Begin typing your search above and press return to search.

అన్న కొడుక్కి ఫుల్ సపోర్ట్.. డెబ్యూతో హిట్ పడితే..

ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న వేళ.. ఇప్పుడు అందరి దృష్టి జయకృష్ణపైనే ఉంది.

By:  M Prashanth   |   13 July 2026 10:36 AM IST
అన్న కొడుక్కి ఫుల్ సపోర్ట్.. డెబ్యూతో హిట్ పడితే..
X

ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న వేళ.. ఇప్పుడు అందరి దృష్టి జయకృష్ణపైనే ఉంది. అయితే ఆ డెబ్యూను మరింత స్పెషల్ గా మార్చింది ఆయన వెనుక నిలుస్తున్న బాబాయ్, సూపర్ స్టార్ మహేష్ బాబు. తొలి సినిమాతోనే ఆకట్టుకోవాలనే టార్గెట్ తో జయకృష్ణకు మహేష్ బాబు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

నిజానికి కొత్త హీరోకు తొలి సినిమా ఎంత కీలకమో మహేష్ బాబుకు బాగా తెలుసు. అందుకే జయకృష్ణ డెబ్యూ ప్రాజెక్ట్ విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కథ ఎంపిక, దర్శకుడి ఎంపిక, సినిమా నిర్మాణం వంటి అంశాల్లో తన సూచనలు ఇస్తున్నారని సమాచారం. కొత్త హీరోకు సరైన డెబ్యూ దక్కేలా ప్రతి విషయాన్ని కూడా ఆయన జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో సినిమా ప్రమోషన్స్‌ లో కూడా మహేష్ బాబు కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జయకృష్ణను ప్రేక్షకులకు మరింత దగ్గర చేయడానికి అవసరమైన మద్దతు అందిస్తారని అభిమానులు కొన్నిరోజులుగా అంచనా వేస్తున్నారు. అవసరమైతే తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ ద్వారా కూడా సహకారం అందించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

మరోవైపు జయకృష్ణ కూడా నటుడిగా తనను తాను నిరూపించుకోవడానికి గట్టిగానే సిద్ధమయ్యాడు. ఫారిన్ లో యాక్టింగ్ కు సంబంధించిన వివిధ కోర్సులు పూర్తి చేసిన ఆయన.. హీరోకు అవసరమైన ఫిట్నెస్, డ్యాన్స్ విషయంలో స్పెషల్ ట్రైనింగ్ తోపాటు ఫైట్స్‌ లలోనూ ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. కేవలం స్టార్ వారసుడిగా కాకుండా, తన టాలెంట్ తో గుర్తింపు సంపాదించుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడని టాక్ వినిపిస్తోంది.

జయకృష్ణ డెబ్యూ ప్రాజెక్టు శ్రీనివాస మంగాపురం సినిమాకు దర్శకుడు అజయ్ భూపతి. విభిన్న కథలను ఎంచుకునే దర్శకుడిగా పేరున్న ఆయన.. ఇప్పుడు కూడా కొత్త తరహాలో రూపొందిస్తున్నట్లు సమాచారం. కథతో పాటు జయకృష్ణ రోల్ ను ఫుల్ స్ట్రాంగ్ గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టుపై సినీ ప్రియుల్లో ఆసక్తి పెరుగుతోంది. రమేష్ బాబు మరణం తర్వాత జయకృష్ణకు కుటుంబపరంగా అండగా నిలిచిన మహేష్ బాబు.. ఇప్పుడు సినీ ప్రయాణంలోనూ అదే బాధ్యత తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జయకృష్ణ కెరీర్‌ కు స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయాలన్న ఉద్దేశంతోనే ప్రతి విషయంలో గైడ్ చేస్తున్నారని తెలుస్తోంది. యితే స్టార్ కుటుంబం నుంచి రావడం ఒక్కటే విజయానికి హామీ కాదు. ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటేనే కొత్త హీరోకు గుర్తింపు వస్తుంది. ఆ పరంగా చూస్తే జయకృష్ణకు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న దర్శకుడి మద్దతుతో పాటు మహేష్ బాబు అండ కూడా కలిసి వస్తోంది. ఇప్పుడు ఆ కాంబినేషన్ తొలి సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో, జయకృష్ణ డెబ్యూతోనే విజయాన్ని అందుకుని ఘట్టమనేని వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాడో లేదో చూడాలి.