Begin typing your search above and press return to search.

'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్.. ఎంత జాగ్రత్తగా ఉన్నారంటే..

ఇదంతా బాగానే ఉంది కానీ, అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఈవెంట్‌కు కెమెరాలకు అస్సలు అనుమతి లేదట. ప్రొఫెషనల్ కెమెరాలే కాదు, కనీసం ఫోన్ కెమెరాలను కూడా అనుమతించేలా లేరు.

By:  M Prashanth   |   10 Nov 2025 1:59 PM IST
గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్.. ఎంత జాగ్రత్తగా ఉన్నారంటే..
X

'RRR' తర్వాత జక్కన్న, 'గుంటూరు కారం' తర్వాత సూపర్ స్టార్.. ఈ ఇద్దరి కాంబో (SSMB29) నుంచి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా అది నేషనల్ న్యూస్. అలాంటిది, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫస్ట్ అఫీషియల్ ఈవెంట్ ఫిక్స్ అయింది. "గ్లోబ్ ట్రాటర్" అనే టైటిల్‌తో ఈ సంచలన ఈవెంట్‌ను నవంబర్ 15న సాయంత్రం 6:30 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ ఈవెంట్‌కు మేకర్స్ పెట్టిన ఒక్క కండిషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ ఈవెంట్‌కు సంబంధించి మీడియా మిత్రులకు ఒక ఎక్స్‌క్లూజివ్ ఇన్వైట్ వెళ్తోంది. మీడియా కోసం ఫిలింనగర్ నుంచి ఆర్‌ఎఫ్‌సికి స్పెషల్ బస్సులు కూడా అరేంజ్ చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ, అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఈవెంట్‌కు కెమెరాలకు అస్సలు అనుమతి లేదట. ప్రొఫెషనల్ కెమెరాలే కాదు, కనీసం ఫోన్ కెమెరాలను కూడా అనుమతించేలా లేరు.

ఈ ఒక్క రూల్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో, ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీని పెంచేసింది. అసలు జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నాడు? కెమెరాలు లేకుండా మీడియాను పిలిచి ఏం చూపించబోతున్నాడు? అనేది హాట్ టాపిక్ గా మారింది. 'గ్లోబ్ ట్రాటర్' లాంటి 1000 కోట్ల ప్రాజెక్ట్ నుంచి ఏ చిన్న విజువల్ లీక్ అయినా, అది సినిమాపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందని రాజమౌళి చాలా కేర్ తీసుకుంటున్నాడు. రీసెంట్‌గా 'కుంభ' పోస్టర్‌పై వచ్చిన భిన్నమైన టాక్ తర్వాత, జక్కన్న మరింత కేర్‌ఫుల్‌గా అడుగులు వేస్తున్నట్టున్నాడు.

బహుశా, ఇది రెగ్యులర్ ఈవెంట్ కాకపోవచ్చు. ఇప్పటికే జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ కు సిద్ధమైన విషయం తెలిసిందే. లైవ్ లో టెలికాస్ట్ కు ప్లాన్ సిద్ధం చేశారు. ఇది ఒక "ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌పీరియన్స్" గా అందించాలని జక్కన్న టీమ్ ప్లాన్ చేసినట్లు అర్ధమవుతుంది. కెమెరాలను బ్యాన్ చేయడం ద్వారా, ఆ ఈవెంట్‌లో ఏం జరగబోతోందనే హైప్‌ను జక్కన్న పీక్స్‌కు తీసుకెళ్లాడు. ఈవెంట్‌కు ముందే ఈ రేంజ్ హైప్ ఉంటే, ఇక నవంబర్ 15 సాయంత్రం ఏం జరగబోతోందో.

ఏదేమైనా, 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే "మోస్ట్ హైప్డ్" ఈవెంట్‌గా నిలిచిపోనుందని చెప్పవచ్చు. నవంబర్ 15న ఆ ఆర్ఎఫ్‌సి గేట్ల వెనుక జక్కన్న ఏం మాయ చేయబోతున్నాడో తెలియాలంటే, ఆ రోజు సాయంత్రం వరకు ఆగాల్సిందే. అలాగే ప్రతీ సినిమాకు ముందు జక్కన్న తన సినిమాకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని ప్రత్యేకంగా మీడియాతో షేర్ చేసుకుంటారు. దాని కథ, అలాగే తెరకెక్కించే విధానంపై ఒక క్లారిటీ ఇచ్చి హైప్ పెంచుతారు. మరి ఈసారి ఈవెంట్ ద్వారా ఏం చెబుతారో చూడాలి.