోల్స్ ఉంటే తారక్ క్షణాల్లో పసిగట్టేస్తారు. అందుకే ఎన్టీఆర్ ను కలవడానికి వెళ్లే ముందే దర్శకులు పూర్తి స్థాయిలో హోమ్‌వర్క్ చేసుకుని అన్ని ప్రశ్నలకు సమాధానాలతో వెళ్లాల్సి ఉంటుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే ఆయన పర్ఫెక్షన్ కోసం ఎంతటి శ్రమకైనా వెనుకాడరు. ఒక కథ నచ్చిన వెంటనే ఆయన ప్రాజెక్ట్‌ను లాక్ చేయరు. ఆ కథను పర్ఫెక్ట్ స్టేజ్‌కి తీసుకురావడానికి నెలల తరబడి సుదీర్ఘమైన స్క్రిప్ట్ సిట్టింగ్స్ నిర్వహిస్తారు. క్యారెక్టరైజేషన్, డ్రామా, కమర్షియల్ ఎలిమెంట్స్ , మ్యూజిక్ కనెక్టివిటీ ఇలా ప్రతీ కోణంలో 100 శాతం సంతృప్తి చెందిన తర్వాతే అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు.
వీరితో పాటు దశాబ్దాల అనుభవం ఉన్న మెగాస్టార్ చిరంజీవి కథల ఎంపికలో ప్రత్యేక శైలిని కలిగి ఉన్నారు. ప్రేక్షకుడి పల్స్, సినిమా మీటర్ బాగా తెలిసిన చిరంజీవి కథలో ఎమోషన్, డ్రామా , కమర్షియలిజం సరిగ్గా కుదిరిందో లేదో క్షుణ్ణంగా విశ్లేషిస్తారు. కథ , కథనం ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో? ముందే అంచనా వేయడంలో ఆయనకు ప్రత్యేకమైన ట్రాక్ రికార్డు ఉంది. అందువల్ల సీనియర్ డైరెక్టర్ అయినా? యంగ్ డైరెక్టర్ అయినా? పక్కాగా కాన్పిడెంట్ గా ఉంటేనే చిరును అప్రోచ్ అవుతారు.
అగ్ర హీరోలు స్క్రిప్ట్ విషయంలో ఈ స్థాయి నియమాలు, కఠినమైన ప్రమాణాలు పాటించడం వల్లే తెలుగు సినిమాలు జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో ఘన విజయాలు సాధిస్తున్నాయి. కథను ఒప్పించడం దర్శకులకు సవాలుతో కూడుకున్న పనే అయినా? హీరోల జాగ్రత్తే సినిమాల విజయావకాశాలను పెంచుతోంది. స్క్రిప్ట్ పేపర్‌పై పర్ఫెక్షన్ సాధించినప్పుడే అద్భుతమైన సినిమాలు వెండితెరపై ఆవిష్కృతమవుతాయని ఈ హీరోల ప్రయాణం నిరూపిస్తోంది.
