Begin typing your search above and press return to search.

మహేష్ కి గ్రౌండ్ సెట్ చేస్తున్న రాజమౌళి..!

ఐతే ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ కోసం రాజమౌళి పనులు మొదలు పెట్టాడు. బాహుబలి 1, 2 కలిపి ఒక స్పెషల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా బాహుబలి ది ఎపిక్ ప్లాన్ చేస్తున్నారు.

By:  Ramesh Boddu   |   8 Oct 2025 1:47 PM IST
మహేష్ కి గ్రౌండ్ సెట్ చేస్తున్న రాజమౌళి..!
X

సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి చేస్తున్న గ్లోబ్ త్రొట్టెన్ సినిమాకు కావాల్సిన గ్రౌండ్ ని సెట్ చేస్తునాడని అనిపిస్తుంది. బాహుబలితో బాక్సాఫీస్ ప్రభంజనం సృష్టించిన రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తో ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని కూడా సర్ ప్రైజ్ చేశాడు. ఆ సినిమా ఆస్కార్ అవార్డ్ అందుకోవడంలో రాజమౌళి ప్రమోషన్స్ లెక్క తెలిసిందే. ఐతే ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ కోసం రాజమౌళి పనులు మొదలు పెట్టాడు. బాహుబలి 1, 2 కలిపి ఒక స్పెషల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా బాహుబలి ది ఎపిక్ ప్లాన్ చేస్తున్నారు.

ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం బాహుబలి..

ఈ సినిమాలో ఇది వరకు చూడని కొన్ని షాట్స్ కూడా ఉండొచ్చని టాక్. ఐతే ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో బాహుబలి నిర్మాత శోభు RRR తో ఎలాగు రాజమౌళి సినిమా ఎక్స్ పీరియన్స్ అయిన ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం బాహుబలి సిద్ధం చేస్తున్నామని అన్నారు. సో ట్రిపుల్ ఆర్ చూసిన ఇంటర్నేషనల్ ఆడియన్స్ బాహుబలిని చూసి సర్ ప్రైజ్ అవ్వాలని వీళ్ల ప్లాన్. ఐతే ఇదంతా రాజమౌళి నెక్స్ట్ చేస్తున్న మహేష్ సినిమా సెటప్ కోసం అనిపిస్తుంది.

ఎందుకంటే మహేష్ సినిమాను రాజమౌళి పక్కా హాలీవుడ్ బొమ్మలానే చేస్తున్నాడట. ఈ సినిమా బడ్జెట్ కూడా 1000 కోట్ల దాకా పెడుతున్నారని టాక్. సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా చేస్తున్నాడు. సినిమా కథకు మైథాలజీ టచ్ కూడా ఇస్తాడని చెబుతున్నారు. ఆల్రెడీ రాజమౌళి సినిమాలకు ఒక సెపరేట్ మార్క్ ఉంటుంది. అందులో మహేష్ బాబు ఈ సినిమా చేస్తున్నాడు కాబట్టి ఈ ప్రాజెక్ట్ పై మరింత హైప్ ఏర్పడింది.

మహేష్ 28 సినిమాలు ఒక లెక్క SSMB 29 మరో లెక్క..

బాహుబలి ఎపిక్ రిలీజ్ ప్లాన్ కూడా ఇంటర్నేషనల్ ఆడియన్స్ రాజమౌళి సినిమా మేకింగ్ పై మరోసారి తెలుసుకునే ఛాన్స్ ఉంది. సో మహేష్ సినిమా కోసం రాజమౌళి ముందే గ్రౌండ్ అంతా సెటప్ చేసి నెక్స్ట్ ఆ సినిమాతో ఏ ఒక్క రికార్డ్ కూడా వదలకుండా దుమ్ము దులిపేయాలని చూస్తున్నాడని చెప్పొచ్చు.

మహేష్ కూడా ఇప్పటివరకు చేసిన 28 సినిమాలు ఒక లెక్క అయితే రాబోతున్న ఎస్.ఎస్.ఎం.బి 29 మరో లెక్క అనేలా ఫోకస్ చేస్తున్నాడు. ఎలాగు రాజమౌళి సినిమా అంటే అన్నీ ఆయన కంట్రోల్ లోనే ఉంటాయన్న టాక్ ఉంటుంది. సో సినిమా రిలీజ్ వరకు మహేష్ కూడా రాజమౌళి చెప్పినట్టు చేయక తప్పదు. ఈ సినిమాను 2027 రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నవంబర్ లో మహేష్ రాజమౌళి సినిమా అప్డేట్ ఒకటి వస్తుందని తెలుస్తుంది.