Begin typing your search above and press return to search.

మరోసారి 'వారణాసి' అలజడి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ట్రెండ్ సెట్టర్ రాజమౌళి కాంబోలో వస్తున్న వారణాసి సినిమా ఇప్పుడు గ్లోబల్ లెవల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

By:  M Prashanth   |   19 Jan 2026 9:51 AM IST
మరోసారి వారణాసి అలజడి
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ట్రెండ్ సెట్టర్ రాజమౌళి కాంబోలో వస్తున్న వారణాసి సినిమా ఇప్పుడు గ్లోబల్ లెవల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. గత నవంబర్‌లో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో ఈ సినిమాకు సంబంధించిన విజువల్స్, మహేష్ బాబు రుద్ర అవతారాన్ని చూశాక, ఆడియన్స్‌లో క్యూరియసిటీ పీక్స్‌కు చేరింది. ఇక ఇటీవల సంక్రాంతి సినిమాల హడావుడి కనిపించగా ఇప్పుడు ట్రెండ్ లో వారణాసి అలజడి మొదలైంది. రాజమౌళి సృష్టించబోయే ఈ విజువల్ వండర్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో భారీ తారాగణం ఉండటం మరో విశేషం. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక అసలు పాయింట్‌కు వస్తే, వారణాసి రిలీజ్ డేట్ విషయంలో గత కొంతకాలంగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ వచ్చే మార్చి 26న ఒక బిగ్ అప్‌డేట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ సర్ ప్రైజ్ లేదా అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఆ రోజే వచ్చే అవకాశం ఉందనే బజ్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, ఆ రోజు వచ్చే క్లారిటీతో ఈ సినిమాపై ఉన్న సస్పెన్స్ అంతా వీడిపోతుంది.

2027 ఏప్రిల్ మిడ్ లోనే సినిమా రిలీజ్ కానున్నట్లు అప్పుడే లీక్స్ వస్తున్నాయి. ఇక రాజమౌళి సాధారణంగా ప్రతి అప్‌డేట్‌ను చాలా ప్లాన్డ్‌గా, ఒక పండగలాగా రిలీజ్ చేస్తారు. మార్చి 26న రాబోయే అప్‌డేట్ కూడా అదే రేంజ్‌లో ఉండబోతోందని సమాచారం. ఇది కేవలం ఒక చిన్న పోస్టర్ మాత్రమే కాకుండా, సినిమా రిలీజ్ విండోను కన్ఫర్మ్ చేసే వీడియో అయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఆ రోజు గనుక పక్కా డేట్ బయటకు వస్తే, బాక్సాఫీస్ వద్ద ఇతర సినిమాల ప్లానింగ్ కూడా మారిపోయే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ వారణాసి సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. జక్కన్న తన మార్క్ గ్రాండియర్‌తో ఈ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్‌లో సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు కూడా తన లుక్ బాడీ లాంగ్వేజ్‌ను కంప్లీట్ గా మార్చేసుకున్నారు. మార్చి 26న రాబోయే ఆ సర్ ప్రైజ్ కోసం అటు మహేష్ ఫ్యాన్స్, ఇటు కామన్ ఆడియన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా వారణాసి విషయంలో వచ్చే ఆ ఒక్క అప్‌డేట్ టాలీవుడ్‌లోనే కాకుండా ఇండియన్ సినిమా మార్కెట్‌లో పెద్ద మార్పును తీసుకురాబోతోంది. ఆ రోజు వచ్చే అఫీషియల్ న్యూస్ కోసం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.