Begin typing your search above and press return to search.

'ధూమ్ -4' ఆఫ‌ర్ మ‌హేష్ రిజెక్ట్ చేసారా!

మహేష్ ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేయడంతో మేకర్స్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

By:  Srikanth Kontham   |   24 Oct 2026 6:00 PM IST
ధూమ్ -4 ఆఫ‌ర్  మ‌హేష్ రిజెక్ట్ చేసారా!
X

బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే `ధూమ్` ఫ్రాంచైజీకి దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన సిరీస్‌లో నాల్గవ భాగానికి సంబంధించిన ప్రచారం ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంటుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ సంచలన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కే యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలలో `ధూమ్` సిరీస్ ఎప్పుడూ ముందుంటుంది. ఈసారి ప్రాజెక్ట్‌కు సంబంధించి యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ దర్శకుడు ఆయాన్ ముఖర్జీకి దర్శకత్వ బాధ్యతలు అప్ప‌గించింది.

`బ్రహ్మాస్త్ర` వంటి విజువల్ వండర్ తర్వాత ఆయాన్ ముఖర్జీ ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఫ్రాంచైజీని ఎలా తెరకెక్కిస్తారనే దానిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమాలోని లీడ్ రోల్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న స్టార్ హీరోల పేర్లను పరిశీలించినట్లు తెలుస్తోంది. పాన్-ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా గ్లోబల్ వైడ్‌గా ప్రత్యేక గుర్తింపు ఉన్న టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ ను `ధూమ్ 4` ప్రధాన పాత్ర కోసం మేకర్స్ సంప్రదించారట.

బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం యశ్ రాజ్ ఫిల్మ్స్ టీమ్ మహేష్ ను కలిసి కథను వినిపించడం జరిగిందని.. ఈ ప్రాజెక్ట్‌లో ఆయన నటించాలని కోరారని తెలుస్తోంది. హిందీ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునేలా పాత్రను డిజైన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ భారీ ఆఫర్‌ను మహేష్ సున్నితంగా తిరస్కరించారుట‌. అందుకు గ‌ల కార‌ణాలు ఏంటి? అన్న‌ది బ‌య‌ట‌కు రాలేదు గానీ తొలి ఛాన్స్ మాత్రం ఆయ‌న‌కే వ‌చ్చింద‌న్న‌ది హాట్ టాపిక్.

మహేష్ ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేయడంతో మేకర్స్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

మ‌రి మ‌హేష్ ఎందుకు రిజెక్ట్ చేసిన‌ట్లు అంటే? బాలీవుడ్ లో అవ‌కాశాలు రావ‌డం మ‌హేష్‌కి కొత్తేం కాదు.

గ‌తంలోనూ చాలా అవ‌కాశాలు వ‌చ్చాయి. కానీ వాటిని సున్నితంగా తిరస్క‌రించారు. కానీ దూమ్ సిరీస్ లో ఛాన్స్ అలాంటి అవ‌కాశం కాదు. చాలా రేర్ గా వ‌చ్చేదే. కానీ మ‌హేష్ మ‌న‌సు అంగీక‌రించ‌లేదు. ఆయ‌న ఏం చేసినా? టాలీవుడ్ నుంచి మాత్ర‌మే చేయాల‌నే ఓ నిబంధ‌న బ‌లంగా పెట్టుకున్నారు.

ధూమ్ 4కి మ‌హేష్ ఒకే చెబితే గ‌నుక ఆ కండీష‌న్ బ్రేక్ అవుతుంది. మ‌హేష్ హైద‌రాబాద్ నుంచి ముంబై వెళ్లి ప‌ని చేయాల్సి ఉంటుంది. పైగా హిందీలో ఆ సినిమా చేయాలి. కానీ మహేష్ స్వ‌భాష‌ను ప్రేమించినంత‌గా ప‌ర భాష‌కు ఎంత పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌రు.

అలా `ధూమ్ 4` లో ఛాన్స్ ని వ‌దులుకుని ఉండొచ్చు. ఇప్పుడా పాత్ర కోసం బాలీవుడ్ లో ర‌ణ‌బీర్ క‌పూర్ ను ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం.