టాలీవుడ్ నుంచే ప్రపంచాన్ని ఏలేలా ఆ ద్వయం!
ఇప్పటివరకు నెక్స్ట్ సినిమా హీరో ఎవరనేది ప్రకటించకపోవడంతో `వారణాసి` తర్వాత కూడా జాక్ పాట్ ఆఫర్ సూపర్‌స్టార్ మహేష్ కే వరిస్తుందా? అన్న అంచనాలు అంతకంతకు బలపడుతున్నాయి.
By: Srikanth Kontham | 13 Oct 2026 5:00 PM ISTప్రపంచవ్యాప్తంగా రాజమౌళి-మహేష్ అడ్వెంచర్ థ్రిల్లర్ `వారణాసి` కోసం పాన్-వరల్డ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటే? ఫిలిం నగర్ వర్గాల్లో మాత్రం అంతకంటే క్రేజీ గుసగుసలు మొదలయ్యాయి. ఈ టాలీవుడ్ డైనమిక్ డ్యుయో ప్రయాణం ఒక్క సినిమాతో ముగిసిపోదని..ఇదే కాంబినేషన్ లో మరో సంచలన చిత్రం రావడం ఖాయమనే వార్త ఫిలిం సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది. సాధారణంగా రాజమౌళి ఒక సినిమా పూర్తి చేసి.. థియేటర్లలోకి వచ్చే వరకు తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుంది? కథ ఏంటి? అనే విషయాలపై ఎలాంటి క్లూ ఇవ్వరు.
ఇప్పటివరకు నెక్స్ట్ సినిమా హీరో ఎవరనేది ప్రకటించకపోవడంతో `వారణాసి` తర్వాత కూడా జాక్ పాట్ ఆఫర్ సూపర్‌స్టార్ మహేష్ కే వరిస్తుందా? అన్న అంచనాలు అంతకంతకు బలపడుతున్నాయి. మహేష్ తో రాజమౌళి ప్లాన్ చేసిన గ్లోబల్ ప్రాజెక్ట్ మేకింగ్ సమయంలో ఇద్దరి మధ్య కుదిరిన బాండింగ్, విజనరీ సపోర్ట్ చూస్తుంటే ఈ జోడీ మళ్లీ రిపీట్ కావడం పక్కా అనే టాక్ వినిపిస్తోంది. గతంలో ఒక స్టార్‌తో పనిచేసిన వెంటనే వేరే హీరోతో ప్రాజెక్ట్ పట్టాలెక్కించే రాజమౌళి ఈసారి మాత్రం మహేష్ తోనే వరుసగా రెండో సినిమా చేసేందుకు మొగ్గు చూపుతున్నారనే వార్త ఇండియన్ సినిమా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మరోవైపు మహేష్ కూడా రాజమౌళి విజన్‌కు, పనిరాక్షసత్వానికి పూర్తిగా ఫిదా అయిపోయారని.. భవిష్యత్తులోనూ ఈ కాంబినేషన్‌లో మరిన్ని అంతర్జాతీయ స్థాయి చిత్రాలు తీసే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రా యపడుతున్నారు. ఈ నేపథ్యంలో జక్కన్న తదుపరి ప్రాజెక్ట్‌పై సస్పెన్స్ .. సందేహాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ప్రస్తుతానికి ఇద్దరి దృష్టి `వారణాసి` చిత్రాన్ని గ్లోబల్ స్కేల్‌లో అద్భుతమైన విజువల్ వండర్‌గా తీర్చిదిద్దడంపైనే ఉంది. ఈ సినిమా విడుదల తర్వాతే తదుపరి కాంబోపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా? ఈ దిగ్గజాల కలయిక బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు.
రిలీజ్ అనంతరం `వారణాసి` హిట్ అయితే? మరింత ఉత్సాహంగా ముందుకొచ్చే అవకాశాలు మెండుగా కనిపి స్తున్నాయి. ఇద్దరిలోనూ ఓ సారుప్యత కూడా ఉంది. మహేష్-రాజమౌళి ఎలాంటి అద్భుతాలు చేయాల నుకున్నా? అది టాలీవుడ్ నుంచే అన్నది సుస్పష్టం. అందులో ఎలాంటి సందేహం లేదు. బాలీవుడ్ కి వెళ్లడం గానీ మరే పరిశ్రమకు వెళ్లిగానీ తమను తాము నిరూపించుకునే అవసరం లేదన్న టైప్. ఇలాంటి లక్షణాలున్న ఇద్దరు కలిసి అద్భుతం చేయాలంటే? అంతే పట్టుదలగా ముందుకెళ్లాలి. అది జరగాలంటే? ఇరువురు ఒకేతాటిపై ఉంటేనే సాధ్యమవుతుంది.
