Begin typing your search above and press return to search.

ఆ సినిమా కోసం శంకర్ మూవీని వదులుకున్న మహేష్ బాబు.. జడ్జిమెంట్ సంగతేంటి?

సాధారణంగా ఏ హీరో అయినా సరే తన వద్దకు వచ్చిన ప్రతి కథను ఓకే చేస్తాడు అన్న గ్యారెంటీ లేదు.

By:  Madhu Reddy   |   4 Aug 2026 8:00 PM IST
ఆ సినిమా కోసం శంకర్ మూవీని వదులుకున్న మహేష్ బాబు.. జడ్జిమెంట్ సంగతేంటి?
X

సాధారణంగా ఏ హీరో అయినా సరే తన వద్దకు వచ్చిన ప్రతి కథను ఓకే చేస్తాడు అన్న గ్యారెంటీ లేదు. ముఖ్యంగా ఆ హీరోకి ఆ కథ నచ్చి ఆ సినిమాతో సక్సెస్ కొడతాము అనే ఆలోచన ఉంటేనే.. ఆ సినిమా చేయడానికి ఆసక్తి కనబరుస్తారు. అలా ఒక్కొక్కసారి వదులుకున్న సినిమాలు భారీ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఒక్కొక్కసారి హీరోల జడ్జిమెంట్ కరెక్ట్ అయ్యి , తాము వదులుకున్న సినిమాలు ఫ్లాప్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు తమ వద్దకు వచ్చిన కథలను కాదనుకొని వేరొక సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

శంకర్ మూవీనే వదులుకున్న మహేష్ బాబు..

ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు ఒక సినిమా కోసం ఏకంగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ మూవీ నే వదులుకున్నారట. ఈ విషయాన్ని ప్రముఖ డైరెక్టర్ శ్రీనువైట్ల తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు . మరి మహేష్ బాబు వదులుకున్న శంకర్ మూవీ ఏంటి? శంకర్ మూవీ ని వదులుకొని చేసిన ఆ సినిమా హిట్ అయిందా? లేక డిజాస్టర్ గా మిగిలిందా అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఒకే ఒక్కడు, రోబో ఇలా ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలను తెరకెక్కించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న డైరెక్టర్ శంకర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు ముఖ్యంగా శంకర్ సినిమా అంటే భారీ బడ్జెట్ తో కూడుకున్న విజువల్ వండర్ అనే కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి. అలాంటి శంకర్ స్వయంగా మహేష్ బాబును కలిసి మీకోసం ఒక కథను సిద్ధం చేశానని చెప్పినా మహేష్ బాబు రిజెక్ట్ చేశారట మరి ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం..

రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న దూకుడు..

ఆగస్టు 9వ తేదీన ప్రముఖ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు సినిమా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఫోర్ కే అల్ట్రా హెచ్డి ప్రదర్శన కాబోతున్న నేపథ్యంలో డైరెక్టర్ శ్రీనువైట్ల ఇంటర్వ్యూలలో హాజరవుతూ తెర వెనుక కథలు పంచుకుంటున్నారు. అందులో భాగంగానే యాంకర్ మాట్లాడుతూ.. పోలీస్ ఆఫీసర్ కి ఒక అల్టిమేట్ క్యారెక్టర్ అజయ్ పాత్ర. దానిని మీరు ఎలా డిజైన్ చేశారు? అని ప్రశ్నించగా.. సినిమా ఫస్ట్ లో రూఫ్ టాప్ సీన్ ఉంటుంది కదా.. బ్లూ మాస్కులో సాంగ్ షూటింగ్ జరిగేటప్పుడు పోలీస్ అనే ప్రౌడ్ మూమెంట్ తో చెప్పే డైలాగు, మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్లిపోతా వంటి డైలాగులు రాసి మహేష్ బాబుకు వినిపించాను. మహేష్ బాబు వెంటనే అదిరిపోయాయి సార్ డైలాగులు అని చెప్పారు.

ఆ సినిమా రీమేక్ అది..

ఆ పార్ట్ షూటింగ్ జరిగిన రోజు.. అదే సాయంత్రం మన సినిమాకు పార్లర్ గా శంకర్ మరో పెద్ద సినిమా తీస్తున్నారు. అదే రోజు శంకర్ గారి స్నేహితుడు సినిమా రీమేక్ ను మహేష్ బాబు చేయాలి. డేట్స్ సర్దుబాటు చేస్తున్న సమయంలో.. ఆరోజు డిన్నర్ నుంచే మహేష్ బాబు నమ్రత గారికి ఫోన్ చేసి.. "నమ్రత నేను ఆ సినిమా చేయడం లేదు. నాకు దూకుడు సినిమా చాలా ఇంపార్టెంట్. ఇదే చేస్తున్నాను" అని చెప్పారు. నేను వెంటనే ఆశ్చర్యపోయాను. బాబు శంకర్ గారి సినిమా.. నేను కూడా పెద్ద ఫ్యాన్ ని.. మీరు అలా ఎలా రిజెక్ట్ చేస్తారు అని అడగ్గానే.. లేదండీ , నేను ఈ సినిమానే చేస్తాను. ఈ సినిమా నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఇవాళ నాకు అర్థమైంది ఈ సినిమా.. మీరు డీల్ చేసిన విధానం.. చాలా నచ్చింది. అంటూ తెలిపారు. ఆయన నమ్మకం అలా నిజమయింది. ఇక దూకుడు సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి ఆయన కెరియర్లో మైల్ స్టోన్ గా నిలిచింది అంటూ తెలిపారు.