మహేష్‌ను మెప్పించిన పీసీ యాక్షన్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో ఈ మధ్య యాక్టివ్‌గా ఉంటున్నారు.
By: Ramesh Palla | 24 Jan 2026 3:47 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో ఈ మధ్య యాక్టివ్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా తనకు నచ్చిన సినిమాలు, తనకు నచ్చిన సినిమా ట్రైలర్స్, తన అనుకున్న వారి సినిమా ప్రమోషన్ వీడియోలను షేర్ చేయడం ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సినిమాలను చూస్తూ ఆ సినిమా బాగుంటే సోషల్ మీడియా ద్వారా తప్పకుండా తన అభిప్రాయంను మహేష్ బాబు చెబుతూ ఉంటాడు. అలాంటిది తన కో స్టార్ అయిన ప్రియాంక చోప్రా నటించిన సినిమా యొక్క ట్రైలర్ విడుదల అయితే చూడకుండా ఉంటాడా... ఆ సినిమా యొక్క ట్రైలర్ ను చూడటం మాత్రమే కాకుండా చాలా బాగుంది అంటూ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయంను తెలియజేసి అందరి దృష్టి ఆ సినిమా పై, ఆ సినిమా ట్రైలర్ పై పడేలా చేశాడు. మహేష్ ట్వీట్ తో తెలుగు ప్రేక్షకుల్లో ఆ సినిమా పై ఆసక్తి పెరిగింది.
ప్రియాంక చోప్రా ది బ్లఫ్ మూవీ ట్రైలర్..
ఇంతకు ఆ సినిమా ఏంటంటే... ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించిన 'ది బ్లఫ్'. ఫ్రాంక్ ఇ. ప్లవర్స్ దర్శకత్వం వహించిన ఈ స్వాష్‌బక్లర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంను అమెజాన్ ప్రైమ్ ద్వారా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ప్రియాంక చోప్రాతో పాటు ఈ సినిమాలో కార్ల్ అర్బన్, ఇస్మాయిల్ క్రజ్ కోర్డోవా, సఫియా ఓక్లే-గ్రీన్, టెమురా మోరిసన్ తదితరులు నటించారు. ఈ భారీ యాక్షన్ సినిమాను ఓటీటీ ద్వారా ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో విడుదల అయిన ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ ను ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు అన్నట్లుగా ట్రైలర్ ను చూస్తే అనిపిస్తోంది. ప్రియాంక చోప్రా చేసిన యాక్షన్ సీన్స్ సైతం సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అనే అభిప్రాయంను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ట్రైలర్ కి మహేష్ బాబు రివ్యూ...
సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఈ సినిమా పై ఆసక్తి కలిగింది అంటూ ట్రైలర్ ను చూసి ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. ది బ్లఫ్ సినిమాలోని ప్రియాంక చోప్రా యాక్షన్ సీన్స్ చూసి షాక్ అయ్యాను అన్నట్లుగా పోస్ట్ పెట్టాడు. యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా నటించారు అంటూ, చిత్ర యూనిట్ సభ్యులు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ సినిమాలోని ప్రియాంక చోప్రా లుక్, ఆమె పాత్ర తీరు విభిన్నంగా ఉండబోతున్నాయి అని ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతోంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పీసీ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఇలాంటి సమయంలో ఆమె చేసిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే హాలీవుడ్ రేంజ్ లో రాజమౌళి - మహేష్ బాబు సినిమాకు మరింత క్రేజ్, బజ్ పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక చోప్రా ఇప్పటికే హాలీవుడ్‌లో మంచి విజయాలు సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఆమె మరో హిట్ కొట్టేనా చూడాలి.
మహేష్ బాబు - రాజమౌళి వారణాసి మూవీ..
ఇక రాజమౌళి, మహేష్ బాబు కాంబో మూవీ వారణాసి విషయానికి వస్తే ఆ మధ్య రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్‌ను నిర్వహించడం జరిగింది. ఆ సమయంలో సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది, చకచక షూటింగ్ జరుపుతున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమా షూటింగ్‌ను ముగించే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను రాజమౌళి ఆసక్తికరంగా మల్చుతున్నట్లు చెబుతున్నారు, రామాయణం ఇతివృత్తంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర యూనివర్శిల్ అప్పీల్ ఉండే విధంగా ఉంటుందని, అందుకే సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఆడబోతుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.
