Begin typing your search above and press return to search.

SSMB29 సర్ ప్రైజ్ ని పాడుచేశారుగా.. జక్కన్న పెనాల్టీ

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ (SSMB29) కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

By:  M Prashanth   |   2 Nov 2025 9:13 AM IST
SSMB29 సర్ ప్రైజ్ ని పాడుచేశారుగా.. జక్కన్న పెనాల్టీ
X

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ (SSMB29) కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ప్రియాంక, పృథ్వీరాజ్ ఉన్నా కూడా ఏదో ఒక లీక్ ద్వారా బయటపడడమే కానీ అఫీషియల్ గా ఎక్కడా రివిల్ చేసింది లేదు. ఇక ఈ సినిమా గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా అది సెన్సేషనే. అలాంటిది, ఇప్పుడు ఏకంగా సినిమా మెయిన్ కాస్టింగ్‌కు సంబంధించిన పెద్ద న్యూస్, అదీ చాలా ఫన్నీగా సోషల్ మీడియా ద్వారా మరోసారి బయటపడింది. దీనికి కారణం మరెవరో కాదు, హీరో మహేష్ బాబే.






నవంబర్ లో అప్డేట్ ఉంటుందని ఇటీవల రాజమౌళి ఓ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక నవంబర్ 1 రాగానే, మహేష్ బాబు ట్విట్టర్‌లో రాజమౌళిని ట్యాగ్ చేస్తూ, "ఇప్పటికే నవంబర్ వచ్చేసింది" అని గుర్తుచేశారు. ఆ తర్వాత మరో ట్వీట్‌లో, "ముందుగా, మీరు నవంబర్‌లో ఏదో అప్‌డేట్ ఇస్తానని మాట ఇచ్చారు. దయచేసి మీ మాట నిలబెట్టుకోండి" అంటూ, జక్కన్న 'మహాభారతం' ప్రాజెక్ట్‌పై సరదాగా సెటైర్ వేశారు. అలాగే ప్రియాంక, పృథ్వీరాజ్ లను కూడా ట్యాగ్ చేస్తూ డిస్కషన్ లోకి లాగాడు.





ఈ ట్వీట్‌కు రాజమౌళి మొదట, "ఇప్పుడే మొదలైంది మహేష్. ఒక్కొక్కటిగా బయటపెడతాం" అని కూల్‌గా రిప్లై ఇచ్చారు. కానీ, ఆ తర్వాత మహేష్‌ను ఉద్దేశిస్తూ, "మహేష్.. నువ్వు ప్రియాంక చోప్రా (PC) గురించి రివీల్ చేసి సర్‌ప్రైజ్‌ను పాడుచేశావ్" అంటూ మరో ట్వీట్ వేశారు. ఈ ఒక్క ట్వీట్‌తో, SSMB29లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తోందన్న బిగ్గెస్ట్ రూమర్‌ను జక్కన్న దాదాపు కన్ఫర్మ్ చేసినట్లయింది.

ఈ ట్వీట్ వార్‌లోకి ప్రియాంక చోప్రా కూడా ఎంట్రీ ఇచ్చింది. మహేష్‌ను ట్యాగ్ చేస్తూ, "హలో హీరో!!! నేను సెట్‌లో నువ్వు నాతో షేర్ చేసుకున్న కథలన్నీ లీక్ చేయమంటావా? మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా వేసేస్తా.." అని తెలుగులో ఫన్నీ వార్నింగ్ ఇచ్చింది. దీన్నిబట్టి ప్రియాంక సినిమాలో ఉండటమే కాదు, ఆల్రెడీ మహేష్‌తో కలిసి సెట్స్‌పై షూటింగ్‌లో కూడా పాల్గొన్నట్లు క్లారిటీ వచ్చేసింది.

ఈ స్టార్ కాస్టింగ్ ఇక్కడితో ఆగలేదు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ డిస్కషన్‌లో జాయిన్ అయ్యాడు. "రాజమౌళి సార్, ఈ హైదరాబాద్ 'వెకేషన్స్' కోసం మా ఇంట్లో చెప్పడానికి నా దగ్గర అబద్ధాలన్నీ అయిపోతున్నాయి. ఇంకొన్నాళ్లు ఇలాగే కంటిన్యూ చేస్తే, మా ఫ్యామిలీ నన్ను అనుమానించడం మొదలుపెడుతుంది" అని ట్వీట్ చేశాడు. అంటే, పృథ్వీరాజ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు, తరచూ షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తున్నట్లు పరోక్షంగా చెప్పేశాడు.

ఈ స్టార్లందరినీ బయటపెట్టినందుకు రాజమౌళి, మహేష్‌పై ఫన్నీగా కోప్పడ్డారు. "అంతా పాడుచేశావ్" అనడంతో, మహేష్ "సరే, రేపు ఏదో ఒకటి రిలీజ్ చేయండి, దాన్ని సర్‌ప్రైజ్ అని పిలుద్దాం" అని కూల్ చేసే ప్రయత్నం చేశారు. దానికి జక్కన్న, "డీల్ ఓకే. కానీ నీ అతి వ్యంగ్యానికి పెనాల్టీగా, నీ ఫస్ట్ లుక్‌ను డిలే చేస్తున్నా" అని సరదాగా వార్నింగ్ ఇచ్చారు. ఈ ఫన్ చాట్ మొత్తం ఇప్పుడు వైరల్ గా మారింది. మరి మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇస్తారో చూడాలి.