Begin typing your search above and press return to search.

మ‌హేష్ కూడా మైండ్ లో బ్లైండ్ గా ఫిక్సైపోయాడు

మ‌హేష్ ఈవెంట్ కి త‌న స్టైల్లో వ‌స్తానంటే జ‌క్క‌న్న కుద‌ర‌ద‌న్నాడు. తాను డిజైన్ చేసిన దుస్తులు వేసుకుని రావాలాని ఆదేశించాడు.

By:  Srikanth Kontham   |   18 Nov 2025 3:00 PM IST
మ‌హేష్ కూడా మైండ్ లో బ్లైండ్ గా ఫిక్సైపోయాడు
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ త‌న సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో చాలా సింపుల్ గా పాల్గొంటాడు. బులుగు షర్ట్ వేసుకొని చాల సింపుల్ గా వ‌చ్చేస్తాడు. తాను ఏ సినిమా చేసినా? అటెండ్ అయ్యే ఈవెంట్ ప్రీ రిలీజ్ ఒక్క‌టే కాబ‌ట్టి మైండ్ లో అలా ఫిక్సై బ్లైండ్ గా వ‌చ్చేస్తాడు. కాసేపు జ‌రిగే ఎంట‌ర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్ చూసి చివ‌ర్లో మాట్లాడి వెళ్లిపోవ‌డం అల‌వాటు. దాదాపు కొన్ని ద‌శాబ్దాలుగా మ‌హేష్ చేస్తోన్న‌ది అదే. కానీ మ‌హేష్ జీవితంలోకి రాజ‌మౌళి ఎంట‌ర్ అయిన ద‌గ్గ‌ర నుంచి సీనే మారింద‌న్న‌ది క్లియ‌ర్. ఇటీవ‌లే జరిగిన 'ఎస్ ఎస్ ఎంబీ 29 వార‌ణాసి' ఈవెంట్ లో మ‌హేష్ ఎంత హంగామా చేసాడో తెలిసిందే.

సింపుల్ గా అంటే నో:

మ‌హేష్ ఈవెంట్ కి త‌న స్టైల్లో వ‌స్తానంటే జ‌క్క‌న్న కుద‌ర‌ద‌న్నాడు. తాను డిజైన్ చేసిన దుస్తులు వేసుకుని రావాలాని ఆదేశించాడు. దీంతో ఆయ‌న ఆదేశాల మేర‌కు మ‌హేష్ అలాగే ముస్తాబై వ‌చ్చాడు. త‌న‌ని అలా చూసుకునే మ‌హేష్ స‌ర్ ప్రైజ్ అయ్యాడు. ఎప్పుడు రెగ్యుల‌ర్ దుస్తులు ధరించే మ‌హేష్ త‌న‌కు తానే కొత్త‌గా క‌నిపించాడు. జ‌క్క‌న్న తో సినిమా అంటే మామూలుగా ఉండ‌ద‌ని అప్ప‌టికే అర్ద‌మైంది మ‌హేష్ కి . చిన్న ఈవెంట్ విష‌యంలోనే మ‌హేష్ ని అంత కొత్త‌గా ప్ర‌జెంట్ చేసాడంటే? మును ముందు జ‌రిగే ఈవెంట్ల‌లో మ‌హేష్ ని ఇంకెంత స్టైలిష్ గా చూపిస్తాడు? అన్న చ‌ర్చ నెట్టింట జ‌రుగుతోంది.

మ‌హేష్ మైండ్ లో ఫిక్సైయ్యాడు:

వేడుక రోజే భ‌విష్య‌త్ ఈవెంట్ల‌ల‌లో త‌న‌తో చొక్కా విప్పించినా విప్పించేస్తాడ‌ని మ‌హేష్ అనేసాడు. అంటే త‌దుప‌రి జ‌రిగేది అదే కార్య‌క్ర‌మమ‌ని మ‌హేష్ కూడా మైండ్ లో బ్లైండ్ గా ఫిక్సైపోయాడు. ఈ సినిమా కోసం మ‌హేష్ లుక్ మార్చాడు. బాడీ షేప్ మార్చాడు. లుక్ ప‌రంగా సిక్స్ ప్యాక్ లో కి మారాడు. మ‌రి ఆ సిక్స్ ప్యాక్ ని సినిమాలో చూపిస్తే కిక్ ఏముంటుంది? సినిమాలో ఎలాంటి స్టార్ అయినా చొక్కా విప్పుతాడు. ఏదో యాక్ష‌న్ సీన్ లో దేహం హైలైట్ అవుతుంది. అది కాదు క‌దా? అభిమానులు..తెలుగు ఆడియ‌న్స్ కొరుకునేది.

రాజ‌మౌళి త‌గ్గే ర‌కం కాదు:

ప్ర‌చార కార్య‌క్క‌ర‌మాల్లో చొక్కా విప్పితేనే హైలైట్. రాజ‌మౌళి కూడా మ‌హేష్ విష‌యంలో ఇలాగే ఆలోచిస్తాడ‌ని అంచ‌నాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. దాని ఆధారంగానే మ‌హేష్ ఇంకా చొక్కా విప్పిస్తారేమోన‌ని కంగారు ప‌డ్డాన‌న్నారు. కానీ ఏదో రోజు అది జ‌రుగుతుందని మాత్రం మ‌హేష్ పిక్సై ఉన్నాడు. రాజ‌మౌళి కూడా ఈ విష‌యంలో ఎంత మాత్రం త‌గ్గ‌డు. త‌న హీరోని ఎలా చూపించాలో? ఎంత‌లా హైలైట్ చేయాలో? అత‌డి క‌న్నా ఎవ‌రికి గొప్ప‌గా తెలుస్తుంది.