SSMB 29: ఈ బడ్జెట్ లెక్కలు నెవ్వర్ బిఫోర్
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ఎదురుచూస్తున్న సినిమాల్లో మహేశ్ బాబు- రాజమౌళి SSMB29 ఒకటి.
By: M Prashanth | 4 Sept 2025 1:17 PM ISTఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ఎదురుచూస్తున్న సినిమాల్లో మహేశ్ బాబు- రాజమౌళి SSMB29 ఒకటి. ఈ సినిమా ప్రకటించిన రోజు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా మహేశ్ ప్రీ లుక్ పోస్టర్ తో హైప్ మరింత క్రియేట్ అయ్యింది. అయితే రాజమౌళి సినిమా అంటే ఆటోమేటిక్ గానే హైప్ ఉంటుంది. దానికి ప్రత్యేకంగా హైప్ అక్కర్లేదు. ఈ సినిమా నిర్మాణం విషయంలో తాజాగా ఒక విషయం ప్రచారంలోకి వచ్చింది.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కెన్యాలో జరుగుతుంది. రీసెంట్ గా మూవీ బృందం అక్కడి అధికారులతోనూ సమావేశమైంది. అయితే చిత్రం బడ్జెట్ గురించి అధికారికంగా ఎక్కడా ప్రస్తావించకపోయినా రూ.800 కోట్లు అని ఇన్నిరోజులు ప్రచారం సాగింది. కానీ, కెన్యా అధికారులతో మీటింగ్ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ లో బజ్ వచ్చింది. ఇది అంతర్జాతీయంగా భారీ సంచలనాన్ని సృష్టించింది.
ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్ట్ రూ. 1200 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడుతుందని ఒక కెన్యా దినపత్రిక తమ నివేదికలో పేర్కొంది. అప్పటి నుండి దీనిని ఇండియన్ మీడియా సంస్థలు కూడా ప్రచారం చేస్తున్నాయి. అయితే ఇక్కడే అతి పెద్ద సందేహం నెలకొంది. రాజమౌళి భారీ ప్రాజెక్ట్ బాహుబలి సినిమాలు రెండు కలిపి దాదాపు రూ.500 కోట్లకు నిర్మించారు. మరోవైపు అల్లు అర్జున్ - అట్లీ రాబోయే ప్రాజెక్ట్ రూ.700 కోట్లతో రూపొందిస్తున్నారని టాక్.
అయితే రాజమౌళి నిజంగా రూ.1200 కోట్లు ఖర్చు చేయిస్తున్నాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ లెక్కన బాహుబలి, అల్లు అర్జున్ - అట్లీ ఈ రెండు ప్రాజెక్ట్ ల విలువ కలుపుకొని ఉంటుందన్న మాట. మరి నిర్మాత కే ఎల్ నారాయణ్ ఈ బడ్జెట్ సెట్ చేయగలడా? నారాయణ దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమా నిర్మించలేదు. అయన చివరిసారిగా నిర్మించిన చిత్రం జూనియర్ ఎన్టీఆర్ రాఖీ. అది (2006).
ఆయన హైదరాబాద్ , విజయవాడలోని అత్యంత ధనవంతులైన రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో ఒకరు. ఆయన రియల్ ఎస్టేట్ వెంచర్లు కలిగి ఉన్నారు. దీంతో ఆయన ఆర్థిక స్తోమత ఈ బడ్జెట్ కు ఆందోళన కలిగించదు. కానీ ఇంతటి భారీ బడ్జెట్ సినిమాకు రెండు భాగాల ప్లాన్ కాకుండా ఒక భాగానికి అయినా పెట్టదగినదేనా అనే అనుమానం కలుగుతోంది. కాగా, ఈ సినిమాలో మహేష్ బాబు లీడ్ పాత్రలో నటించనుండగా, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ పాత్ర పోషిస్తుంది. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
