Begin typing your search above and press return to search.

'వారణాసి' వెనుక సైలెంట్ మ్యాన్

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమాపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

By:  M Prashanth   |   22 Nov 2025 1:30 PM IST
వారణాసి వెనుక సైలెంట్ మ్యాన్
X

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమాపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్‌గా జరిగిన 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్‌తో ఈ సినిమా హైప్ హై రేంజ్ కి వెళ్లింది. గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మహేశ్ బాబు వేసిన ఒక లేటెస్ట్ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.





నేడు రాజమౌళి కుమారుడు, 'వారణాసి' సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్.ఎస్. కార్తికేయ పుట్టినరోజు. ఈ సందర్భంగా మహేశ్ బాబు సోషల్ మీడియా ద్వారా కార్తికేయకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కేవలం విషెస్ చెప్పడమే కాకుండా, ఆయన పనితీరుపై మహేశ్ కురిపించిన ప్రశంసలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కార్తికేయను "ది సైలెంట్ మ్యాన్" అని సంబోధించడం విశేషం.

"మేము నిర్మించే ప్రతి అద్భుతం వెనుక ఉండే నిశ్శబ్ద శక్తి నువ్వే.. హ్యాపీ బర్త్‌డే కార్త్" అంటూ మహేశ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అంతేకాదు, "అత్యంత కఠినమైన పనులను కూడా నువ్వు ఎంత సులువుగా, కూల్ గా చక్కబెడతావో చూస్తుంటే నాకు ఎప్పుడూ ఆశ్చర్యం వేస్తుంది" అని మహేశ్ ఆకాశానికెత్తేశారు. ముఖ్యంగా మొన్న జరిగిన 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ నిర్వహణలో కార్తికేయ చూపిన పనితీరును మహేశ్ పరోక్షంగా మెచ్చుకున్నట్లు అర్థమవుతోంది.

ఈ ట్వీట్‌తో పాటు మహేశ్ షేర్ చేసిన ఫోటో కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో మహేశ్ బాబు క్యాజువల్ లుక్‌లో, క్యాప్ పెట్టుకుని చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. పక్కనే కార్తికేయ ఏదో సీరియస్‌గా వివరిస్తుండగా, మహేశ్ దాన్ని ఆసక్తిగా వింటున్నారు. ఇది 'వారణాసి' సినిమా లొకేషన్స్ లేదా ప్రొడక్షన్ పనుల సమయంలో తీసిన ఫోటో అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.

'వారణాసి' లాంటి గ్లోబల్ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. రాజమౌళి విజన్ తెరపైకి రావడంలో, ప్రొడక్షన్ వ్యవహారాలను చక్కబెట్టడంలో కార్తికేయది కీలక పాత్ర. తండ్రి ఆలోచనలకు తగ్గట్టుగా, ప్రపంచవ్యాప్తంగా సినిమాను ప్రమోట్ చేయడంలో కార్తికేయ ముందుంటున్నారు. 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ సక్సెస్ వెనుక ఉన్నది కూడా ఈ 'సైలెంట్ మ్యాన్' కష్టమే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

బయట ఎక్కువగా కనిపించకుండా, తన పని తాను చేసుకుపోయే కార్తికేయను 'సైలెంట్ మ్యాన్' అనడం వంద శాతం కరెక్ట్ అని నెటిజన్లు అంటున్నారు. మహేశ్ ట్వీట్‌తో కార్తికేయ టాలెంట్ మరోసారి వెలుగులోకి వచ్చింది. 'వారణాసి' టైటిల్ అనౌన్స్‌మెంట్ తర్వాత ఇంత పెద్ద కాంప్లిమెంట్ హీరో నుంచే రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మొత్తానికి మహేశ్ బాబు 'వారణాసి' టీమ్ వర్క్ ఎలా జరుగుతుందో హింట్ ఇచ్చారు. మరి ఈ సైలెంట్ మ్యాన్ ఆధ్వర్యంలో 'వారణాసి' ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.