Begin typing your search above and press return to search.

వారణాసి గ్లింప్స్.. రాజమౌళి క్లూస్ పట్టేశారుగా..!

రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ లో వస్తున్న సినిమాకు వారణాసి అనే టైటిల్ లాక్ చేశారు.

By:  Ramesh Boddu   |   16 Nov 2025 11:15 AM IST
వారణాసి గ్లింప్స్.. రాజమౌళి క్లూస్ పట్టేశారుగా..!
X

రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ లో వస్తున్న సినిమాకు వారణాసి అనే టైటిల్ లాక్ చేశారు. శనివారం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో వారణాసి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ లో రాజమౌళి చూపించిన ప్రతి షాట్ విజువల్ ట్రీట్ అనేలా ఉన్నాయి. ఎందుకు రాజమౌళి గొప్ప దర్శకుడు అన్నది ఈ గ్లింప్స్ చూస్తేనే అర్ధమయ్యేలా ఉంది. ఐతే ఈ గ్లింప్స్ లో రాజమౌళి కొన్ని క్లూస్ కూడా వదిలాడు. ముఖ్యంగా చూపించిన ప్రతి విజువల్ లో అందరి దృష్టిని ఏమార్చేలా చేశాడు.

ప్రతి షాట్ లో మహేష్ బాబు..

ఐతే అందులో ప్రతి షాట్ లో మహేష్ బాబు ఉన్నాడు. ముఖ్యంగా ఆఫ్రికా అడవుల్లో ప్యారాషూట్ తో ఉంది మహేష్ బాబే అని.. లంకా నగరం లో అందరి ఫోకస్ హనుమంతుడి మీద ఉంటే.. వానర సైన్యం మీద రావణుడిని సంహరించేందుకు నిటారుగా విల్లు పట్టిన రాముడిగా మహేష్ బాబు అని.. అదే షాట్ లో ఓ పక్క రుద్రుడు అతని వెనకాల కుంభ ఉన్నారని కనిపెట్టారు. ఇక మందాకిని రెడ్ కలర్ శారీలో కిందపడుతున్న టైంలో రుద్ర అదే మన మహేష్ ఓ పక్క ఆమెను కాపాడాలని చూస్తాడు. ఇలా ప్రతి షాట్ లో సినిమాకు సంబంధించిన క్లూస్ ఇస్తూ వచ్చాడు రాజమౌళి.

వారణాసి గ్లింప్స్ చూసిన చాలామంది వీటిని డీ కోడ్ చేసి రాజమౌళి ఏదో పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నాడని అంటున్నారు. గ్లోబ్ త్రొట్టర్ సినిమాగా చెప్పుకొచ్చిన ఈ సినిమా ఇప్పుడు టైం త్రొట్టర్ అంటే టైం ట్రావెల్ అంటే కాలాలు కూడా మారే కథతో వస్తుందని హింట్ ఇచ్చాడు రాజమౌళి. ఏది ఏమైనా ఆ విజువల్స్, రుద్రుడిగా మహేష్ తాండవం తప్పకుండా టికెట్ కి డబల్ వర్త అనిపించేలా చేస్తుందని అనిపిస్తుంది.

రాజమౌళి ముద్ర పడిన సినిమా..

రాజమౌళి ముద్ర పడిన ఏ సినిమా ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేయదు. ముఖ్యంగా గ్లోబ్ త్రొట్టర్ గా ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్ లో వారణాసి తీస్తున్నాడు జక్కన్న. సినిమా గ్లింప్స్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించాడు. సో సినిమా అనుకున్న విధంగా తీస్తే మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ మీద నెవర్ బిఫోర్ రికార్డులకు ప్రత్యక్ష సాక్షులం అయ్యే ఛాన్స్ ఉంటుందని ఆడియన్స్ భావిస్తున్నారు.

వారణాసి టైటిల్ తో త్రేతా యుగం నుంచి వారణాసి 512 CE, ఆస్ట్రాయిడ్ శంభవి 2027 CE, వారణాసి మణికర్ణిక ఘాట్.. ఇలా తెర మీద అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్న జక్కన్న ఈసారి తెలుగు సినిమా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మొత్తం షేక్ అయ్యేలా చేస్తాడని ఫిక్స్ అయ్యారు.