'పెద్దోడి' కోసం మహేష్.. ఎంత కావాలో అంతే..
ఘట్టమనేని కుటుంబం తర్వాతి తరం నుంచి మొదటి వాడు, నెక్స్ట్ జనరేషన్ పెద్దోడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 28 July 2026 10:23 AM ISTఘట్టమనేని కుటుంబం తర్వాతి తరం నుంచి మొదటి వాడు, నెక్స్ట్ జనరేషన్ పెద్దోడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. రమేష్ బాబు కొడుకు జయకృష్ణ శ్రీనివాసమంగాపురం సినిమాతో రాబోతుండటంతో అందరి దృష్టి దీనిపై పడింది. సొంత అన్న కొడుకు, పైగా ఫ్యామిలీకి పెద్దోడు కావడంతో బాబాయ్ మహేష్ బాబు తన వంతు బాధ్యతను పక్కాగా నిర్వర్తిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో మహేష్ ఇన్వాల్వ్ అవుతున్న తీరు చాలా బ్యాలెన్స్డ్ గా ఉంది.
సొంత అన్న కొడుకు కదా అని మరీ అతిగా ప్రతిదానికీ మైక్ పట్టుకుని భజన చేయడం లేదు. అలాగని ఏమాత్రం పట్టించుకోకుండా లైట్ కూడా తీసుకోవడం లేదు. సినిమాకు ఎంతవరకు పుష్ ఇవ్వాలో కరెక్ట్ గా అంతే చేస్తున్నాడు. గతంలోనే ఒక స్పెషల్ వీడియో ద్వారా టీమ్ కు బెస్ట్ విషెస్ చెప్పిన మహేష్, ఇప్పుడు రిలీజ్ టైమ్ దగ్గర పడటంతో డైరెక్ట్ గా రంగంలోకి దిగాడు.
హీరో జయకృష్ణ, డైరెక్టర్ అజయ్ భూపతిని స్వయంగా కలిసి మహేష్ ఫ్రేమ్ లోకి వచ్చాడు. ఈ ఫోటోలు బయటకు రావడంతో జనాల్లో సినిమా మీద ఆటోమేటిక్ గా ఒక అటెన్షన్ క్రియేట్ అయింది. కరెక్ట్ గా రిలీజ్ కు ముందు సినిమాను పబ్లిక్ లో హైలైట్ చేయడానికి మహేష్ ఇచ్చిన ఈ చిన్న టచ్ బాగానే వర్కౌట్ అవుతోంది. మహేష్ స్వయంగా కలవడంతో ఘట్టమనేని అభిమానులకు కూడా ఒక భరోసా దొరికినట్లు అయింది.
అయితే బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా, సూపర్ స్టార్ బెస్ట్ విషెస్ తోడైనా ఫైనల్ గా థియేటర్లలో సినిమాను నిలబెట్టాల్సింది కంటెంట్ మాత్రమే. ఈ విషయం మహేష్ కు కూడా బాగా తెలుసు కాబట్టే తన వైపు నుంచి ఇవ్వాల్సిన మైలేజ్ ఇచ్చి మిగతాది డైరెక్టర్ చేతిలో పెట్టేశాడు. అజయ్ భూపతికి ఉన్న రా అండ్ రస్టిక్ ట్రాక్ రికార్డ్ కు తోడు, జయకృష్ణ తన నటనతో ఎంతవరకు ఆకట్టుకుంటాడు అనేదే ఇక్కడ అసలైన పాయింట్.
స్టార్ ఇమేజ్ అనేది కేవలం మొదటి రోజు థియేటర్లకు జనాన్ని రప్పించడానికి మాత్రమే హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత ఆడియన్స్ కు కనెక్ట్ అయితేనే ఏ ప్రాజెక్ట్ అయినా సక్సెస్ ట్రాక్ ఎక్కుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ని ఎట్రాక్ట్ చేసేలా అజయ్ భూపతి ఎలాంటి గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ రాసుకున్నాడనే దానిపైనే జయకృష్ణ కెరీర్ ఆధారపడి ఉంటుంది.
జూలై 30న ఈ శ్రీనివాసమంగాపురం థియేటర్లలోకి రాబోతోంది. మహేష్ అందించిన సపోర్ట్ తో ఓపెనింగ్స్ కు కావాల్సిన బజ్ అయితే సెట్ అయింది. నెక్స్ట్ జనరేషన్ పెద్దోడి కోసం బాబాయ్ తన పని పూర్తి చేశాడు. ఇక బాక్సాఫీస్ దగ్గర అజయ్ భూపతి మేకింగ్, జయకృష్ణ యాక్టింగ్ ఆ అంచనాలను ఏ స్థాయిలో అందుకుంటాయో స్క్రీన్ మీదే తేలనుంది. కంటెంట్ తో హిట్ కొడితేనే ఈ యంగ్ హీరోకి ఇండస్ట్రీలో సాలిడ్ ఫౌండేషన్ పడుతుంది.
