మహేష్ నెక్స్ట్ కోసం సరికొత్త ప్లాన్!
సూపర్‌స్టార్ మహేష్ బాబు తొలి సారి భారీ పాన్ ఇండియా మూవీ `వారణాసి`లో నటిస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Entertainment Desk | 27 Dec 2025 11:24 AM ISTసూపర్‌స్టార్ మహేష్ బాబు తొలి సారి భారీ పాన్ ఇండియా మూవీ `వారణాసి`లో నటిస్తున్న విషయం తెలిసిందే. జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కోసం మహేష్ దాదాపు రెండేళ్లు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ మరో ఎనిమిది నెలల్లో పూర్తి కాబోతోంది. ఎపిక్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ డ్రామాగా రూపొందుతోంది.
వరల్డ్ వైడ్‌గా భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ మూవీని 2027లో ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ భారీ పాన్ వరల్డ్ మూవీ తరువాత మహేష్ నెక్స్ట్ ప్లాన్ ఏంటీ? ..ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభాస్‌ని `బాహుబలి`తో జక్కన్న పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టిన విషయం తెలిసిందే. ఆ క్రేజ్‌ని కాపాడుకుంటూ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.
`ఆర్ఆర్ఆర్` తరువాత రామ్ చరణ్, ఎన్టీఆర్ ట్రై చేసి విఫలమయ్యారు. ఇప్పుడు మరోసారి `పెద్ది`తో చరణ్, డ్రాగన్‌తో ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రేజ్‌ని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడు `వారణాసి` తరువాత మహేష్ వంతు రాబోతోంది. దీని తరువాత మహేష్ ఎలాంటి సినిమా చేస్తాడు? చరణ్, ఎన్టీఆర్‌ల తరహాలో తడబడతాడా? లేక ప్రభాస్ తరహాలో వరుస పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తాడా? అని చర్చి జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట జక్కర్లు కొడుతోంది. `వారణాసి` పాన్ వరల్డ్ మూవీ అనే స్థాయిలో రూపొందుతోంది. మరోబ ఎనిమిది నెలల్లో షూటింగ్ పూర్తి కానుండటంతో మహేష్ ఈ ప్రాజెక్ట్ నుంచి ఫ్రీ అయిపోతాడు. దీని క్రేజ్‌ని బట్టి మహేష్‌తో సినిమాలు చేయడానికి భారీ స్థాయిలో ప్రొడ్యూసర్‌లు పోటీలు పడతారు. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే మహేష్ మాత్రం దానికి సిద్ధంగా లేడట. తన మైండ్‌లో కొత్త ప్లాన్ రన్నవుతోందని ఇన్ సైడ్ టాక్.
`వారణాసి` క్రేజ్‌ని ప్రాపర్‌గా వాడుకుంటూ బయటి బ్యానర్‌లో కాకుండా తన ఎంజీబి బ్యానర్‌లోనే నెక్స్ట్ మూవీ చేయాలనుకుంటున్నాడట. ఒక వేళ తన బ్యానర్‌లో సినిమా చేసినా అభ్యంతరంలేదని, తాను కూడా భాగస్వామిగా వ్యవహరిస్తానని ముందుకొచ్చే నిర్మాతలని కలుపుకుని సినిమా చేయాలను ప్లాన్‌లో మహేష్ ఉన్నట్టుగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగానే మహేష్ తన కొత్త ప్రాజెక్ట్‌ని జూన్‌లో భారీ స్థాయిలో ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే `వారణాసి` తరువాత జెట్ స్పీడుతో మహేష్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం.
