మహేష్ మేనకోడలు హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గదు
By: Sravani Lakshmi Srungarapu | 10 Aug 2025 3:49 PM ISTకేవలం సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలే కాదు, వారి ఫ్యామిలీలకు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు రావడం ఆలస్యం వెంటనే వైరల్ అవుతూంటాయి. సోషల్ మీడియాలో వారి ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ వాటి గురించి డిస్కస్ చేస్తూ వాళ్లని వార్తల్లో నిలుపుతూ ఉంటారు. అయితే ఇప్పుడు అలానే ఓ స్టార్ హీరోకు సంబంధించిన వారి కుటుంబ సభ్యుల ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఆ ఫోటో మరెవరిదో కాదు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేన కోడలు జాన్వీ స్వరూప్ ఫోటోనే అది. మహేష్ బాబుకు ముగ్గురు అక్కాచెళ్లెల్లున్నారు. వారిలో ఒకరైన మంజుల కూతురే ఈ జాన్వీ స్వరూప్. తాజాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా మంజుల తన సోషల్ మీడియాలో ఓ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫోటోను షేర్ చేయగా ఆ ఫోటోలో తన కూతురు జాన్వీ స్వరూప్ తో పాటూ సుధీర్ బాబు కొడుకులు చరిత్ మానస్, దర్శన్ కూడా ఉన్నారు.
సుధీర్ బాబు కొడుకులతో జాన్వీ రాఖీ వేడుకలు
మంజుల, సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని అక్కా చెల్లెళ్లనే విషయం తెలిసిందే. ఆ వరుసలోనే సుధీర్ బాబు పిల్లలు జాన్వీ స్వరూప్ కు సోదరి అవుతుంది. కాగా జాన్వీ స్వరూప్ ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా సందీప్ కిషన్ హీరోగా వచ్చిన మనసుకు నచ్చింది సినిమాలో నటించింది. ఆ సినిమా తర్వాత జాన్వీ మరో సినిమా చేయలేదు. ఇప్పుడు మళ్లీ చాన్నాళ్ల తర్వాత మహేష్ మేనకోడలు, మేనల్లుళ్ల ఫోటోలు బయటకు రావడంతో ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి .
హీరోయిన్ లక్షణాలున్నాయి
జాన్వీ తల్లి మంజుల, తండ్రి సంజయ్ ఇద్దరూ చాలా కాలంగా సినీ పరిశ్రమలో ఉన్నవాళ్లే. వారి బాటలోనే తమ కూతురు జాన్వీ స్వరూప్ ను కూడా ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేలా చేశారు. కాబట్టి జాన్వీ ఫ్యూచర్ లో సినీ రంగం కాకుండా మరో రంగంలోకి వెళ్తుందనే ఆలోచన అక్కర్లేదు. ఈ ఫోటోలో జాన్వీ మాత్రం ఎంతో అందంగా చూడ ముచ్చటగా కనిపించింది. జాన్వీలో హీరోయిన్ అయ్యే క్వాలిటీస్ కూడా కనబడుతున్నాయని నెటిజన్లు ఆ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు.
