SSMB29 రిలీజ్ టార్గెట్.. ఓ ప్లాన్ సెట్ చేసుకున్న జక్కన్న
ఇప్పటివరకు టైటిల్, ఫస్ట్ లుక్, క్యారెక్టర్ డిజైన్ వంటి వాటిపై ఒక్క క్లారిటీ కూడా రాకపోవడంతో మరింత ఆతృత పెరిగింది. అయితే ఇప్పుడు మేకర్స్ రిలీజ్ టార్గెట్‌ను ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
By: M Prashanth | 23 Aug 2025 9:15 AM ISTమెగాస్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న SSMB29 సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న తీసే సినిమా కావడం, అందులో మహేష్ లాంటి సూపర్‌స్టార్ నటించడం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై పాన్ వరల్డ్ స్థాయిలో హైప్ నెలకొంది.
ఈ మూవీ పూర్తి వివరాలను ఎప్పుడు ప్రకటిస్తారా అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొని ఉంది. ఇప్పటివరకు టైటిల్, ఫస్ట్ లుక్, క్యారెక్టర్ డిజైన్ వంటి వాటిపై ఒక్క క్లారిటీ కూడా రాకపోవడంతో మరింత ఆతృత పెరిగింది. అయితే ఇప్పుడు మేకర్స్ రిలీజ్ టార్గెట్‌ను ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం SSMB29 సినిమాను 2027 మార్చి 25న రిలీజ్ చేసేలా టీమ్ ప్లాన్ వేసిందని చెబుతున్నారు. ఆ టైమ్‌లో సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతాయి. అదే సమయంలో గుడ్ ఫ్రైడే లాంగ్ వీకెండ్ కూడా వస్తుంది. దాంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లకు పర్ఫెక్ట్ సీజన్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
ఇకపోతే ఇప్పటి వరకు సినిమా గురించి ఒక్క అప్డేట్ కూడా రాలేదని ఫ్యాన్స్ అనుకున్నా, రాజమౌళి క్లారిటీ ఇచ్చేశారు. అన్ని ఆఫీషియల్ వివరాలు ఈ నవంబర్‌లో రానున్నాయని ఆయన ఇటీవలే ఒక అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నారు. టైటిల్, లుక్, కాన్సెప్ట్ గ్లింప్స్‌తో మొదలయ్యే ప్రమోషన్లకు వరల్డ్‌వైడ్ రేంజ్‌లో రిస్పాన్స్ వస్తుందని ఖాయంగా కనిపిస్తోంది.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రాజమౌళి ఈ సారి అడ్వెంచర్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో కథను తెరకెక్కిస్తున్నారని టాక్. మహేష్ బాబు క్యారెక్టర్ వేరే లెవెల్‌లో ఉండబోతోందని చెబుతున్నారు. హాలీవుడ్ టెక్నికల్ టీమ్స్ కూడా భాగమవుతున్న ప్రాజెక్ట్ కావడంతో విజువల్ ఎక్స్‌పీరియెన్స్ కొత్త రేంజ్‌లో ఉండబోతుందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. మొత్తానికి 2027 మార్చి 25 రిలీజ్ టార్గెట్‌ను లాక్ చేశారని వస్తున్న వార్తలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగించాయి. ఇక నవంబర్‌లో టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యే వరకు ఆ ఎక్సైట్మెంట్ ఆగదనేది మాత్రం నిజం.
