మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ యాక్షన్ హంగామా!
సూపర్‌స్టార్ మహేష్ -రాజమౌళి కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కుతోన్న చిత్రం `వారణాసి`. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులలో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
By: Srikanth Kontham | 28 May 2026 4:31 PM ISTసూపర్‌స్టార్ మహేష్ - రాజమౌళి కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కుతోన్న చిత్రం 'వారణాసి'. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులలో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటున్న సినిమా కావడంతో? ఓ సరికొత్త ప్రపంచంలోకే జక్కన్న ప్రేక్షకుల్ని తీసుకె ళ్లబోతున్నారు. తాజాగా సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ ఫిలింనగర్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. చిత్ర యూనిట్ ఈ సినిమా కోసం మునుపెన్నడూ లేని విధంగా భారీ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం.
దాదాపు నెల రోజుల పాటు నాన్‌స్టాప్ యాక్షన్ షెడ్యూల్‌ను నిర్వహించబోతున్నారు. ఈ సుదీర్ఘ షెడ్యూల్‌లో ఎలాంటి బ్రేక్స్ లేకుండా హై-వోల్టేజ్ పోరాట ఘట్టాలను మాత్రమే చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. అంతర్జాతీయ స్థాయి స్టంట్ మాస్టర్స్ పర్యవేక్షణలో ఈ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నారు. ఈ భారీ షెడ్యూల్‌లో మహేష్ పూర్తి స్థాయి యాక్షన్ మోడ్‌లో కనిపించబోతున్నారు. గతంలో ఆయన నటించిన సినిమాలకు భిన్నంగా అత్యంత కఠినమైన, రా అండ్ రగ్గడ్ పోరాట సన్నివేశాలలో పాల్గొన నున్నారని తెలుస్తోంది.
ఈ అడ్వెంచరస్ పాత్ర కోసం మహేష్ ఇప్పటికే జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్‌లో కఠినమైన ట్రెక్కీంగ్ ట్రైనింగ్‌తో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శారీరక శిక్షణను పూర్తి చేస్తున్నారు. ఈ వన్-మ్యాన్ యాక్షన్ హంగామా ఆయన కెరీర్‌లోనే అత్యంత శారీరక శ్రమతో కూడుకున్నదిగా తెలుస్తోంది. బ్లాక్ ఫారెస్ట్ లో ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ ట్రైనింగ్ పూర్తి చేసారు. ప్రస్తుతం సెకెండ్ ఫేజ్ శిక్షణ కొనసాగుతుంది. అతి త్వరలో ఆ పార్ట్ కూడా పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రాజమౌళి సెట్స్ రణరంగానికి రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకూ ట్రైనర్ల సమక్షంలో నేర్చుకున్నదంతా జక్కన్న కెమెరా యాక్షన్ చెప్పగానే సూపర్ స్టార్ సై అంటూ బరిలోకి దిగుతారు.
రాజమౌళి తన సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్‌ను ఎంత గ్రాండ్‌గా, ఎమోషనల్‌గా డిజైన్ చేస్తారో? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. `బాహుబలి`, `ఆర్ఆర్ఆర్` చిత్రాల అంతర్జాతీయ విజయం తర్వాత ఆయన గ్లోబల్ స్క్రీన్‌పై తన ముద్రను మరింత బలంగా వేయడానికి వారణాసిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేవలం కంప్యూటర్ గ్రాఫిక్స్ పైనే ఆధారపడకుండా, రియలిస్టిక్ యాక్షన్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతోనే నెల రోజుల షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఈ యాక్షన్ సన్నివేశాలన్నీ హీరో క్యారెక్టర్‌ను పీక్స్‌లో ఎలివేట్ చేసేలా ఉంటాయని తెలుస్తోంది.
ఇంతటి భారీ స్థాయి నాన్‌స్టాప్ యాక్షన్ షెడ్యూల్‌ను నిర్వహించడం అనేది నిర్మాణ పరంగా పెద్ద సవాలుతో కూడుకున్న పని. భారీ బడ్జెట్, అత్యాధునిక హాలీవుడ్ కెమెరా సెటప్స్, వందలాది మంది అదనపు సిబ్బంది సమన్వయంతో ప్రొడక్షన్ టీమ్ ఎక్కడా రాజీ పడకుండా ఏర్పాట్లు చేస్తోంది. వన్-మంత్ పాటు సాగే సుదీర్ఘ షెడ్యూల్ పూర్తయితే సినిమా షూటింగ్ ప్రధాన భాగం ముగుస్తుందని తెలుస్తోంది. తద్వారా పాన్ -ఇండియా మార్కెట్‌లో ఈ చిత్రం క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజమౌళి సృజనాత్మకతకు- మహేష్ అంకితభావానికి సాక్ష్యంగా ఈ గ్లోబల్ అడ్వెంచర్ నిలవనుంది.
